తాత గారి వయస్సు 78 ఏళ్లు… సారు గారు హీరోయిన్ల బొడ్డును డస్ట్‌బిన్‌గా… బోలెడు పూలు, పళ్లు… చివరకు కొబ్బరి చిప్పలను కూడా పడేసి, చిత్రీకరించి, దాన్నే అద్భుత చిత్రీకరణగా చెత్తా భజన వార్తల్ని రాయించుకున్న సూడో సరస శృంగార ప్రియుడు… దాన్నే అభిరుచి అనాలని కూడా కుండ బద్ధలు కొట్టేస్తాడు తను… తన పేరు తెలుసు కదా… కే.రాఘవేంద్రరావు… తెలుగు ఇండస్ట్రీలో భయానికి చాటుమాటుగా… ఇతర భాషల ఇండస్ట్రీల్లో బాహాటంగానే పకపకా నవ్వుతూ తన టేస్టు మీద జోకులు వేస్తుంటారు… అలాంటి రాఘవేంద్రుడికి మళ్లీ ఓ కోరిక పుట్టింది…
పధ్నాలుగేళ్లుగా అనేకానేక సినిమా ఫ్లాపుల తరువాత… ఇక తను తెలుగు ప్రేక్షకులికి అక్కరకు రాడు అని తేలిపోయిన తరువాత కూడా… మళ్లీ ఓ కోరిక పుట్టింది… మిథునం సినిమాలో బాలసుబ్రహ్మణ్యంలాగా… తనే ప్రధాన కథానాయకుడిగా ఓ సినిమా తీయాలి అనిపించిందట… మరోసారి చెబుతున్నా… తన వయస్సు 78 ఏళ్లు…
Ads
సరే, అనుకున్నాడు… మరి బాలసుబ్రహ్మణ్యంలాగా ఏ లక్ష్మినో వెతుక్కోవచ్చుగా… పిటపిటలాడే ఓ పిల్ల హీరోయిన్ కావాలీ అనుకున్నాడట… సరే, ఆయన అత్యంత అమోఘమైన అభిరుచితో అలాంటి కథనో రాసుకున్నాడూ అనుకుందాం… ఈయనగారు ఆ గెడ్డానికి నల్లరంగు పూసుకుని జీన్స్, టీషర్ట్ వేసుకుని రెడీ అయిపోతాడూ అనుకుందాం… కానీ ఈయనతో నటించడానికి ఎవరు ముందుకు రావాలి… అసలు రాజశేఖర్, వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలనే చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేస్తున్న రోజులివి…
నో, నో… తను పెళ్లిసందడి అనే తన పాత సినిమా టైటిల్‌తోనే మరో సినిమా ప్రకటించాడు, అందులో నటుడు శ్రీకాంత్, ఊహ కొడుకు రోషన్ హీరో… అందులో శ్రీదేవి బిడ్డ ఖుషీకపూర్ గానీ, మాళవిక నాయర్ గానీ హీరోయిన్ అవుతారని వార్తలు… ఖుషీకపూర్ రోషన్‌తో నటిస్తుంది అనే పిచ్చి భ్రమను కొట్టేయండి… అంత సినిమా లేదు… రాఘవేంద్రరావు కలగనొద్దు… ఆమె జాన్విలాగే ఏదో హిందీ సినిమాలో ఘనంగా లాంచ్ అవుతుంది…
ఇక మిగిలింది మాళవిక… ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఇప్పటి వరకు… తను ఏదిపడితే అది ఒప్పుకోదు, అన్నీ విప్పి చూపించవోయ్ అంటే చెప్పు చూపించే బాపతు… ఇక ఆమె బొడ్డు మీద… కాస్త భారీగా ఉండాలని ఈసారి బొప్పాయి కాయలు, పనసకాయలు పగులకొడతాను, పడేస్తాను అంటే ఏం చేస్తుందో ఆమెకే తెలియదు… కాస్త పద్దతీ, మన్ననా, ఓ రీతి, ఓ తరీఖా తెలిసి… మర్యాద హీరోయిన్ అనిపించుకునే రకం ఆమె… ఆమె నంబర్ టూ సాయిపల్లవి…
ఎహె, చాల్లెండి చెప్పొచ్చారు…, రంగంలోకి దిగాక… ఇక ఏం చూపిస్తే ఏముంది అనకండి… ఎవరి తత్వం, ఎవరి ఇష్టం వాళ్లది… రాఘవేంద్రరావు రెడీ అనగానే బొడ్డు రెడీగా పెట్టేసేరకం అస్సలు కాదు ఆమె… ఈ శ్రీకాంతుడి కొడుకు రోషన్‌ను ఘనంగా చూపించడానికి… పాత పెళ్లిసందడి సినిమాలో దీప్తి భట్నాగర్ తరహాలో ఎడాపెడా ఎక్స్పోజింగుకు రెడీ అనే తరహా కానేకాదు…
అవునూ, మరో మాళవిక కూడా ఉందండోయ్… ఉంటే ఉంది గానీ, మరీ ఈ బొడ్డూ చంకలకు అర్హమైన పర్సనాలిటీ కాదు ఆమెది… మరి ఈ వృద్ధ రాఘవేంద్ర స్వామి ఏ మాళవికను ఎన్నుకున్నాడు..? అదీ క్వశ్చన్… రాఘవేంద్రుడా… ఇంతకీ నీ నాయిక ఆ మాళవిక ఎవరు తాతగారూ…?! ఎవరైనా సరే… కాస్త ఈసారికి ఈ డస్ట్ బిన్ షాట్స్ వద్దు మాస్టారూ… అసలే జనం నవ్వుకుంటున్నారు…
Share this Article