అసలు ఫేక్ పోస్టులు క్రియేట్ చేసేవాళ్లు.., మార్ఫ్‌డ్ ఫోటోల్ని ప్రచారంలోకి తెచ్చేవాళ్లు.., డాక్టర్డ్ వీడియోలను సోషల్ సర్క్యులేషన్‌లోకి తెచ్చేవాళ్లకన్నా…. వాటిని నిజమని నమ్మేసి, కాస్త కామన్ సెన్స్‌తో పరిశీలించి చూద్దామనే సోయి కూడా లేకుండా, ఎడాపెడా కామెంట్లు పెట్టేసి… అందరితో వాగ్వాదాలకు దిగేవాళ్లను చూస్తేనే చిర్రెత్తేది… సోషల్ మీడియా అంటే ఎక్కువశాతం ఫేక్ ఖాతాలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ కంటెంటు, ఫేక్ గాళ్లు… ప్రతి ఫోటో, ప్రతి వీడియో అనుమానాస్పదంగా చూడాల్సిందే… ఈసారి ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు మనకు వచ్చింది ఒకే ఒక్క పతకం… అదీ మన మణిపూర్ మణిపూస సాయిఖోమ్ మీరాబాయ్ చాను సాధించింది… ఆమె మీద ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది, అర్హురాలు… కానీ ఫేక్ గాళ్లకూ టార్గెట్ అయ్యింది… ఎవరో ఓ ఫోటోను ట్విట్టర్లలో పెట్టారు… ‘‘అబ్బ, చాను ఎంత నిరాడంబరం, అసలు ఆమె సొంత ఇల్లు చూశారా..? ఎలా ఉందో…! ఆమెకు ఇప్పటికీ సంప్రదాయం అంటే విపరీతమైన గౌరవం… ఇంటికి తిరిగి రాగానే కింద కూర్చుని భోజనం చేస్తోంది… వావ్’’ అని ఓ వ్యాఖ్య కూడా… ఇదుగో ఆ ఫోటో…
బాగానే సర్క్యులేటైంది… కానీ ఒక్కసారి పరిశీలించండి… ఆ ఫోటోలో చానుతో పాటు మరొకాయన… బూట్లతోనే కూర్చుని ఉన్నాడు… కూర్చున్న తీరే పెద్ద డౌట్‌ఫుల్ ఫోజు… తన చేతికి అన్నం, కూర కూడా ఏమీ అంటలేదు పాపం… మరొకాయన సాక్స్‌తో… చివరకు చాను కూడా స్లిప్పర్లతో కూర్చుని తింటున్నట్టు ఫోజు ఇచ్చింది… ఒకే ఫ్రేములో ముగ్గురూ కనిపిస్తూ…! ముగ్గురే కాదు, కెమెరా ఫ్రేములో లేని మరొకరు కూడా ఉన్నట్టున్నారు… ఎవరి వాటర్ బాటిల్ వాళ్లదే… ఇక ఒకాయన కామెంట్ పెడతాడు… ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి ఎంతసేపూ క్రికెటేనా..? వాళ్లకు ఇచ్చే కోట్లకుకోట్ల డబ్బేనా..? ఇలాంటి చానులకు కాస్త సాయం చేయొచ్చు కదా అని..? మరొకాయన కామెంటుతాడు… కనీసం డైనింగ్ టేబుల్ కోసమైనా ఆమెకు సాయం చేయొచ్చుగా అని…! కింద కూర్చుని భోజనం చేయడం మన ట్రెడిషన్, సాహో చాను అని ఇంకొకాయన… అసలే సోషల్ మీడియా కదా… కానీ ఆమె విజయాలు సాధించేకొద్దీ మణిపూర్ ప్రభుత్వం ఆమెకు అండగా ఉంది… 2017లో వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు 20 లక్షలు, టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికవ్వగానే 10 లక్షలు, తరువాత మరో 25 లక్షలు ఇచ్చింది… అంతేకాదు, ఆమె పోలీసు అధికారి… పద్మశ్రీ, రాజీవ్ ఖేల్‌రత్న కూడా కేంద్రం బహూకరించింది…
Ads
అంతేకాదు, ఈ ఒలింపిక్స్ పతకం రాగానే కేంద్రం 50 లక్షలు ప్రకటించింది… మణిపూర్ ప్రభుత్వం అడిషనల్ ఎస్పీ (స్పోర్ట్స్) కొలువు ఇచ్చింది… కోటి రూపాయలు ప్రకటించింది… నిజానికి ఆమె రైల్వేలో ఉద్యోగి… (రెండు కొలువులు ఎలా సాధ్యమనే విషయంలో క్లారిటీ లేదు, తెలిసిన మిత్రులు చెప్పాలి…) రైల్వే మంత్రిత్వ శాఖ ఆమెకు ప్రమోషన్‌తోపాటు రెండు కోట్లు ప్రకటించింది… సో, ఈ డైనింగ్ టేబుళ్లు గట్రా ఒకప్పుడు ఆమెకు లేవేమో గానీ… చాలా ఏళ్లుగా ఇవన్నీ ఆమెకు చాలా చిన్న విషయాలు… అందుకని ఈ ఫోటో మీద డౌట్స్ సహజం… వాస్తవానికి ఆమె మెడల్ తీసుకోగానే నాకు పిజ్జా తినాలని ఉంది అన్నది నవ్వుతూ… ఇంకేముంది..? ఓ పిజ్జా తయారీ సంస్థ జీవితాంతం నీకు ఫ్రీగా మేం పిజ్జా సప్లయ్ చేస్తాం అని ప్రకటించింది… అలాంటి కానుకలు, ఆమె మీద కురిసిన వరాలు బోలెడు… ఆమె ఒక ఫోటో ట్వీట్ చేసింది… అదీ మనకు నచ్చేది… చూడండి…
చెప్పులు లేకుండా… కాళ్లు ‘సకులంముకులం’ పెట్టుక్కూర్చుంది… ఎదుట సంప్రదాయిక మణిపూరీ భోజనం… ఈ ఫోటో ఆమే ట్వీట్ చేసి, రెండేళ్ల తరువాత మళ్లీ ఇంటి తిండి తింటుంటే ఆనందంగా ఉంది అని వ్యాఖ్య జోడించింది… నెటిజన్లు ఆ ఫోటోను వైరల్ చేశారు… ఎంత అంటే..? 16 వేల రీట్వీట్లు, 2.50 లక్షల లైకులు… ఎహె, ఇవన్నీ కాదు… మరొక్క ఇంట్రస్టింగు విషయం చెప్పాలి… ఆమె ఊరు ఇంఫాల్‌కు పదీపదిహేను కిలోమీటర్లు ఉంటుంది… ఆమె ట్రెయినింగు తీసుకునేటప్పుడు రోజూ అప్ అండ్ డౌన్ చేసేది… తల్లిదండ్రులు పదీఇరవై రూపాయలు ఇచ్చేవాళ్లు… దాంతో సరుకులు రవాణా చేసే ట్రక్కుల వాళ్లను లిఫ్ట్ అడిగేది చాను… అప్పట్లో తనకు లిఫ్ట్ ఇచ్చిన ఆ ట్రక్కుల డ్రైవర్లు ఎవరైనా ఉంటే… వాళ్లకు సాయం చేద్దామని చాను తల్లి ఆలోచన… చాను ట్రెయినింగ్ సమయంలో తమ ఊరి నుంచి ఇంఫాల్‌కు రెగ్యులర్‌గా ట్రక్కులు నడిపిన వాళ్ల వివరాలు సేకరిస్తోంది… ఈ జర్నీలో తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది… దానికి చానును, చాను తల్లిని మనసారా అభినందిద్దాం..!!
Share this Article