ఎస్.., వర్మ అనేవాడు ఓ పైత్యం… అందులో డౌటేమీ లేదు… తను అంగీకరిస్తాడు… రకరకాల వర్తమాన సంఘటనల్ని తనదైన రీతలో కెలుకుతాడు… తన బుర్రకు తగినట్టు ఓ సినిమా తీసిపారేస్తాడు… ఇప్పుడూ అంతే… ఆ పరువు హత్య ఆధారంగా ఓ సినిమా తీశాడు… కాకపోతే లీగల్ ఇబ్బందులు రాకుండా పేర్లు మార్చాడు… అందరికీ తెలుసు ఆ హత్య ఏమిటో, ఆ కథ ఏమిటో… కానీ వర్మ చూసిన కోణం కరెక్టేనా..?
ఒక మాధవరావు… తండ్రి… ఒక నమ్రత… బిడ్డ… కనిపెంచిన ప్రేమ తనది… మన సినిమాలు, మన సీరియళ్లు, మన సాహిత్యం చేస్తున్న సమాజసేవ అంతాఇంతా కాదు కదా… చిన్న వయస్సుల్లోనే ప్రేమ… ఆ ప్రేమ ముందు ఇంకేమీ కనిపించదు… మన దిక్కుమాలిన నిర్మాతలు, దర్శకులు, కథారచయితలు, చెత్తా హీరోలు దానికి అంగీకరించరు…
అయితే పెళ్లిచేసుకోవాలి, లేదంటే చావాలి… ఈ నమ్రత కూడా ఓ దళిత యువకుడిని పెళ్లాడింది, కన్నప్రేమను పరువు గెలిచింది… ఓ కిరాయి హంతకుడి ద్వారా తండ్రి తన అల్లుడిని చంపించాడు… ఆమె విధవరాలు అయ్యింది,.. చివరకు ఆ తండ్రి కూడా ఓ సత్రంలో విషం తాగి కన్నుమూశాడు…
Ads
ఇక్కడ ఇష్యూ ఏమిటంటే… ఎంతసేపూ వర్మ ఆ తండ్రి వాదనను భుజాన మోశాడు తప్ప… అసలు కారణాల జోలికి పోలేదు… మొన్న మనం చదివాం ఓ వార్త… ఫేస్బుక్లో పరిచయమైన ఓ పదహారు సంవత్సరాల అబ్బాయి, పదమూడు సంవత్సరాల అమ్మాయి ప్రేమ కథ… అసలు స్కూళ్లు ఎందుకు లవ్ స్పాట్లు అవుతున్నాయి,,?
సరే, నిజంగానే ఆ దళిత కుటుంబం ఈ మాధవరావు ఆస్తిపై కన్నేసి, ఈ పిచ్చిదాన్ని ట్రాప్ చేసి, ప్రేమ పేరుతో రొంపిలో దింపి, పెళ్లి చేశారు సరే… నిజమే అనుకుందాం… కానీ అలాంటప్పుడు మాధవరావు ఏం చేయాలి..? అయితే ఆ పెళ్లిని అంగీకరించాలి… లేదా ఆమెను వదిలేయాలి… అంతే కదా… దేహంలో ఓ కణితి (తన దృష్టిలో..) పెరుగుతుంటే దాన్ని కట్ చేసుకోవాల్సిందే తప్ప, అయ్యో, నా దేహంలోనే పెరుగుతుంది కదా, ఇదీ నా బిడ్డే అనుకోవద్దు కదా…
సరే, ఓ తండ్రిగా తీవ్ర మనోవేదన అనుభవించాడు నిజమే… కానీ అల్లుడిని చంపిస్తే కూతురే కదా ముండరాలు అయ్యేది… పోనీ, అలా చంపిస్తే బిడ్డ మళ్లీ తన వద్దకు వస్తుంది అనుకున్నాడా..? ట్రాప్ చేసిన కుటుంబం అలా ఎందుకు వదిలేస్తుంది..? ఆమె వయస్సెంత..? ఆమె ఆలోచనల లోతు ఎంత..? ఆమెకు లోకం ఏం తెలుసని..? పైగా అప్పుడే గర్భం, కొడుకు… ఈ లాజిక్ అంతటి పెద్ద ధనిక వ్యాపారి ఎలా మరిచిపోయాడు..?
ఐనా బిడ్డ ప్రేమను తిరస్కరించడం వరకూ వదిలేద్దాం… కానీ బిడ్డ పెళ్లాడిన అల్లుడిని చంపించాలని అనుకున్నప్పుడే తను తండ్రిగా చచ్చిపోయాడు కదా… ఒక మనిషిగా మరణించాడు కదా… ఇక మాధవరావు మీద జాలిని పెంచే కథలు, సినిమాలు దేనికి..? వర్మ ఎక్కడో దారితప్పాడు… అఫ్కోర్స్, తనెప్పుడో దారితప్పాడు,… చాలా రోజులైంది… అయితే..?
ఈ కథలో ఓ నీతి చెబుతాడు… ఫో, పోయి తల్లితో ఉండు అని..! ఎందుకు..? ఇదెక్కడి సలహా..? ఇదేం నీతి..? ఇదేం తీర్పు..? అది ఆమె ఇష్టం… పైగా ఆమె తన స్వార్థం వెతుక్కుని, ప్రేమ మైకంలో తల్లి, తండ్రిని తలదన్ని వెళ్లిపోయింది కదా… ఇప్పుడు ఆ తల్లి ఎందుకు క్షమించాలి తనను..? బిడ్డ కాబట్టా..? తమ జీవితాల్ని అల్లకల్లోలం చేసిన బిడ్డ అసలు బిడ్డ ఎలా అవుతుంది..? ఆమె ప్రేమ చాలా చాలా గొప్పది కావచ్చు… కానీ ఓ తండ్రిగా మాధవరావు ఎంత చరిత్రహీనుడో… బిడ్డగా తను ఏం ఉద్దరించిందని..? ఆ అర్హత ఉందా తనకు..? ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమగా ఎందుకు ఒడిలోకి తీసుకోవాలి వర్మా..? మరీ నేల క్లాసు సినిమా ప్రేక్షకుడి భాషలో చెప్పాలంటే… తమరి బొంద… తమరి బోకే…! ఆ తల్లి నిజంగానే తన ఆస్తిని సమాజసేవకు ఉపయోగిస్తే… అదీ తన జన్మకు సార్థకత…!
డిస్ క్లయిమర్ :: మిర్యాలగూడ పరువు హత్యకూ ఈ కథకూ సంబంధం లేదని గమనించ ప్రార్థన… అవునూ, వర్మా… ఇప్పటికీ ఆ కుటుంబం ఆమెను ఎందుకు ఓన్ చేసుకుంటోంది…? ఆమె తండ్రి ఆస్తి ఎప్పటికైనా తమకు దక్కాలని ఆశతోనేనా..? అదేనా నీ భావన..? అదేనా నువ్వు చెప్పేది..? ఏ ఆస్తి కోసం ఆ కుటుంబం ఆమెను ట్రాప్ చేసిందో… మళ్లీ ఆమె తల్లి దగ్గరకు చేరి, ఆ ఆస్తికి ఓనర్ అయిపోయి, ఆ కుటుంబం వేసిన ప్లాన్ సక్సెస్ చేయాలా..? వర్మా, ఇదెక్కడి దిక్కుమాలిన తీర్పు..?
Share this Article