Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దిక్కుమాలిన జర్నలిజం! చిన్న ఆర్టిస్టులంటే మరీ అంత లోకువా..?

October 23, 2026 by M S R

.

ఒక జర్నలిస్టు… ఓ సీనియర్, పాపులర్ కమెడియన్‌ను పట్టుకుని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అనడుగుతాడు… మరో జర్నలిస్టు… మరో వర్ధమాన నటుడిని అసలు నువ్వు హీరో మెటీరియలేనా అని ప్రశ్నిస్తాడు… ఇంకో జర్నలిస్టు… నీకు బ్యాక్ గ్రౌండ్ ఏముంది, పిల్లి కూడా నీ మొహం చూడదు అని ఓ తెలంగాణ నటుడిని వెక్కిరిస్తాడు… ఇక లేడీ ఆర్టిస్టులయితే సరేసరి…

ఇదీ తెలుగు ఫిలిమ్ జర్నలిజం స్థాయి… మరీ యూట్యూబ్ చానెళ్లు వచ్చాక ఈ ధోరణి ఇంకా విస్తరిస్తోంది… విషం చిమ్ముతోంది… ఈ వెటకారాలు ఏమిటి..? ఈ ఎత్తిపొడుపులు ఏమిటి..? తాజాగా ఓ యూట్యూబ్ పాపులర్ యాంకరుడు యంగ్ హీరో మౌళిని ఉద్దేశించి ఇలాగే ఏదో…

Ads

‘మౌళి ఎవరు? లిటిల్ హార్ట్స్ తరువాత అతడిని ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఇంకా సినిమా రాకపోతే మౌళి ఎవరో కూడా ఎవరికీ గుర్తుండదు, పెద్ద పెద్ద హీరోలనే గుర్తుపెట్టుకోరు, ఇక్కడ మౌళి, బాలి, జాలి ఏమీ ఉండదు’ …. ఇదీ తన ఫ్లో…

వీళ్లను సినిమా జర్నలిస్టులు అని సంబోధిస్తే సరైంది కాదు, నిజమే, కానీ వాళ్లే జర్నలిస్టులుగా చెలామణీ కావడమే ఓ విషాదం… సదరు యాంకరుడి వ్యాఖ్యలు సదరు యంగ్ హీరోను చులకనగా తీసిపారేసినట్టే ఉన్నాయి… ఒక ప్రశ్న… పేరున్న ఓ పెద్ద హీరోను లేదా ఏదైనా ప్రముఖ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్టిస్టుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయగలదా సదరు యూట్యూబ్ చానెళ్ల గ్రూపు..?

ఎస్, ఒక ఇంటర్వ్యూ అయితే, అక్కడే ఆ ఆర్టిస్టు ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించి, అవి ప్రసారం చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పేయవచ్చు… అవేమీ ప్రత్యక్ష ప్రసారాలు కావు కాబట్టి… తనకు అభ్యంతకరం అనిపిస్తే ప్రశ్నల్ని కూడా అవాయిడ్ చేయొచ్చు, మరీ పిచ్చి ప్రశ్నలు గనుక ఎదురైతే మైక్ పీకేసి, అక్కడే విసిరేసి నిష్క్రమించవచ్చు… కానీ ఇది ఇంటర్వ్యూ కాదు, ఇంకెక్కడో, మరేదో సందర్భంలోనో చేసిన వ్యాఖ్య…

ఏమీ కాదు, నష్టమేమీ లేదు… డెస్టినీ బాగుంటే ఇలా యూట్యూబ్ గ్రూపులు ఏవీ అడ్డుకోలేవు… స్వీయ నియంత్రణ గానీ, విలువలు గానీ లేని… తమ కంటెంటు మీద పరిశీలన కూడా లేని యూట్యూబ్ పెద్ద చానెళ్ల గ్రూపులను ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది…

ఈ యాంకరుడి వ్యాఖ్యలు పాపం, ఆ మౌళి అనే ఆర్టిస్టు దృష్టికి తీసుకెళ్లారట… బాధపడ్డాడు… చిన్న ఆర్టిస్టులు కదా, కోపం వచ్చినా, బాధ కలిగినా ఎక్స్‌ప్రెస్ చేయలేరు… మీడియా కక్షకడుతుందనే భయం… ‘’నేను కూడా ఆ వీడియో చూశాను, బాధ వేసింది, నాకు సినీనేపథ్యం లేదు కాబట్టి వీడు ఏం చేయగలడులే, వీడు బచ్చాగాడు అన్నట్టుగా చులకనగా మాట్లాడారు…

ఒక చానెల్ ఓ ప్రోగ్రామ్‌కు రమ్మంటే ఒంట్లో బాగాలేదు, వీలు కాదు, రాలేనని చెప్పాను, దాంతో నువ్వు రాకపోతే నీ తరువాత సినిమాకు నెగెటివ్ అవుతావు అని భయపెట్టారు… దాంతో వెళ్లాను, ఏం చేయగలను, భరిస్తాను, తిడితే పడతాను‘’ అని మౌళి బాధపడ్డాడనే వార్తలు వచ్చాయి… (మౌళి కొత్త సినిమా దొంగనాకొడుకు రాబోతోంది)…

ఇక్కడ రెండు అంశాలు… మీరు పిలవగానే ప్రోగ్రామ్‌కు వచ్చేయాలా..? లేకపోతే నెగెటివ్ చేస్తారా..? ఇదేం బ్లాక్ మెయిలింగ్..? ఇక్కడ మౌళి అడిగిన మరో కీలక ప్రశ్న… నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని అయితే నన్ను ఇలా అనేవాళ్లా..? అవును… ఆ దమ్ముందా, ఈ సోకాల్డ్ జర్నలిస్టులకు…!? (అవునూ, మూవీ ఆర్టిస్టుల కోసం మా అనే ఓ సంస్థ ఉండేది కదా… ఇప్పుడు ఉందా?)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చర్చిద్దాం రండి… తుమ్మడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర సీఎం సానుకూలత !!
  • దిక్కుమాలిన జర్నలిజం! చిన్న ఆర్టిస్టులంటే మరీ అంత లోకువా..?
  • పోటీయే కదా ప్రజాస్వామిక స్పూర్తి… నిర్బంధ ఏకగ్రీవాలు దేనికి..?
  • రష్మిక పాత ఫ్రెండ్ ప్రేరణ కంభం! ఇదేనా తన ఐడెంటిటీ !!
  • ఈ ఏడాది చివరికల్లా మోదీ దిగిపోతాడా..? ‘మార్కెట్’ ఏమంటోంది..?
  • సో వాట్..? కేంద్ర మంత్రి భర్త అనే రాస్తారు… అదే తన ఐడెంటిటీ..!!
  • బీసీ ఏ‘లోకి ముదిరాజ్ – రేవంత్ ప్రకటనలతో బీఆర్ఎస్ కక్కలేక, మింగలేక !!
  • అసలే ఆమె ‘భానుమతి..! మా కుర్ర జర్నలిస్టు ఓ వెర్రి ప్రశ్న వేశాడు..l
  • లజ్జ – Lojja … మహాశయులారా, మరి ఈ మానసిక హింస మాటేమిటి..?!
  • ఫ్రాన్స్ దహనకాండ- ఢిల్లీ అల్లర్లు … అన్నీ ఓ భారీ విదేశీ కుట్రలో భాగమే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions