ఒక అమెరికన్ లేడీ… ఆ తమిళుడి వలలో ఎలా పడిందో తెలియదు… వచ్చింది, పెళ్లి చేసుకుంది, పదేళ్లు సంసారం చేసింది… తరువాత ఏమైందో ఏమో మరి… వాడు ఆమెను తీసుకుపోయి, ఓ దట్టమైన అడవిలో, జనసంచారమూ కరువైనచోట ఆమెను ఓ చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేశాడు… వెళ్లిపోయాడు… ఇదీ వార్త…
వాడెంత క్రూరుడు..? ఎవడైనా ఎవరినైనా హత్య చేస్తే ఆ కాసేపే బాధ..? కానీ ఇది..? తమిళనాడు పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారట… నిజంగా ఆ సెక్షన్ ఇలాంటి క్రూరత్వాన్ని శిక్షించగలదా..? మన దురవస్థ ఏమిటంటే..? ఇలాంటి నరకాన్ని చూపే దుర్మార్గులకు సరైన శిక్ష విధించే సెక్షన్లను ఎందుకు ఆలోచించలేదు..? కొత్తగా మోడీ తీసుకొచ్చిన నేర శిక్షా స్మృతులూ సరైన శిక్షను సూచించడం లేదు…
Ads
హతమార్చడం ఓరకంగా నయం… ఇలాంటి నేరాలతో పోలిస్తే… ఒక చెట్టుకు కట్టేయబడి, అటూఇటూ కదలడానికి వీల్లేక… దాహం, ఆకలి మాత్రమే కాదు… భయం, ఎవరూ లేని ఒంటరితనం, చావు తప్పదనే ఆలోచన… రాత్రయితే చీకటి, కృూరమృగాల భయం… అవి పీక్కుతింటుంటే వచ్చే నొప్పిని తలుచుకుంటేనే ఓ జలదరింపు… అది నరకంకన్నా దారుణం… హత్యకన్నా చాలా ఘోరం…
మరి దానికి మనం పెట్టే గరిష్ట శిక్ష హత్యాప్రయత్నం సెక్షన్… అసలు మిస్టరీ ఏమిటంటే..? వాడు ఆమెను అలా ఆ అడవిలో వదిలేసి చంపేయాలనే అనుకున్నాడు, అది క్లియర్… వాడు భర్తేనా..? లేక మరొకరా తెలియదు… ఆమె మాట్లాడే స్థితిలో లేదు… ప్రస్తుతానికి పోలీసులు ఊహాగానాలు, మీడియా కథలు మాత్రమే… ఆమె ఏమీ చెప్పలేని షాక్‌లో ఉంది…
నిజంగా చంపేయాలనుకుంటే… ఏ ఆధారమూ మిగలొద్దు అనుకుంటే… ఆమె దగ్గర అమెరికన్ పాస్‌పోర్టు జిరాక్స్ ప్లస్ మన ఆధార్ కార్డు ఉన్నాయి… అవెందుకు వదిలేశాడు..? మిస్టరీ..! ఇండియాకు వచ్చే వీసా ఎక్స్‌పైర్డ్… ఐనా సరే, ఆమె ఆధార్ కార్డు తీసుకుని ఇండియన్ సిటిజెన్ అయిపోయినా సరే, ఆమె పాస్‌పోర్టు ఆమెను ఇంకా అమెరికన్ పౌరురాలిగానే సూచిస్తుంది…
ఆమె దాన్ని సరెండర్ చేయలేదు, వదులుకోలేదు… అంటే అమెరికా ప్రభుత్వం ఊరుకోదు… కానీ ఆ భర్త ఎవడు..? ఏం చేస్తాడు..? ఎందుకలా ఆమెను ఆ నరకంలో పడేశాడు..? ఇదీ తమిళ పోలీసులకు చాలెంజ్… ఓ గొర్రెల కాపరి అనుకోకుండా ఆమె అరుపుల్ని విన్నాడు, చూశాడు, పోలీసులకు చెప్పాడు, కాబట్టి బతికిపోయింది… లేకపోతే..?
అసలు ఎన్నాళ్లయింది ఆమెను అలా అక్కడ కట్టేసి..? మిస్టరీ..! నిజంగా వాడు దొరికితేేనా..? మరణశిక్ష ఇలాంటోళ్లకు సరైందేనా..? ఆమె అనుభవించిన నరకయాతనకు శిక్ష జస్ట్, వాడికి ఉరిశిక్షేనా..? ఐనా మన దేశంలో ఉరిశిక్ష పడి, అమలు చేయడానికి ఎలాగూ ఏళ్లకేళ్లు పడుతుంది కదా… ఒరేయ్, నువ్వెవడివో గానీ, లక్కీరా… సత్వరన్యాయం, సత్వరశిక్షలు చేతకాని ఈ దేశంలో పుట్టినందుకు…!!
Share this Article