జగన్ బీజేపీతో సఖ్యతతో ఉంటున్నాడు… అది అందరికీ తెలిసిందే… అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ తను బెయిల్ మీదే ఉన్నాడు కాబట్టి బెయిల్ రద్దుపై సీబీఐ దూకుడుగా వ్యవహరించకుండా బీజేపీ హైకమాండ్ కాపాడుతోంది అనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నదే… నిజానికి విధేయంగా ఉండటం అనేది జగన్ తత్వంలోనే లేదు, కానీ ఇది తప్పనిసరి కావడంతో బీజేపీతో బాగుంటున్నాడు అనేది ఆ చర్చల సారాంశం… వాస్తవానికి అదే కాదు, వైఎస్ వివేకా మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా జాగ్రత్తపడుతున్నాడనీ మరో ప్రచారం…
వివేకా మర్డర్ కేసు జగన్‌కు ఎప్పుడూ ఓ తలనొప్పే… మొదట్లో చంద్రబాబును నిందించిన జగన్, సీబీఐ దర్యాప్తు కావాలని అడిగిన జగన్, అధికారంలోకి వచ్చాక స్టాండ్ మార్చాడు… సీబీఐ అక్కర్లేదన్నాడు… స్టేట్ పోలీస్ ఈ హత్య కేసు సాల్వ్ చేస్తారన్నాడు… కానీ వివేకా కూతురు పట్టు వదల్లేదు… మొత్తానికి కేసు సీబీఐ చేతుల్లోకి వచ్చింది… మర్డర్ చేసింది సొంత బాబాయ్‌నే అయినా సరే, అవినాశ్‌రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికే జగన్ ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి… కానీ..?
Ads
సీబీఐ స్పష్టంగా కోర్టులోనే చెబుతోంది… వివేకా మర్డర్ వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నాడని…! నిజానిజాలు ఇప్పట్లో తేలవు, అంత త్వరగా తేలిపోయే కేసు కాదు ఇది… కానీ సీబీఐ సునీల్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ కోర్టుకు సమర్పించిన కౌంటర్ పిటిషన్‌లో చాలా బ్లాస్టింగ్ వివరాలున్నయ్… సీబీఐ జగన్ పట్ల మరీ సానుకూల వైఖరిని ఏమీ ప్రదర్శించలేదు… ఆ హత్య ఎలా జరిగింది, మోడస్ ఆపరెండీ ఏమిటి, హత్య తరువాత ఏం చేశారు నిందితులు అనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… కానీ రెండు పాయింట్లు మాత్రం విశేషంగా అనిపించాయి…
1) అవినాశ్‌రెడ్డి ఉదయం (మర్డర్ జరిగినరోజు) 6.32 నిమిషాలకు 9000266234 నంబర్‌కు కాల్ చేశాడు… ఆ నంబర్‌కు అవినాశ్ 351 సెకన్లు మాట్లాడాడు… 6.40 గంటలకు, 6.41 గంటలకు మరో రెండు కాల్స్ చేశారు… ఇక్కడి వరకే సీబీఐ పరిమితమైంది… కానీ ఆంధ్రజ్యోతి మాత్రం దీనిపై తన కథనంలోనే క్లారిటీ ఇస్తోంది… ఈ నంబర్ జగన్ సతీమణి భారతిరెడ్డి పీఏ నవీన్ పేరిట ఉంది… ఆమెతో మాట్లాడాలంటే ఈ నంబర్‌కే కాల్ చేయాలి… నవీన్‌ను సీబీఐ ఇటీవల ప్రశ్నించింది అని వివరంగా చెబుతోంది ఆంధ్రజ్యోతి కథనం…
అంటే ఏమిటి..? ఆమె కాల్స్ రిసీవ్ చేసుకునే నంబర్‌కు అవినాశ్ కాల్ చేసి, మొత్తం వివరాలు చెప్పాడంటూ ఆమెను, జగన్‌ను ఈ మర్డర్ కేసులోకి నేరుగా లాగే ప్రయత్నమా..? అప్పుడు ఈ కేసు మరింత క్లిష్టంగా మారే అవకాశముంది… మరి ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ చేసిన సాయం ఏముంది..? తలమీద మరో కత్తిని వేలాడదీసి, అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందా..? (జగన్‌కు తెలిసే ఈ హత్య జరిగింది అనేది నిజమైతే, మొదట్లో తనే స్వయంగా సీబీఐ దర్యాప్తును ఎందుకు కోరతాడు..?) సో, ఏపీ రాజకీయాల్లో చాలా సంక్లిష్టమైన చిక్కుముడిగా మారుతోంది ఈ కేసు..!
2) సీబీఐ ఈ కేసు దర్యాప్తులో పలు సాంకేతికాంశాలను వాడుకుంటోంది… అవినాశ్ కాల్ హిస్టరీని సేకరించి, దాని ఆధారంగా కేసును బిల్డప్ చేస్తోంది… మర్డర్ కేసును గుండెపోటుగా ప్రచారం చేయడం దగ్గర్నుంచి సాక్ష్యాల తుడిపివేత ప్రయత్నాల దాకా అవినాశ్‌కు వ్యతిరేకంగా వివరాల్ని క్రోడీకరిస్తోంది… గూగుల్ మ్యాప్స్ ఆన్‌లో ఉంటే (ఆన్ లో లేకున్నా సరే) సదరు కస్టమర్ ఎప్పుడెప్పుడు ఏయే ప్రాంతాల్లో సంచరించాడో తెలుసుకోవచ్చు… అది గూగుల్ టేకౌట్ సౌకర్యం… నిందితుల లొకేషన్ హిస్టరీ తెలియడం వల్ల దర్యాప్తు మరింత సులభం… దీనికి సీబీఐ ఢిల్లీ లోని CFSL సాయం తీసుకుంది… సాధారణంగా నేరచరిత్ర ఉన్నవాళ్లు, కాన్ఫిడెన్షియల్ పర్యటనలు చేసేవాళ్లు, ఈ టేకౌట్ గురించి తెలిసినవాళ్లు ఎప్పుడూ మ్యాప్స్‌ను ఆఫ్‌లో ఉంచుతారు… లేదా మ్యాప్స్ ఫీచర్ డిసెబుల్ చేస్తారు… ఇలా నిశ్శబ్దంగా గూగుల్ మన కదలికల్ని, సెర్చింగులను రికార్డ్ చేస్తూనే ఉంటుంది…!
Share this Article