గతంలో… ఊళ్లల్లో జరిగే వారసంతల్లో కనిపించేవి… రకరకాల బ్రాండ్ల పౌడర్లు, స్నోలు, సబ్బులు, ఇతర సరుకులను పోలిన ఇమిటేషన్ సరుకులు… అచ్చం అలాగే కనిపించేవి… గ్రామీణులు కొనేవాళ్లు… కొందరు ఊళ్లల్లో తిరిగి కూడా అమ్మేవాళ్లు… ఈ ఇమిటేషన్ సరుకులు (కౌంటర్ ఫీట్ ప్రొడక్ట్స్) ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు, లేదా అక్కడక్కడా జాతరల్లో, అంగళ్లలో కనిపిస్తున్నాయేమో… కానీ వాటి ఉనికి ఇప్పుడు ఓటీటీలకు విస్తరించింది… టీవీ చానెళ్లు, ఓటీటీలు, సినిమాల్లో ఒకరిని చూసి మరొకరు కాపీ కొట్టడం, అనుకరించడం ఇవ్వాళారేపు సహజమైపోయింది… కానీ ఓ జాతీయ చానెల్ సూపర్ హిట్ ప్రోగ్రాంను, అదే లోగో పెట్టుకుని మరీ, ఆహా ఓటీటీ వాళ్లు ఓ మ్యూజిక్ ఇమిటేషన్ ప్రోగ్రాం ప్లాన్ చేసిన తీరు విస్మయకరం…
సోనీలో ఇండియన్ ఐడల్ షో చాలా ఏళ్లుగా ఫేమస్… 2004 నుంచీ నడుస్తోంది… 12 సీజన్లు అయిపోయాయి… చాలా రాష్ట్రాల నుంచి గాయకులు పార్టిసిపేట్ చేస్తారు… పేరుకు హిందీ పాటల షో అయినా దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది దానికి… మొన్నటికిమొన్న మన షణ్ముఖ ప్రియకు అన్యాయం జరిగిందని కూడా బాధపడ్డాం కదా… ప్రస్తుతం బిగ్‌బాస్‌లో టాప్ ఫైవ్ ఫైనలిస్టుల్లో ఒకరిగా ఉన్న శ్రీరాంచంద్ర 2010లో అయిదో సీజన్ ఇండియన్ ఐడల్ షో విజేత… 2005లో సెకండ్ సీజన్‌లో కారుణ్య రన్నరప్… 2016లో తొమ్మిదో సీజన్‌లో రేవంత్ విజేత… సో, హిందీ పాటలే అయినా సరే మనవాళ్లు బాగానే దున్నేశారు… ఆ తొమ్మిదో సీజన్‌లోనే రోహిత్ సెకండ్ రన్నరప్, పన్నెండో సీజన్‌లో శిరీష చాలా వారాలపాటు పోటీలో ఉంది…
Ads
ఇప్పుడు ఆ రేవంత్‌ను హోస్ట్‌గా ఆహా ఓటీటీ వాళ్లు తెలుగు ఇండియన్ ఐడల్ షో స్టార్ట్ చేయబోతున్నారు… డిసెంబరు 26 నుంచి ఆడిషన్స్ అట… హహహ… సేమ్ హిందీ ప్రోగ్రామ్ లోగో… ముందు తెలుగు అని తగిలించారు, అంతే… బహుశా సోనీవాళ్ల అనుమతి తీసుకున్నారేమో తెలియదు, వాళ్లెలా ఇచ్చారో తెలియదు… ఒకవేళ అనుమతి తీసుకోకపోతే, సోనీవాళ్లు కేసు పెడితే కథ కొత్త మలుపు తిరిగే ప్రమాదముంది… ఆ ఇండియన్ ఐడల్ పాపులారిటీని ఇలా సొమ్ము చేసుకోవాలా..? ఎంచక్కా మాంచి తెలుగు పేరొకటి పెట్టుకుని ఏడవొచ్చుగా అంటారా..? ఏమో మరి… ఇమిటేషన్‌లోనూ ఇదోరకం క్రియేటివిటీ కాబోలు… అయినా సోనీ లివ్ తెలుగులో కంటెంట్ మీద బోలెడు ఖర్చు స్టార్ట్ చేసింది, మరి వాళ్ళే ఏడవొచ్చుగా…
నిజానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన స్వరాభిషేకం, పాడుతా తీయగా… అప్పట్లో వచ్చిన సూపర్ సింగర్ షో, రేలారే రేలా తెలుగులో బాగా ఆదరణ పొందిన సంగీత కార్యక్రమాలు… పాడుతా తీయగా అల్టిమేట్ షో… దాన్ని ఇప్పుడు ఆయన కొడుకు నిర్వహిస్తాడట, ఆయనకుతోడు మరో ముగ్గురు (చంద్రబోస్, సునీత, విజయప్రకాష్… ఫాఫం ఈటీవీ…) జడ్జిలట… జీటీవీ వాళ్లు ఆమధ్య సరిగమప అని ఓ షో చేసింది… అట్టహాసాలు, ఆడంబరాలు, ప్రదీప్ కామెడీ విన్యాసాలు, బోలెడు మంది మెంటార్లతో షో పెద్ద రేటింగ్స్ సాధించలేక చతికిలపడింది… మళ్లీ సెకండ్ సీజన్ స్టార్ట్ చేస్తారట… ఆడిషన్స్ మీద ప్రోమో కూడా ప్రసారం చేస్తున్నారు… ఎటొచ్చీ జెమిని వాడికి ఏ టేస్టూ లేదు, దాన్ని వదిలేయండి… బోలెడంత సాధనసంపత్తి ఉన్న స్టార్ మాటీవీ కూడా ఈవిషయంలో ఫ్లాప్… స్టార్ మ్యూజిక్ పేరిట ఓ కిట్టీపార్టీ తరహా పిచ్చి షోను సుమ యాంకర్‌గా ప్రసారం చేస్తోంది… సూపర్ ఫ్లాప్… సోనీ లివ్ తెలుగు త్వరలో ఓ ఫోక్ సాంగ్స్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నట్టుంది… ఇప్పుడిక ఆహా ఓటీటీ కూడా రంగంలోకి దిగుతోంది… కాకపోతే ఆ ఇమిటేషన్ వికారం ఏమిటో అర్థం కాలేదు…!! అవునూ, ఇండియన్ ఐడల్ అంటే మొత్తం ఇండియాను రిప్రజెంట్ చేసేలా హిందీ సాంగ్స్ పోటీ… మరి తెలుగు ఇండియన్ ఐడల్ అంటే..? ఏ భాషలో పాడాలి సార్..? ఐనా ఇండియన్ ఈజ్ ఇండియన్… మళ్లీ తెలుగు ఇండియన్, తమిళ ఇండియన్, మరాఠీ ఇండియన్ ఏమిటి మహాశయా..?!
Share this Article