……. రామోజీరావు ఇన్నేళ్లుగా తన ఈనాడు సర్క్యులేషన్ పెంచడానికి, తన పత్రికకు యాడ్స్ తీసుకురావడానికి ఉపయోగపడిన ఎంఎంపీఎల్ను మూసేశాడు… ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చి, సంతకాలు చేయించుకుని, CIEL అనే ఓ బెంగుళూరు బేస్డ్ కంపెనీ పేరిట కొత్త అపాయింట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు… అంటే డెడ్‌వుడ్ (పనికిరారని సంస్థ భావించిన సీనియర్ ఉద్యోగులు, జీతం ఎక్కువ అని భావించబడే ఉద్యోగులు) తొలగించి, ఇంకా చీప్ రేట్లకు ఆ పనులు చేయించుకునే ఎత్తుగడ… ఇన్నాళ్లూ సంస్థ కోసం రక్తమాంసాలు ధారబోసినవాడికి మిగిలేది… అదొక్కటీ అడక్కండి… రామోజీరావుకు ఆది నుంచీ అలవాటే… మంచి యంగ్ ఏజ్‌లో రక్తాన్ని, శ్రమను, చెమటను, ఆరోగ్యాన్ని పిండేసుకుని, కాస్త సీనియర్లు అయ్యాక, పిప్పిని వదిలేస్తాడు…
ఇది ఒక వార్త… అదలా వదిలేద్దాం… చివరకు ఈనాడును ఇంకా కుదించేస్తారు… రోజులు బాగాలేవు… అందరూ అనుకుంటున్నట్టు ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు… తాజాగా ముంబై మిర్రర్ పత్రిక మూతపడినట్టే… అంటే దినపత్రికగా మూసేశారు… ఇకపై వారపత్రిక వస్తుంది… వచ్చీరానట్టు… ఇది పుణె మిర్రర్ వంటి ఇతర ప్రాంతాల మిర్రర్ ఎడిషన్లకు కూడా పాకబోతున్నది… డిజిటల్ ఎడిషన్ల మీదే కాన్సంట్రేట్ చేయబోతున్నది… మరి అంతటి బలమైన టైమ్స్ గ్రూపే ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోలేక పోతోంది… ఇక ఓ మోస్తరు పత్రికల గురించి చెప్పేది ఏముంది..? బోనస్, ఈఎల్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి అని ఈనాడు గ్రూపు ఉద్యోగులు తాత్కాలికంగా సంబరపడొచ్చుగాక… అది రాబోయే ఏవో పిడుగులకు ముందుగా కాస్త తీపి తినిపించడం కావచ్చు కూడా…
Ads
అవునూ, డిజిటల్ ఎడిషన్లంటే గుర్తొచ్చింది… ఇదే ఈనాడు ఈమధ్య దక్షిణాది ప్రధాన పత్రికలతో కలిసి ఓ ఆదాయకూటమిని కట్టింది… అంటే యాడ్స్ సిండికేట్… అంటే సౌత్ ప్రీమియర్ పబ్లిషర్స్ పేరిట ఓ కొత్త దుకాణం స్టార్ట్ చేశారు… ఒక ప్రకటన ఇస్తే అది మూడున్నర కోట్ల మందికి చేరుతుంది అనేది దాని తాజా ప్రచారం… ఇదొక మార్కెటింగ్ జిమ్మిక్… ఇప్పటికే యాడ్స్ పడిపోయి, తన పాత ధోరణులకు భిన్నంగా, అడ్డగోలుగా టారిఫ్ సబ్సిడీలు ఇస్తున్న ఈనాడు… ఇంకాస్త ఆదాయం పెంచుకోవడం కోసం ఈ కొత్త పాట్లు…
దినమలార్, మనోరమ, ప్రజావాణి, ఈనాడు డిజిటల్ ఎడిషన్స్ ఇందులో పార్టనర్స్… వీటి డిజిటల్ సబ్‌స్క్రయిబర్స్, రోజువారీ వ్యూస్ గట్రా వివరాలతో ప్రచారం చేసుకుంటున్నారు… రాబోయే రోజుల్లో ప్రింట్ మీడియా ఇంకా దెబ్బతిని, డిజిటల్ మీడియా పుంజుకోబోతోంది… మొత్తం యాడ్స్ రెవిన్యూలో డిజిటల్ వాటా బాగా పెరగబోతోంది… అది కేప్చర్ చేయడం కోసం ఈ ఎత్తుగడ… నిజానికి ఇది కొత్తేమీ కాదు… ఈనాడు, దిహిందూ నడుమ చాలాకాలంగా యాడ్స్ పొత్తు ఉన్నది… సాక్షిని టైమ్స్ వాళ్లు ఇలాంటి భాగస్వామ్యమే అడిగినా జగన్ ఒప్పుకోలేదు… ఎహె, మాకు ఏ పొత్తులూ వద్దుపో అన్నాడు…
నిజానికి ఈనాడుకు కూడా ఈ యాడ్స్ పొత్తులు గతంలో పెద్దగా ఫాయిదా ఏమీ ఇవ్వలేదు… కాకపోతే ఇది కొత్తగా ఓ డిజిటల్ యాడ్స్ కూటమి… పైగా యాడ్స్ ఇచ్చేవాడు స్థానిక ప్రయారిటీలు, ఆయా రాష్ట్రాల్లో తన వినియోగదారుల సంఖ్యను చూసుకుంటాడు… ఏది నంబర్ వన్ పత్రికో ఎంచుకుని, టారిఫ్ బేరమాడుకుంటాడు నేరుగా… ఈ ప్యాకేజీల జోలికి రారు సాధారణంగా…! ఏతావాతా అర్థమయ్యేది ఏమిటయ్యా అంటే… డెయిలీ పేపర్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమీ బాగాలేదు, మారలేదు, మారదు, క్రమేపీ షట్ డౌన్లు పెరుగుతాయి, అవి డిజిటల్ వైపు వెళ్లిపోతాయి… అదీ ఈ స్టోరీలోని అసలు సారాంశం…
Share this Article