ఓహో… పుష్ప కథ విని, కన్విన్స్ కాలేదా మహేష్ బాబు..? అందుకే వద్దన్నాడా..? వదులుకున్నాడా..? పుష్ప సినిమా కథ రిజల్ట్‌ను మహేష్ బాబు ముందే సరిగ్గా అంచనా వేశాడా..? దురదృష్టం కొద్దీ, సుకుమార్‌తో తనకున్న లాంగ్ అసోసియేషన్‌తో, నమ్మి ఓ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడా బన్నీ..? ఇవీ ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో సాగుతున్న చర్చ… మీకు గుర్తుందా..? 2019 మార్చిలో మహేష్ బాబు ఓ ట్వీట్ కొట్టాడు… నిజానికి తను తెర వెనుక వ్యవహారాలను బహిరంగం చేయడు, కానీ అప్పుడు ఎందుకో గానీ బయటపడ్డాడు… సుకుమార్‌తో సినిమా వర్కవుట్ కావడం లేదని నేరుగా చెప్పేశాడు… ఓసారి ఈ ట్వీట్ చూడండి…
అట్టర్ ఫ్లాప్ అయినా సరే… నేనొక్కడినే సినిమాను గౌరవిస్తూనే… సుకుమార్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా వర్కవుట్ కావడం లేదని చెప్పాడు… ఈ బన్నీ కథనే తనకు చెప్పాడనీ, మహేష్ బాబు కన్విన్స్ కాలేదనీ, కానీ సుకుమార్ తన కథ మీదే కాన్ఫిడెంటుగా ఉన్నాడనీ, అందుకే మహేష్ బాబు నో చెప్పగానే వెంటనే మైత్రి ఆఫీసుకు వచ్చి, బన్నీతో సినిమా అనౌన్స్ చేశాడని అప్పట్లో ప్రచారం జరిగింది… నిజానికి తను మహేష్ బాబుకు ఈ కథే చెప్పాడా..? అప్పటికే రంగస్థలం సూపర్ హిట్‌తో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న సుకుమార్, మహేష్ కాదంటేనే అదే కథతో బన్నీని ఒప్పించాడా అనేది ఓ పెద్ద ప్రశ్న… మహేష్ బాబు కాదన్నాకే పుష్ప సినిమా కథ, కసరత్తు, షూటింగ్ గట్రా స్టార్టయ్యాయి… తెర మీద ఎమోషన్స్ వోకే గానీ, తెర వెనుక ఎమోషన్స్, కోపాలు ఉండకూడదని చెప్పడానికి ఇదొక ఉదాహరణా..?
Ads
అబ్బెబ్బే… ఆయనకు చెప్పిన కథ వేరు, బన్నీతో చేసిన ఈ పుష్ప కథ వేరు అని సుకుమార్ నేడు చెప్పవచ్చుగాక… కానీ ఈ డౌట్ మాత్రం సజీవంగానే ఉంటుంది… మహేష్ బాబు వద్దన్న కథనే బన్నీ మెడకు వేశాడా సుకుమార్..? బన్నీని బలిచేశాడా అనే ఫ్యాన్స్ ఆందోళనకు మాత్రం అర్థముంది… సుకుమార్ కొన్నిసార్లు సూపర్ సక్సెస్ కావచ్చుగాక… కానీ ప్రతిసారీ మ్యాజిక్ రిపీట్ కాదు… ఆర్యతో వెలిగిన ప్రభ ఆర్య-2తో ఆరిపోయింది… అందరికీ తెలిసిందే… ఎప్పుడూ ఒకే కాంబినేషన్ వర్కవుట్ కావాలనేముంది..?
కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? మహేష్ బాబు ఏ పాయింట్ వద్ద సుకుమార్ కథను వద్దన్నాడు… సినిమాను తిరస్కరించాడు అనేదే… ఒకవేళ ఈ పుష్ప కథే అయితే మాత్రం మహేష్ బాబు ప్రిడిక్షన్, అంచనా కరెక్టు… గుడ్డిగా సుకుమార్‌ను నమ్ముకున్న బన్నీ జడ్జిమెంట్ తప్పు… ఎంత పాన్ ఇండియా సినిమా అయినా సరే, అయిదు భాషల్లో రకరకాల రైట్స్ అమ్ముకుని డబ్బు చేసుకోవచ్చుగాక… కానీ బన్నీ కమర్షియల్‌గా పుష్పతో ఓ మెట్టు దిగినట్టే… అఫ్‌కోర్స్, నటుడిగా, వ్యక్తిగత ఇమేజీ కోణంలో ఎదిగాడు… కానీ అదే సరిపోదు కదా… పాటలు, ఫైట్లు గట్రా సూపర్ ఉన్నా సరే, జనాన్ని కనెక్ట్ కాకపోతే సినిమా దేనికి ఇక..? మై డియర్ సుకుమార్, సినిమా ఇండస్ట్రీలో ఎమోషన్స్, నువ్వు వద్దంటావా, ఇంకొకరితో చేసి చూపిస్తా వంటి పట్టింపులు వర్కవుట్ కావు… కావు…!!
Share this Article