హేమిటో… ఈరోజుల్లో బతుకమ్మల దగ్గర పూర్నీల తుపాకులు ఎవరు కాలుస్తున్నారు.? అవన్నీ గత వినోదాలు కదా… కానీ మన హీరోలు, మన దర్శకులు మాత్రం ఆ పూర్నీల తుపాకులను మించిన వినోదాన్ని తమ సినిమాల్లో అందిస్తున్నారు… బుర్రల్లో వీసమెత్తు గుజ్జు కూడా ఉండదు, ఉంటే హీరోయిజానికి పనికిరాదు అని ఓ సామెత… మన రాజమౌళి సినిమాల్లో హీరోలు చిత్రవిచిత్ర ఆయుధాలు ధరించి నెత్తురు పారిస్తుంటారు కదా… రెండున్నర వందల మంది తుపాకులతో వచ్చినా సరే, హీరో ఇదే ఆయుధాన్ని వాడాలి, లేదా ఓ పెద్ద గన్ను (బండలు పగులగొట్టే సుత్తి) వాడాలి… లేకపోతే హీరోయిజం పండదు అట.,..
సరే, ఇప్పుడు మన హీరోలు అకస్మాత్తుగా ఇదుగో ఈ గన్స్ పట్టుకుంటున్నారు… దడదడ దడదడ కాలుస్తూనే ఉంటారు… కేజీఎఫ్-2లో యశ్, విక్రమ్‌లో కమలహాసన్, ఘోస్ట్‌లో నాగార్జున… ఏదో రాబేయే సినిమాలో అఖిల్… గాడ్‌ఫాదర్‌లో సల్మాన్, చిరంజీవి అలా అలవోకగా పూర్నీల తుపాకుల్లాగా పట్టుకున్నారు… అసలు ఈ గన్స్ ఏమిటి అని పోలీసుల్లో ఓ బాలిస్టిక్ నిపుణుడిని అడిగితే పావుగంట పడీపడీ నవ్వాడు… వాళ్లేదో ప్రేక్షకుల్ని హౌలాగాళ్లను చేస్తుంటారు… అసలు ఆ గన్స్ సైజు చూస్తే అలవోకగా దడదడ కాల్చేసే టైపులా కనిపిస్తున్నాయా,,;
అసలు ఏకే-56 వంటివే కాల్చడం కష్టం… ఓ స్టాండ్ ఆధారంగా కాల్పులు జరిగినా సరే, భుజం పగిలిపోతుంది, ట్రెయినింగ్, దానికి తగ్గ స్టామినా లేకపోతే… ఇక ఇది పోర్టబుల్ మెషిన్ గన్నా తెలియదు, లైట్ మెషిన్ గన్నా తెలియదు… లైట్ మిసైల్ లాంచరా తెలియదు… దాన్ని ఫైర్ చేయడం కృష్ణజింకల్ని పొట్టనపెట్టుకున్నంత ఈజీ కాదు… పైగా చిల్లర రౌడీలకు ఆ అమ్యూనిషన్ ఎక్కడ దొరుకుతుంది… మన దర్శకుల బుర్రల్లో గుజ్జు పరిమాణం చూసి మావాళ్లు భలే నవ్వుకుంటున్నారు’’ అన్నాడు…
Ads
అక్షరాలా నిజం… మన వాళ్లు ప్రేక్షకుల్ని హౌలాగాళ్లను చేయడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటారు… జనం నవ్వుకుంటారనే సోయి కూడా ఉండదు వాళ్లకు… ఇంకా ప్రేక్షకులు పాత కాలంలో ఉన్నారనే భ్రమల్లోనే బతుకుతూ ఉంటారు… పాదఘట్టాలు రివర్స్ కొడితే తప్ప సమజ్ కాదు… ఒక మామూలు రివాల్వర్ బుల్లెట్లు కావాలంటే నానా తిప్పలు పడాలి… మన హీరోలకు మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడు పంపిస్తున్నాడేమో మరి… కామన్ బేసిక్ సెన్స్ కూడా వాడకపోవడం మన స్పెషాలిటీ…
ఉగ్రవాదులు, ట్రెయిన్డ్ మిలిటరీ పర్సనాలిటీలు అసాధారణ పరిస్థితుల్లో, యుద్ధంలో వాడే పెద్ద పెద్ద గన్నులకు కూడా కాల్చడానికి ఓ సపోర్ట్ అవసరం… అసలు ఓ గ్రెనేడ్ లాంచర్‌ను ఆపరేట్ చేయడమే కష్టం… ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మన కిందే పేలిపోతుంది… ఐనా సౌత్ ఇండియా హీరోలు కదా, చిన్న వెంట్రుక కూడా చెదరదు… పైన ఫోటో చూడండి, సల్మాన్ చాలా స్టయిలిష్‌గా, కళ్లద్దాలు పెట్టుకుని, మోడరన్ బట్టలు వేసుకుని, సరదాగా దడదడ కాల్చేస్తున్నాడు… చిరంజీవి ఏమైనా తక్కువా..? మరింత స్టయిలిష్‌గా కాల్చేస్తున్నాడు… చాలా రియలిస్టిక్‌గా ఉంది కదా… అవును, చిరంజీవి హీరోయిజం ఎప్పుడూ అత్యంత రియలిస్టిక్‌గా ఉంటుంది… ఈ తుపాకీలాగే…!! ‘‘అరెరె, ఈమాత్రం తెలియదా మీకు..? ఇవి ఎంఎస్ గన్స్… ఎంఎస్64 మోడల్ ఇవి, మేడిన్ మొగల్తూరు… ఎంఎస్ అంటే తెలుసు కదా’’ అని మరో పోలీస్ పడీపడీ నవ్వాడు…!!
Share this Article