వాస్తవాలు – అపోహలు : వాసిరెడ్డి అమర్నాథ్
డెల్టా ప్లస్ ఇమ్యూన్ ఎస్కేప్ అని .. వాక్సిన్ వేసుకొన్న వారు , తోలి వేవ్ లో, రెండో వేవ్ లో కరోనా సోకిన వారు కూడా సేఫ్ కాదని దీని వల్ల మారణహోమం జరగనుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది .
దీనికి సంబంధించి ఇప్పటిదాకా అందులోబాటులో ఉన్న సమాచారం ..
Ads
ఇది మార్చ్ నెలలోనే ఇంగ్లాండ్ లో కనిపించింది . జూన్ నెల లో ఇంగ్లాండ్ లో మొత్తం 36 డెల్టా ప్లస్ కేసులు గుర్తించారు . ఇందులో 18 మంది అసలు వాక్సిన్ వేసుకోని వారే . మరో 16 మంది కేవలం సింగల్ డోసు వాక్సిన్ తీసుకొన్న వారు . 36 మందిలో ఒక్కరూ మరణించలేదు .
మధ్య ప్రదేశ్ లో మొత్తం అయిదు డెల్టా ప్లస్ కేసులు కనుగొన్నారు . ఇందులో నలుగురు వాక్సిన్ తీసుకొన్న వారు . వారికి ఏమీ కాలేదు . ఐదో వ్యక్తి ఉజ్జయిని కి చెందిన వాడు . అతను వాక్సిన్ తీసుకోలేదు . అతను మరణించాడు .
ఇక కేరళ లో ముగ్గురిలో డెల్టా ప్లస్ వైరస్ కనిపించింది . ఇందులో నాలుగేళ్ళ పిల్లవాడు .. ఇద్దరు యాభై ఏళ్ళు దాటిన మహిళలు .. ముగ్గురూ సులభంగా దీని బారినుంచి బయటపడ్డారు .
మహారాష్ట్ర లో ఈ వైరస్ వేరియంట్ ను గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే గుర్తించారని NDTV చర్చ లో దేశముఖ్ అనే డాక్టర్ చెప్పారు .
డెల్టా వేరియంట్ నేపాల్ లో పురుడు పోసుకొందని మరో అభిప్రాయము . నేపాల్ లో మే నెల రెండవ వారం నుంచి కేసులు తగ్గిపోతున్నాయి . అక్కడ కేసులు – మరణాల నిష్పత్తి చూస్తే మిగతా దేశాల్లో వున్నటే వుంది . అసాధారణ స్థాయిలో మరణాలు లేవు .
ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే జాల్నా రత్నగిరి జిల్లాలో ఈ వేరియంట్ కేసులు కనిపించాయి . ఆ రెండు జిలాల్లో కూడా ఇప్పుడు అతితక్కువ స్థాయిలో కేసులు వస్తున్నాయి .
అయ్యా .. చెప్పొచ్చేది ఏమిటంటే .. కాగడా పెట్టి ప్రపంచమంతా వెదికినా ఈ డెల్టా ప్లస్ వారియంట్ వాక్సిన్ ల కు చిక్కదు.. టి సెల్స్ కు దొరకదు .. సోకినవాడు సోకినట్టే పోతాడు అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క ఆధారం దొరకడం లేదు . కొంత మంది శాస్త్రవేత్తలు ఇది మూడో వేవ్ తెస్తుంది అని చెప్పడానికి వాక్సిన్ ల కు దొరకదు అని చెప్పడానికి ఇప్పుడు ఉన్న డేటా సరిపోదు అంటున్నారు .
నిజంగానే దీనికి సంబంధించి మనం అందరం భయపడాల్సిన సమాచారం ఉంటే తప్పకుండా పోస్ట్ చేస్తాను . ఇప్పటిదాకా ఏమీ లేదు .
Share this Article