మరీ అనసూయ వంటి ఐటమ్ సాంగ్స్ చేసుకునే నటి వ్యాఖ్యలకు అంత ఇంపార్టెన్స్ ఏంటి సార్ అని విసుక్కున్నాడు ఓ మిత్రుడు… నిజమే, కానీ నిన్నంతా ఆమె వివాదమే ట్విట్టర్‌లో ట్రెండింగ్… బొచ్చెడు మీమ్స్ వెల్లువెత్తాయి… పైగా నవ్వు పుట్టించే తిక్క వాదన… దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లలోనూ ఆమె బెదిరింపులకు ప్రయారిటీ స్పేస్… ఓసారి చెప్పుకోవాలి… మరి తెల్లారిలేస్తే టీవీల్లో కనిపించి పలకరించే మొహం కదా…
ఐనా మనం ప్రముఖ మేధావులు, సైంటిస్టులు, విద్యావేత్తలు, సామాాజికవేత్తల గురించి రాసుకునే రోజులా ఇవి..? బండ్ల గణేష్, అనసూయ, కేఏపాల్, కరణ్ జోహార్‌లే కదా ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు… వర్తమాన వార్త ‘ఖర్మా’నుసారిణి..!! నిజానికి బండ్ల గణేష్ అంకుల్ కాస్త నయం, అదేదో సినిమా ఫంక్షన్‌లో బహిరంగవేదిక మీద పూరీ జగన్నాథ్‌ను ఏకిపడేశాడు… పెళ్లాన్ని విడిచిపెట్టి, ఎవత్తినో పట్టుకుని ఏడుస్తావేమిటి అని ఈడ్చికొట్టాడు…
Ads
అనసూయ విషయానికొస్తే… కేసీయార్ చెబుతుంటాడుగా… నువ్వు గోకినా గోకకపోయినా నేను మాత్రం గోకుతూనే ఉంటా అని… సేమ్, ఈమె కూడా అంతే… ఎప్పుడూ ఏదో ఒకటి గోక్కుంటూనే ఉంటుంది… కొన్ని చదివితే నవ్వు పుట్టిస్తే, మరికొన్ని ఆమె పట్ల జాలి కలిగిస్తయ్… ఫాఫం, ఆమె దిమాక్‌లో చటాక్ రేంజ్ అంతేలే అనిపిస్తయ్… ఒకసారి పాపులారిటీ వస్తే చాలు, ఇక బుర్ర అంటే మాదే అని ఠంగ్ ఠంగ్ అని చప్పుడువచ్చేలా కొట్టిచూపిస్తుంటారు కొందరు… సేమ్…
ఆంటీ అని తనను ఎవరైనా అంటే కేసు పెట్టేస్తుందట, కటకటాలపాలు చేస్తుందట… సైబర్ క్రైమ్ వాళ్లకు చెప్పిన, ఎన్ని వేల మందినైనా సరే, ఇక లోపల వేయడమే అని ట్విట్టర్‌లో తెగ ఆయాసపడిపోయింది… బిగ్‌బాస్ అయిదో సీజన్‌లో కరాటేకల్యాణి ఎగబోత, ఆయాసం యాదికొచ్చినయ్… ఆంటీ అనేది బూతా, అలా ఎవరినైనా పిలిస్తే సైబర్ క్రైమ్ వాళ్లు కేసు పెట్టి లోపలేస్తారా..? ఫాఫం, సైబర్ క్రైమ్ వాళ్లు పెద్ద పెద్ద కేసుల విషయంలో కిందామీదా పడుతూ కష్టపడుతున్నారు… ఇప్పుడు వాళ్లు ఆంటీ కేసులు పెట్టాలా..? అసలు అనసూయ వంటి లెజెండరీ స్టేటస్ ఉన్న తారలకు ఏ కేసులు ఎవరు పెడతారో తెలుస్తుందని మనం ఎలా అనుకుంటాంలే…
లైగర్ సినిమా తన్నేసిన ఆనందంలో ఆమె ఓ ట్వీట్ పెట్టింది… చేసిన కర్మ ఊరకే పోదు, అనుభవించండి అన్నట్టుగా… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇక ట్రోలింగ్‌తో విరుచుకుపడ్డారు… అసలే లైగర్ తన్నేసిన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు కదా… అనసూయ దొరికింది… ఆమె ‘ఒక్కొక్కడి స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నా, ఎవడినీ వదలను, నాతో పెట్టుకున్నందుకు బాధపడేలా చేస్తా’ అని ప్రతిసవాళ్లు విసురుతూ కావల్సినంతగా పెట్రోల్ పోస్తూ పోయింది…
ట్రోలర్లకు జవాబులు ఇచ్చిన తీరు కూడా ఫాఫం అనిపించేలా ఉన్నదే… నువ్వు నాకేమైనా చుట్టమా ఆంటీ అని పిలవడానికి..? నన్ను శ్రీమతి అనసూయా భరధ్వాజ్ గారూ అని పిలవాలి… ఆంటీ అని పిలవడం ఏజ్ షేమింగ్, అంటే నేరం, అందుకే కేసు పెడతా… ఇలా సాగిపోయాయ్ ఆమె జవాబులు… వార్నీ, ఈ ఏజ్ షేమింగ్ ఏంటో, ఆంటీ అంటే కేసేంటో అర్థం గాక నెటిజనం బిక్కచచ్చిపోయారు… ఫాఫం ట్రోలర్లు కూడా ఆంటీ అన్నారు గానీ, వెకిలిగా ఏయ్ మరదలా అని కన్నుకొట్టలేదుగా… ఐనా ఆంటీ అంటే అంత ఉలిక్కిపాటు దేనికి..?
చెడ్డీ బనీన్లు వేసుకుని, ఎవరేమైనా అంటే వాళ్ల మీదకు కయ్ కయ్ అని లేస్తుంది ఆమె… చేసేవి ఐటమ్ సాంగ్స్… కనీసం ఆంటీ అని కూడా అనొద్దా ఫాఫం రసప్రియులు… ఐనా ఆంటీ అంటే అత్త అని మాత్రమే కాదు, పిన్ని కూడా… అది తిట్టెలా అయ్యింది..? ఐనా బుర్రలు బద్దలు కొట్టుకోవడం దేనికి..? ఆంటీ, అంకుల్, తాత, కాకా, చిచ్చా, పెద్దమ్మ, చెల్లె, వదిన, మరదలు, బామ్మ, మామ్మ, తమ్ముడు, అన్న… ఇలాంటి పదాల్లో బూతులు ఏవో, ఎవరికి మాత్రమే వాడాలో క్లారిటీ ఇవ్వడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కమిటీని వేసి, అనసూయనే ఛైర్మన్‌ను చేస్తే సరి… అవసరమైతే పట్టాభి, కొడాలి నాని, గోరంట్ల తదితరుల సహకారమూ తీసుకోవచ్చు… లేకపోతే ఏమిటీ ఖర్మ… ఇలాంటివాళ్లు సెలబ్రిటీలు, లెజెండ్లు, నీతిబోధకులు..!!
చివరగా నెట్ లో కనిపించిన ఒక పంచ్ మీమ్…. అనసూయ కేసులు పెట్టడానికి సైబర్ క్రైమ్ స్టేషన్ వెళ్లిందట… ఆమెను కూర్చోబెట్టిన ఒక ఉద్యోగి “చెప్పండి ఆంటీ, ఏమిటి కంప్లైంట్” అని అడిగాడట…!!
Share this Article