బిడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకుని, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించడంతో ఒక్కసారి మన దేశంలోనూ, ప్రవాస భారతీయుల్లోనూ నెటిజనం చర్చ డిఫరెంట్ దారిలోకి మళ్లింది… మరీ మన తెలుగు నెటిజనం అయితే ఇది డెమొక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్లు అన్నట్టు గాకుండా తమిళనాడు వర్సెస్ ఆంధ్రా అన్నట్టుగా చిత్రీకరించేస్తున్నారు…
నిజానికి వీళ్లిద్దరి నడుమ పోలిక సరి కాదు… కాకపోతే ఇద్దరివీ ఇండియన్ రూట్స్ కాబట్టి మనం ఓన్ చేసుకుంటున్నాం… చర్చల్లోకి తెస్తున్నాం… కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైతే, ట్రంపు ధాటికి నిలబడి, గెలిస్తే ఆమె ఓ చరిత్ర క్రియేట్ చేస్తుంది… అగ్రరాజ్యం పగ్గాలు ఓ మహిళ, అందులోనూ ఆఫ్రికన్, ఇండియన్ రూట్స్… ఆమెకు అగ్రరాజ్యం పగ్గాలు దక్కితే అదొక రికార్డు…
మొన్నటిదాకా చిల్కూరి ఉష… తను స్వయంగా ఏ పోస్టుకూ కంటెస్టెంట్ కాదు… బరిలో ఆమె కాదు నిలబడేది, తలపడేది… తన భర్త వాన్స్ … ట్రంపు ఉపాధ్యక్ష అభ్యర్థిగా తనకు విజయావకాశాలు కనిపిస్తున్నాయి… మొన్నటిదాకా ఉష పేరు తెలుగు నెటిజనంలో చర్చనీయాంశం కాగా, ఎప్పుడైతే కమలా హారిస్ అభ్యర్థిత్వం బలంగా తెర మీదకు వచ్చిందో ఇక ఆమె పేరుకూ ప్రాధాన్యం, చర్చల్లో స్థానం వచ్చేసింది…
మొన్నటిదాకా ఉష పేరు కలవరించిన తెలుగు గొంతులు అకస్మాత్తుగా కమలా హారిస్ పాట పాడుతున్నయ్… సో, కమలా హారిస్ పొజిషన్ వేరు, ఉష పొజిషన్ వేరు… కమలా హారిస్ గెలిస్తే ఏకంగా ప్రెసిడెంట్ అవుతుంది… అల్టిమేట్ పోస్ట్… వాన్స్ గెలిస్తే ఉష జస్ట్, ఓ సెకండ్ లేడీ అవుతుంది… కమలా హారిస్ కొన్ని పాలసీలను స్వయంగా అమల్లోకి తీసుకురాగలదు, ఉషకు ఆ చాన్స్ లేదు… సో, పోలిక సరికాదు, కాకపోతే పోలిక అనివార్యంగా వస్తోంది…
నిజానికి ఉష ఓ అమెరికన్‌ను పెళ్లి చేసుకున్నా సరే… ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియన్స్… పర్‌ఫెక్ట్ ఇండియన్, అందులోనూ తెలుగు రూట్స్… ఈరోజుకూ ఆమె ప్రాక్టీసింగ్ హిందూ… తన మతాన్ని వదులుకోలేదు, భర్తపై రుద్దలేదు… బ్యాలెన్స్ చేసుకుంటుంది… తెలివైన న్యాయవాది ఆమె… భర్త అమెరికన్, క్రిస్టియన్…
అదే కమలా హారిస్ విషయానికొస్తే అమ్మ మద్రాసీ… కానీ తండ్రి ఆఫ్రికన్ జమైకన్… సో, ఆమె రూట్స్ నాట్ ప్యూర్ ఇండియన్… మిక్స్‌డ్… తను కూడా ఓ అమెరికన్‌ను పెళ్లి చేసుకుంది… ఇన్నిరకాల తేడాలున్నయ్ వారి నడుమ… పోటీ కూడా వారి నడుమ కాదు… కాకపోతే ఇద్దరికీ ఇండియన్ రూట్స్ ఉన్నాయి కాబట్టి పోలిక, తేడాల చర్చ సాగుతోంది…
రేప్పొద్దున ట్రంపు గెలిచినా, కమలా హారిస్ గెలిచినా… అమెరికా అవసరాలు, ప్రయోజనాల మేరకే వాళ్ల అడుగులుంటాయి… వాళ్ల పార్టీల విధానాలుంటాయి… ఉపాధ్యక్షుడు గనుక అయితే వాన్స్ జోక్యం పెద్దగా పాలసీల్లో ఉండదు, పైగా ఉష జోక్యం నామమాత్రమే… కమల గానీ, ఉష గానీ జస్ట్, అమెరికన్స్… దట్సాల్…!!
Share this Article