ఇంటర్‌నెట్ జీవులకు ఎప్పుడూ ఏదో ఒక వివాదం కావాలి, లేకపోతే క్రియేట్ చేస్తారు… ఏదో ఒక రచ్చ సాగుతూ ఉండాల్సిందే… దీంతో కొన్ని వివాదాలు హఠాత్తుగా ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదు…
నాగ్ అశ్విన్ కల్కి పేరిట చేసిన సాహసం చిన్నదేమీ కాదు… ఎక్కడ పొరపాటు అడుగుపడినా 600 కోట్ల బడ్జెట్ మట్టిపాలయ్యేది… తన అదృష్టం కొద్దీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది… (చాలామంది కల్కి సినిమా పట్ల వ్యతిరేక భావనలు వ్యక్తం చేస్తున్నా సరే…) 1000 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టాడు…
తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికే గాకుండా… ఇలాంటి పోస్టులు రేప్పొద్దున రాబోయే కల్కి-2 బజ్‌కు కూడా కొంత సాయం చేస్తాయి… బిజినెస్ కోణంలో… అయితే అదే పోస్టులో తను ‘1000 కోట్ల వసూళ్లకు రక్తపాతాన్ని, అశ్లీల సీన్స్ గానీ అవసరం లేదని కల్కి చెప్పింది’ అన్నట్టుగా ఏదో రాశాడు…
Ads
అరె, ఈ దర్శకుడు యానిమల్ దర్శకుడు వంగా సందీప్‌రెడ్డిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియా స్టార్ట్ చేసింది… ఆదంతా ఏదో నెగెటివ్ సైడ్ తీసుకుంటున్నదని గ్రహించిన నాగ్ అశ్విన్ వెంటనే తన పోస్టు డిలిట్ చేశాడు, తన సహజధోరణిలో సైలెంటయిపోయాడు…
కానీ నెట్ ఊరుకోదు కదా… రెండుగా చీలిపోయింది… ఏయ్, వంగా సందీప్‌రెడ్డిని అంటావా..? నువ్వు పెట్టిన ఖర్చులో మూడో వంతు కూడా పెట్టకుండానే దాదాపు 1000 కోట్ల వసూళ్లు కొట్టాడు,.. ఐనా ఎక్కడా ఇలా ఘనతలు చెప్పుకోలేదు అంటూ మొదలుపెట్టారు కొందరు…
నిజానికి యానిమల్ సినిమాలో హింస, అడల్ట్ సీన్ల పట్ల ప్రేక్షకుల్లో చాలామంది నుంచి నెగెటివ్ స్పందన కనిపించింది… కానీ సినిమా సూపర్ హిట్, డౌట్ లేదు… కొందరేమో నాగ్ అశ్విన్‌కు కాస్త సానుకూలంగా స్పందించారు… సరే, ఈ సంవాదాలు కొన్నాళ్లు నడుస్తాయి… యానిమల్, కల్కి నడుమ పోలికలు, తేడాల మీద కూడా చర్చ జరుగుతుంది… కానీ..?
నిజానికి నాగ్ అశ్విన్ ఒక జనరల్, జెన్యూన్ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టుగా ఉంది తప్ప వంగా సందీప్‌రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా ఏమీ లేదు… యానిమల్ సినిమాాను టార్గెట్ చేయాల్సిన అవసరమూ లేదు తనకు… పైగా నాగ్ అశ్విన్ ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యల జోలికి కూడా పోయినట్టు కనిపించదు… అంతేగాకుండా వంగా సందీప్‌రెడ్డితో తనకు దూరం కూడా ఏమీ లేదు, ఉన్నట్టుగా వార్తలేమీ కనిపించలేదు…
పైగా ఇద్దరూ ప్రభాస్ రాబోయే అత్యంత భారీ సినిమాలకు డైరెక్టర్లు ఇప్పుడు… కల్కి- 2 రావల్సి ఉంది… మళ్లీ ఇదే స్థాయి హిట్ కోరుకుంటున్నాడు… వస్తుందా రాదానేది వేరే విషయం… స్పిరిట్ పేరిట వంగా సందీప్‌రెడ్డి కూడా భారీ ఖర్చును, అదే స్థాయి హిట్ కొట్టాలనే సంకల్పాన్ని కనబరుస్తున్నాడు… పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు… సేమ్ హీరో, సేమ్ రేంజ్ మూవీస్… ఈ స్థితిలో కావాలని ఎవరూ గోక్కోరు…
ఎస్, ఇదంతా అనవసర రచ్చకు దారితీస్తుందనే గ్రహింపుతో వెంటనే తన పోస్ట్ డిలిట్ చేసి మంచి పనిచేశాడు… తనపై ఏ చిన్న విమర్శ వచ్చినా సరే ఇమీడియెట్‌గా ఘాటుగా స్పందించే వంగా సందీప్‌రెడ్డి కూడా దీన్ని పట్టించుకోలేదు… గుడ్, ఇద్దరూ మెచ్యూరిటీని కనబరిచినట్టే..!
Share this Article