ఈమధ్య సారంగదరియా పాట సూపర్ హిట్ కావడం.., బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా పాట బంపర్ హిట్ కావడం.., పెళ్లిళ్లు పేరంటాల్లో కూడా ఈ పాటలు మారుమోగిపోతుండటంతో సోషల్ మీడియాలో కూడా చర్చ పాటలు, డాన్సుల మీద నడుస్తోంది… మంచి కంటెంటు, మంచి ట్యూన్ ఉంటే చాలు, డాన్సర్ ఎలా ఉన్నా సరే సాంగ్ అదిరిపోతుంది, కోట్ల వ్యూస్ గ్యారంటీ అంటాడు ఒకాయన… నో, నో, అదేమీ కాదు, డాన్సర్‌ను బట్టి సాంగ్ కథ మారిపోతుంది, సాయిపల్లవి లేకపోతే సారంగదరియా పాట అంత హిట్టయ్యేదా అని ప్రశ్నిస్తాడు మరొకాయన… నిజానికి అన్నీ కుదరాలి… పాట బాగుండాలి, ట్యూన్ బాగుండాలి, డాన్స్ బాగుండాలి… అప్పుడే ప్రైవేటు పాటైనా, సినిమా పాటైనా హిట్టో ఫట్టో తేలిపోయేది… బుల్లెట్ బండెక్కి పాట హిట్‌కు కారణం ప్రధానంగా కంటెంటే… ఆ చర్చ ఇక్కడ ఆపేద్దాం గానీ, నిజంగా సాయిపల్లవి డాన్స్ ఉంటే చాలు, పాట హిట్టయిపోయి, ఆ వీడియో కోట్ల వ్యూస్ సాధిస్తుందా..? నిజమేనా..?
మెల్లామెల్లగా వచ్చిండే, రౌడీబేబీ, సారంగదరియా రేంజులో ఆమె మరి ఇతర వీడియోలు హిట్ కావడం లేదెందుకు..? మరో విశేషం చెప్పుకుందాం… సాయిపల్లవి చిన్న వయస్సులోనే డాన్స్ కాంపిటీషన్లలో పాల్గొంది… ఇప్పుడు వేసే స్టెప్పులను మించి ఎన్నో క్లిష్టమైన స్టెప్పులు వేసింది… యూట్యూబులో కూడా ఆ వీడియోలు దొరుకుతయ్… నిజానికి ఇప్పటి సారంగదరియా స్టెప్పులు జుజూబీ ఆమెకు… విషయానికొస్తే, సాయిపల్లవే కాదు, ఓ సినిమా తార ఆడినంత మాత్రాన పాట హిట్ అవుతుందని ఏమీ లేదు… ఆ లెక్కన సాయిపల్లవి పెద్ద అందగత్తె కాదు, అంత హైటూ ఉండదు… ఐనా ఆమె కదలికల్లోని ఆకర్షణ ఏదో పట్టేస్తుంది ప్రేక్షకుడిని… కానీ అదే సరిపోదు, ఉదాహరణకు… సాయిపల్లవి జార్జియాలో డాక్టరీ చదువుకున్న సంగతి తెలుసు కదా… అక్కడ 2013లో… ఏదో ఒక షోలో డాన్స్ చేసింది… ముందుగా ఆ వీడియో చూడండి… దిగువన యూట్యూబ్ లింక్…
Ads
అదరగొట్టేసింది కదా… అసలు మన సాయిపల్లవేనా అనిపించేలా..! మరి ఇంత అదిరిపోయే స్టెప్పులున్న ఈ వీడియోను 2014లో అప్‌లోడ్ చేస్తే దీని వ్యూస్ ఇప్పటికీ 4.20 లక్షలు దాటలేదు… ఇవ్వాళారేపు ఓ చిన్న పిల్లను తీసుకొచ్చి, బుల్లెట్ బండెక్కి పాటకు డాన్స్ చేయించి, అప్ లోడ్ చేస్తే ఇంతకుమించి వ్యూస్ వస్తయ్… మరి సాయిపల్లవి ఈ డాన్స్‌కు వ్యూయర్స్ ఎందుకు లేరు..? అదే చెప్పుకునేది… కేవలం డాన్స్, స్టార్ పాట హిట్‌కు సరిపోరు అని..! అంతకుమించి వంట కుదరాలి..! నిజానికి ఆమె డాన్సును పూర్తి స్థాయిలో వాడుకున్నది ఎవరూ లేరు… చాలెంజింగ్ టాస్క్ ఆమెకు ఇచ్చిన డాన్స్ మాస్టర్ లేడు… బహుశా ఆమె పక్కన హీరో వెలవెలబోతాడనేది ఒక కారణం కావచ్చు… లేదా ఇంకాస్త క్రియేటివ్ కంపోజింగ్ మన డాన్స్ మాస్టర్లకే చేతకాకపోవచ్చు… మనవన్నీ పిచ్చి గెంతులే కదా సినిమాల్లో… గతంలో కాస్త నయం, పాటల్లోనూ కొన్ని ప్రయోగాలు చేసేవాళ్లు… ఇప్పుడదీ లేదు… ఉదాహరణకు… ఇంద్రుడు చంద్రుడు సినిమాలో సంధ్యారాగపు సరిగమ పాట చూడండి ఓసారి… ఇప్పుడు హీరోలతో చేయిస్తున్నారు తప్ప హీరోయిన్ల జోలికి పోవడం లేదు… అల వైకుంఠపురంలో సినిమా పాటలు అంత హిట్టు కదా, బన్నీ టాప్ ఫేమ్ సంపాదించాడు కదా, కానీ పూజా హెగ్డే దేభ్యం మొహం వేయడం తప్ప చేసిందేమీ లేదు… చేతకాదు… అందుకే బన్నీతోనే కొత్త స్టెప్పులు కొన్ని నడిపించేశాడు డాన్స్ డైరెక్టర్… సో, తారలు కాదు.., పాట సాహిత్యం కనెక్ట్ కావాలి, ట్యూన్ అదిరిపోవాలి… అప్పుడు ఆ పాట, ఆ డాన్స్ పది డీజేల సౌండ్‌తో, రీసౌండ్‌తో హిట్ కొడుతుంది…!!
Share this Article