.
సిరియా ప్రభుత్వ తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్ళిపోయింది! సిరియా రాజధాని డమాస్కస్ లోకి ప్రవేశించిన రెబెల్స్ నేరుగా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి నినాదాలు చేశారు!
డమాస్కస్ లోకి రెబెల్స్ ఎలా ప్రవేశించారు అంటే ఒక్కడంటే ఒక్క సిరియా సైనికుడు లేడు రోడ్ల మీద.
ఒక్క బుల్లెట్ పేలలేదు! శ్రీలంక, ఆఫ్ఘనిస్టాన్, బంగ్లాదేశ్ లలో జరిగినట్లే సిరియాలో కూడా జరిగింది! అంతా ఒకే రీతిలో జరిగింది!
*******************
Ads
సిరియా మాజీ అధ్యక్షుడు బ్రతికి ఉన్నాడా?
ఇంతవరకూ నిర్ధారణ కాలేదు!
కానీ రెండు కధనాలు మధ్య ప్రాచ్యంలోని స్వతంత్ర మీడియా అవుట్ లెట్స్ లో వెలువడ్డాయి!
మొదటి కధనం :
Well.. ఒకసారి రాడార్ మ్యాప్ చూస్తే… బషర్ అల్ అసద్ శనివారం అంటే డిసెంబర్ 7 న ఉదయం డమాస్కస్ ఎయిర్ పోర్ట్ నుండి రష్యన్ తయారీ iL – 76T రవాణా విమానం బయలుదేరిన కొద్ది నిముషాలకే క్రమంగా ఎత్తు తగ్గుతూ రాడార్ స్క్రీన్ నుండి అదృశ్యం అయిపొయింది!
డమాస్కస్ ఎయిర్ పోర్ట్ నుండి గాల్లోకి ఎగిరినప్పుడు వేగంగా 3.5 కిలోమీటర్ల ఎత్తుకి ఎగిరినట్లుగా రాడార్ ట్రాకింగ్ చూపిస్తున్నది. హోమ్స్ (Homs ) పట్టణం దగ్గరికి వచ్చే సరికి 700 మీటర్ల దిగువకి దిగిపోయి హోమ్స్ పట్టణానికి పశ్చిమాన ఉన్న యస్ – సవెరీ ( Es – Saweiri ) అనే గ్రామం దగ్గర కూలిపోయినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు.
lL-76 T విమానంలో బషర్ అల్ అసద్ ఉన్నాడని, అతను చనిపోయాడని ఇరాన్ లోని టెలిగ్రామ్ ఛానెల్స్ చెప్తున్నాయి! పోనీ అల్ అసద్ భౌతిక కాయం ఎవరన్నా చూసారా? ఇంతవరకు అలాంటి సమాచారం లేదు! IL – 76T అనేది ప్రయాణీకుల విమానం కానీ లగేజీ కంపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఇంధనం ట్యాంకులు కూడా పెద్దవిగా ఉంటాయి. అలాగే ఎక్కువ మొత్తంలో ఇంధనం ఉంటుంది కాబట్టి కూలిపోయినప్పుడు ఇంధనం మండి అందులో ఉన్న వాళ్ళు పూర్తిగా కాలిపోయే అవకాశం ఉంటుంది!
ఇక టర్కీ ఇచ్చిన లేదా రష్యన్ ఆయుధ డిపో లనుండి రెబెల్స్ MANPADS(
MAN PORTABLE AIR DEFENCE SYSTEM ) Igla -S లని తీసుకొని il 76 మీద ప్రయోగించి ఉండవచ్చు! వీటిని భుజం మీద పెట్టుకొని ప్రయోగించవచ్చు!
****************
రెండవ కధనం :
పుతిన్ మాజీ గూఢచారి అని మరిచిపోవద్దు!
అసలు IL -76T లాంటి పెద్ద విమానంలో పుతిన్ ఎందుకు బషర్ అల్ అసద్ ని తరలిస్తాడు? IL 76T అనేది MANPADS కి ఈజీ టార్గెట్ అవుతుంది! కాబట్టి ప్రైవేట్ జెట్ లో రహస్యంగా దుబాయ్ కి తరలించి అక్కడి నుండి ఇరాన్ కి అక్కడి నుండి మాస్కో కి తరలించి వుండవచ్చు!
మరి కూలిపోయిన IL 76T మాటేమిటి?
IL 76T ఖాళీగా వెళ్ళింది ఇద్దరు పైలట్స్ తో! హోమ్స్ పట్టణం దగ్గరికి వచ్చేసరికి పైలట్స్ IL 76T ట్రాన్స్ పాండర్స్ ని స్విచ్ ఆఫ్ చేసి పారచూట్స్ సహాయంతో దూకేసి ఉండవచ్చు. పైలట్స్ లేని విమానం హఠాత్తుగా వేగం తగ్గిపోయి కింద పడిపోయి మంటల్లో కాలి పోయిండవచ్చు!
ఈ కధనానికి కూడా క్రెడిబిలిటీ ఉంది!
Il76t విమానాన్ని రెబెల్స్ అధీనంలో ఉన్న హోమ్స్ పట్టణం దగ్గరగా ఎందుకు తీసుకెళ్తారు? హోమ్స్ పట్టణం దగ్గరలోనే రష్యన్ ఎయిర్ బేస్ ఉన్న లటాకీయ (Latakia ) పట్టణం ఉంది. ఎయిర్ బేస్ లో సోవియట్ కాలం నాటి S-200 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. S-200 పరిధి 250 KM. రెబెల్స్ అదీనంలోనే ఉంది. కాబట్టి IL 76T కూలిపోవడం నిజం కానీ అందులో బషర్ అల్ అసద్ ఉండి ఉండకపోయి ఉండవచ్చు!
పుతిన్ కి మధ్య ప్రాచ్యంలో పట్టు ఉండాలి అంటే సిరియాతో పాటు బషర్ అల్ అసద్ అవసరం కూడా ఉంది!ఈ రోజున రష్యా సహాయం చేసే స్థితిలో ఉండకపోవచ్చు. ఉక్రెయిన్ సమస్య తీరిపోయాక మళ్ళీ సిరియా మీద దృష్టి పెడతాడు!
ఒక పోలిక చెప్తాను…
1978 ఆయుతోల్లా ఖోమేని ఇరాన్ రాజు షా పహ్లావిని దించి ఇస్లామిక్ పాలనలోకి ఇరాన్ ని తీసుకెళ్ళినప్పుడు అమెరికా షా పహ్లావికి ఆశ్రయం ఇచ్చింది. ఇది జరిగి 46 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు షా పహ్లావిని తిరిగి ఇరాన్ అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నది! బషర్ అల్ అసద్ ని కూడా రష్యా అదే విధంగా చేస్తుంది!
SO! బషర్ అల్ అసద్ రష్యాలోనే ఉండి ఉండవచ్చు! రెబెల్స్ రష్యన్ ఆయుధాల డిపోలని కానీ ఇతర రష్యన్ ఆస్తుల మీద కానీ దాడులు చేసి ధ్వంసం చెయ్యట్లేదు దేనికో తెలీదు! అదొక మిస్టరీ……. ( పార్థసారథి పొట్లూరి )
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి… సిరియా, లెబనాన్, ఉక్రెయిన్, బంగ్లాదేశ్… ప్రపంచ రాజకీయ కూటముల నడుమ ఇరుక్కుని తమ కోట్ల జనాభాను సంక్షోభంలోకి పడేస్తున్నారు పాలకులు… ఉక్రెయిన్ జెలన్‌స్కీ మరీ ఘోరం… సిరియాను హస్తగతం చేసుకున్న తిరుగుబాటుదార్ల నాయకుడు మాజీ అల్ ఖైదా,… దాన్ని మరో అఫ్ఘనిస్థాన్ చేస్తాడు… బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లాగా మరో రోగ్ కంట్రీ కాబోతోంది… దుర్మార్గ ప్రపంచ రాజకీయాలు..!!
Share this Article