రాంగోపాలవర్మ అంటే వినోదం, వివాదం కాదు… వికృతం..! తన సినిమాలు అంతే, తన రాతలు అంతే, తన చేష్టలూ అంతే… చివరకు తను ఇచ్చే చిల్లర ఇంటర్వ్యూలను కూడా వల్గర్ పీసులుగా మార్చి, ఫిమేల్ ఇంటర్వ్యూయర్లను కూడా తన మార్క్ అశ్లీలంలోకి లాగి వినోదించే వికటుడు..!! నాలుగైదేళ్లుగా తను తీసే సినిమాలే తన ప్రజెంట్ స్టేటస్‌ను బయటపెడుతున్నయ్… పవన్ కల్యాణ్‌పై తను తీసిన ఓ షార్ట్ ఫిలిం వర్మ పైత్యానికి చక్కని ఉదాహరణ… ఇక మూడునాలుగు వికార శృంగార చిత్రాలు సరేసరి… ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే..? తెలంగాణ రక్తచరిత్ర అంటూ ఓ సినిమా తీస్తున్నట్టు ప్రచారం స్టార్ట్ చేశాడు… ఇది బయటికి కొండా మురళి బయోపిక్ అని చెబుతున్నారు… కానీ వర్మ విడుదల చేసిన ఓ ఆడియో మాత్రం భిన్నంగా ఉంది… సహజంగానే ఈ ఆడియో తెలంగాణ ఎన్‌లైటెన్ సర్కిళ్లలో చర్చనీయాంశం అయ్యింది… పాత పీపుల్స్‌వార్, ప్రజెంట్ మావోయిస్ట్ పోరాటాలకు మకిలి పట్టించబోతున్నాడా..? ఏమో, ఆడియో వింటే మాత్రం వర్మ అంతులేని అజ్ఞానం స్థాయి అర్థమవుతోంది… మురళి భయ్యా, వర్మతో జాగ్రత్త… వర్మ సినిమాలు అంటేనే ఈమధ్య ఇజ్జత్ లేనివి… ఏ సోయీ లేనివి… అంతగా తీయించుకోవాలనుకుంటే బయోపిక్స్ బ్రహ్మాండంగా తీసే దర్శకులున్నారు…
- ఈ ఆడియో వింటుంటేనే వర్మ ఎంతటి అజ్ఙానో అర్థమైపోతుంది… విజయవాడలో చదవడం వల్ల అక్కడి రౌడీల గురించి తెలుసట… రామానాయుడు స్టూడియో బ్లాస్ట్ వల్ల రాయలసీమ రక్తచరిత్ర తెలిసిపోయిందట… కానీ తెలంగాణ సాయుధపోరాటం గురించి మొన్నమొన్నటివరకూ ఏమీ తెలియదట… ఇప్పుడు అనుకోకుండా మాజీ నక్సలైట్లు, పోలీసు అధికారులతో మాట్లాడితే తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలిసిందట… పరమజ్ఞాని వర్మ గారూ, తెలంగాణ సాయుధపోరాటం వేరు, నీకిష్టమొచ్చినట్టు ముద్రలేసి కంపు లేపకు, తెలియకపోతే ఇవి మాట్లాడటం మానేసి, నాలుగు బూతు సినిమాలు తీసుకుని బతకొచ్చు కదా…
- తనకు విపరీతంగా ఆకర్షించింది ఆర్కే అలియాస్ రామకృష్ణ, కొండా మురళి ‘‘మహాప్రత్యేక సంబంధం’’ అట… అసాధారణమైన సినిమాటిక్ కథ అట… వర్మ సంకల్పం తెలిసి మురళి సహకరిస్తాను అన్నాడట… వర్మకు కనీసం ఆర్కే అసలు పేరు కూడా తెలియదు… అసలు పీపుల్స్‌వార్, ప్రస్తుత మావోయిస్టుల గురించి బేసిక్స్ కూడా తెలియవు… ఈ ఆడియో చూస్తే స్పష్టంగా అర్థమయ్యేది అదే… ఎంఎల్ పోరాటాల్ని కూడా బెజవాడ రౌడీ పోరాటాల స్థాయికి తీసుకుపోయి, ఇవే మావోయిస్టు పోరాటాల అసలు రూపం అంటాడేమో అని ఇప్పుడు అందరికీ సందేహం పట్టుకుంది…
- వర్మకు ఏమీ తెలియదు… ఏదో ప్రచారహోరు, గాయిగత్తరతో ప్రమోట్ చేసుకుని పొద్దుగడపడం… ఇప్పుడు అదీ పనిచేయడం లేదు… మురళి, ఆర్కేల నాయకత్వంలో పెత్తందార్ల పెత్తనాలపై బడుగువర్గాలు పోరాడుతున్న రోజులట అవి… మురళి అసలు నక్సలైట్ కాదనీ, పార్టీలో పనిచేయలేదనీ వర్మకు మాజీ నక్సలైట్లు, మాజీ పోలీసు అధికారులు చెప్పలేదేమో బహుశా…
- మరి ఎర్రబెల్లి దయాకరరావు, గతంలో హత్యకు గురైన ప్రతాపరెడ్డిని వర్మ ఎలా చిత్రిస్తాడో మరి… అయ్యా, మంత్రిగారూ… వర్మ ఆడియో విన్నావా ఓసారి..?
- సరే, వర్మ లెవల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏమిటో తన రీసెంటు సినిమాలే స్పష్టంగా చెప్పాయి కాబట్టి ఈ సినిమా గురించి కూడా పెద్దగా చర్చించడం అనవసరం… దిగజారిపోయిన వర్మను తిరిగి లేపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది వర్మకే అవమానం… తను ఈ ఆడియోలో అంటాడు… విపరీతమైన పరిస్థితుల నుంచి విపరీతమైన మనుషులు పుట్టుకొస్తారు అని… గతంలో మార్క్స్ చెప్పాడు అని… ఆయన చెప్పింది ఈ వర్మ వంటి విపరీతమైన మనుషుల గురించి మాత్రం ఖచ్చితంగా కాదేమో…!!
Share this Article
Ads