ఒక వార్త చాలా డిస్టర్బ్ చేసింది… ఫేస్బుక్లో ఎవరి వాల్ మీదో, ఏదో వ్యాఖ్యతో ఉంది… ఆ అభిప్రాయాలతో ఇక్కడ పనిలేదు… చాలా చిన్నవార్త… అసలు చాలామంది నోటీస్ కూడా చేయరేమో… కానీ తప్పు తప్పే కదా… మరీ ఇంత ఘోరంగా ఉందా మన పాత్రికేయం…? తమ పత్రికల్లో ఏం వార్తలొస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, అవి తప్పులో, ఒప్పులో కూడా ఒకసారి వెనక్కి చూసుకునే దిక్కు కూడా లేదా పత్రిక సంస్థల్లో..? ఇది తెలుగు పాఠకుల దురవస్థా..?
నిజానికి ఇదుగో ఇలాంటి వార్తలే సమాజంలోని సగం సమస్యలకు కారణం… జర్నలిజంలో అత్యంత ప్రధానమైంది ఏమిటంటే..? ఏం రాయాలో, ఏం రాయకూడదో, ఏది ఎలా రాయాలో, ఎంత రాయాలో, ఎప్పుడు రాయాలో తెలుసుకోవడం…! భాషా పాటవం కాదు… సరిగ్గా రాయడం, అర్థమయ్యేట్టు రాయడం..!
Ads
ఈ క్లిప్పింగ్ నిజం కాదేమోనని అనుకుని, మరొక్కసారి నిశితంగా పత్రిక గమనిస్తే… హైదరాబాద్ ఎడిషన్, 12వ పేజీలో ఉంది నిజంగానే…! ఇప్పుడు రాధాకృష్ణను అడుగుదాం… అడగాలి కూడా… అయ్యా, ఆర్కే గారూ… బీఫ్ అంటే ఏమిటి..? కేవలం గోమాంసమేనా..? బర్రెలు, ఎద్దులు, కోడెలు, దున్నపోతులు గట్రా ఏమీ బీఫ్ నిర్వచనం కిందకు రావా..? బీఫ్ కొరత ఏర్పడిందని గోవా ప్రభుత్వమే చెబుతోంది… లైవ్ యానిమల్స్ కొనుగోలుకు రెడీ అవుతోంది… నిజమే… ఇక్కడ గొడ్డుమాంసం ఏమిటో, గోమాంసం ఏమిటో కూడా తెలియదా తమరికి..?
బీఫ్ అనగానే గోమాంసం అని రాస్తివి..? గోమాంసం కోసం గోవా ప్రభుత్వం ఆవులు కొంటుందా..? పైగా అదే హెడ్డింగ్… ఎస్, కర్నాటక ఏదో నిషేధం పెట్టబోతోంది… గోవధ నిషేధానికీ, గోవాలో గొడ్డుమాంసం కొరతకు లింకేమిటి..? అకస్మాత్తుగా గోవాకు గొడ్డుమాంసం సరఫరా ఆపేయడం వల్ల… కర్నాటక బిల్లులోని వివాదాస్పద అంశాల వల్ల పుట్టుకొచ్చిన సమస్య అది…
సరే, ఆ వార్త, ఆ కొరత సంగతి ఇక్కడ అక్కరలేదు… బీఫ్ అనగానే గోమాంసం మాత్రమే అని ఎలా అనుకున్నావు..? దానికోసం బీజేపీ ప్రభుత్వం ఆవులను కొంటుందని ఎలా రాసేస్తావు అసలు..? హేమిటో… ఇంకా నయం, గోవుల్ని కసకసా నరికేయిస్తున్న బీజేపీ గోవా ముఖ్యమంత్రి అని హెడ్డింగు పెట్టి, ఫస్ట్ పేజీలో పెట్టలేదు…! ఇప్పటికే ఈ వార్త నిజమని నమ్మేసి సోషల్ మీడియాలో మిత్రులు కొందరు కామెంట్స్ రాసేస్తున్నారు కూడా..!!
Share this Article