బిగ్‌బాస్ షోను మరీ ఓ వ్యభిచార కొంప అనే సీపీఐ నారాయణ వ్యాఖ్యల స్థాయికి వద్దులెండి గానీ… కొందరు ఆ షోను వ్యతిరేకిస్తారు… మరికొందరు పర్లేదు, అదొక వినోదం అని ఫాలో అవుతుంటారు… ఈ షో పక్కా ఓ వినోద దందా… అందులో సందేహం లేదు… కోట్ల రూపాయల వ్యవహారం…
అదొక గేమ్… శారీరిక దారుఢ్యమే కాదు, బుద్దిబలం కూడా ఉపయోగించి… తోటి హౌజ్ మేట్స్ బలాలు, బలహీనతల్ని గమనిస్తూ, వాటితో ఆడుకుని, చివరకు కాస్త అదృష్టం కూడా తోడయితే విజేతలు అవుతారు… చాలా వారాలు హౌజులో ఉంటారు… లేదా ఎలిమినేట్ అయిపోతారు… సో, అంత ఈజీ ఏమీ కాదు…
అందులోకి ప్రవేశించడానికి ఎంత కష్టమో… లోపలకు వెళ్లేముందే వోట్ల కోసం, ప్రచారం కోసం సపరేటుగా సోషల్ మీడియా టీమ్స్ ఏర్పాటు చేసుకుంటారు కంటెస్టెంట్లు… ప్రస్తుతం ఎనిమిదో సీజన్ ప్రారంభమైంది… గతంలోలాగా కామన్ మ్యాన్ అనే పిచ్చి ప్రయోగాల జోలికి పోలేదు… కానీ భిన్నరంగాలకు చెందినవాళ్లను ప్రవేశపెడితే, ఆటలో వైవిధ్యం కనిపించేది…
Ads
కానీ వినోదమే ప్రధానంగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, టీవీ నటుల్నే ఎక్కువగా తీసుకున్నారు… శేఖర్ బాషా తప్ప ఇప్పుడు హౌజులో కాస్త హాస్యం పండిచే కేరక్టర్ ఏదీ లేదు… మొదట్లో మీడియా వాళ్లను, సింగర్లను, యాంకర్లను, కొరియోగ్రాఫర్లను, చోటా దర్శకులను, సినిమా నటులను కూడా తీసుకునేవారు… అంతెందుకు..? గోగినేని బాబు వంటి హేతువాదుల్ని కూడా తీసుకున్నారు… ఆటలు రక్తికట్టేవి… ఇప్పుడు ఆ ప్రాపర్ మిక్స్ లేకుండా పోయింది…
గత సీజన్లలో పరభాష కంటెస్టెంట్లను కూడా తీసుకునేవారు… ముమైత్, మోనాల్ వంటి కంటెస్టెంట్లకు పదే పదే బిగ్‌బాస్ హెచ్చరికలు జారీచేసేవాడు, తెలుగులో మాట్లాడండి, మాట్లాడటానికి ప్రయత్నించండీ అంటూ..! ఈసారి కంటెస్టెంట్లలో తెలుగు రాని వాళ్లు ఎవరూ లేరు… కన్నడ టీవీ నటులు కూడా తెలుగులో బాగానే మాట్లాడుతున్నారు… కానీ అందరినీ స్థూలంగా గమనిస్తే… వాళ్ల సంభాషణల్లో 70 శాతం వరకూ ఇంగ్లిషే ఉంటోంది…
తెలుగు వాళ్లు కూడా ఇంగ్లిషులోనే మాట్లాడుతున్నారు… హిందీ, ఇంగ్లిషు సంభాషణల్ని ఫాలో కాలేని తెలుగు ప్రేక్షకులకు ఇది చిరాకెత్తించేదే… కెప్టెన్ ఉండడు, రేషన్ సంపాదించుకోవాల్సిందే వంటి మార్పులు అరకొర… బేసిక్ షో మారదు కదా… టాస్కులు, ఎలిమినేషన్లు, వాళ్ల నడుమ బిగ్‌బాసే గొడవలు పెట్టేసి… అందులో నుంచి వినోదం క్రియేట్ చేయాలనే ప్రయత్నం… ముగ్గురు చీఫ్‌లు అట, వేర్వేరు పడకగదులట, కాస్త గందరగోళంగానే ఉంది… ఒకరోజులోనే అంచనా వేయడం కష్టం గానీ… నిఖిల్ టఫ్ కేండిడేట్… సోనియా హైపర్… ప్రస్తుతానికి మిగతావాళ్లు సో సో…
Share this Article