హమ్మయ్య… అంతటి విధ్వంసకారి కరోనా నుంచి ఈ ప్రపంచం ఎలా రక్షింపబడిందా అని ఇన్నాళ్లూ సందేహం ఉండేది… ఇప్పుడు అలాంటి సందేహాలన్నీ తీర్చేశాడు కేసీయార్ అభిమాన వైద్యాధికారి శ్రీనివాసరావు… వేక్సిన్లు, మందులు, డాక్టర్ల వల్ల కాదట… కేవలం ఏసు క్రీస్తు కృపవల్లే కరోనా పారిపోయిందట…
ష్, మరి చైనాను వణికిస్తూ, మళ్లీ ప్రపంచం మీద పడగ జాపుతున్న కొత్త వేరియంట్ మాటేమిటని అడక్కండి… సారు గారికి కోపమొస్తుంది… నిజానికి ఈయన ఫస్ట్ నుంచీ వివాదాస్పదుడే… అటు హరీష్‌రావు నిద్రాణంగా ఉన్న వైద్యారోగ్య శాఖను కదిలించి, కొన్ని మంచి పనులు చేస్తున్నాడు… ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది… కానీ ఇలాంటి ఉన్నతాధికారులతో ఇంకా ఏం సాధిస్తాడు పాపం… ఈ మాట ఎందుకు అంటున్నానంటే…
కరోనా పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా, చిత్రవిచిత్రంగా స్టేట్‌మెంట్లు ఇచ్చేవాడు… ఆమధ్య ఏవో క్షుద్రపూజల వీడియోల్లో కనిపించి కొన్నాళ్లు రచ్చ జరిగింది… ఈమధ్య కేసీయార్ కనిపించగానే కాళ్ల మీద పడిపోయాడు… ఏదో అసెంబ్లీ సీటుకు టికెట్టు కావాలట… ప్రస్తుత ఉద్యోగ బాధ్యతల నుంచి ఆయనకు తక్షణం విముక్తి ప్రసాదించి, కేసీయార్ ఆయన్ని ఆ సీట్లో వర్క్ చేసుకొమ్మని చెప్పొచ్చు కదా పాపం…
Ads
ఏసు క్రీస్తు దయ వల్లే కరోనా పారిపోయిందనే స్టేట్‌మెంటు పాస్ చేయడం పెద్ద తప్పేమీ కాదు… ఒక ఉన్నతాధికారికి దేవుడి మీద విశ్వాసం ఉండటం కూడా తప్పు కాదు… కానీ హెల్త్ డైరెక్టర్ వంటి ఓ కీలకమైన పొజిషన్‌లో ఉండగా…, ఒకవైపు మళ్లీ కాలర్ కరోనా ట్యూన్లు స్టార్టయ్యాయి… విదేశీ ప్రయాణికుల స్క్రీనింగు స్టార్టయింది… ఆల్‌రెడీ omicron bf7 కొత్త వేరియంట్ల కేసులు ప్రవేశించినట్లు వార్తలొస్తున్నాయి… అన్ని రాష్ట్రాలకూ కరోనా కొత్త వేరియంట్లు, అలర్ట్ మెసేజులు జారీ అయ్యాయి… ఈ స్థితిలో ఒక రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ చెప్పాల్సింది ఇదా..?
కాస్త బాధ్యత ఉన్న అధికారి అయితే మళ్లీ మాస్కులు ధరించండి, సమూహాల్లోకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి అనే సందేశం ఇస్తాడా..? ఏమీ పర్లేదు, క్రీస్తు చూసుకుంటాడు అన్నట్టు మాట్లాడతాడా..? సరిగ్గా ఇదే విశ్వహిందూ పరిషత్‌కు చాన్స్ ఇచ్చినట్టయింది… ఆల్‌రెడీ అది సోషల్ మీడియాలో సదరు అధికారిని ఆడుకుంటోంది… పరోక్షంగా కేసీయార్‌ను ఆడిపోసుకోవడానికి కూడా అవకాశం తీసుకుంటోంది… అవునూ, ఇలాంటి శ్రీనివాసరావులు నీకు అవసరమా సారూ..?!
Share this Article