చంద్రబాబుకు ఏపీ సీఐడీ కేసులు అనే వార్త రాగానే…. ప్రజల్లో కొన్ని సందేహాలు… తెలుగుదేశం శ్రేణుల్లో కలవరం ప్లస్ చిత్రవిచిత్ర స్పందనలు…. కొన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చెప్పుకోవాలి… ముందుగా ఒక డిస్క్లయిమర్… తనపై విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకోవడంలో దేశంలోనే చంద్రబాబు నంబర్ వన్… ఇలా జగన్ అనుకోగానే… అలా చంద్రబాబును అరెస్టు చేసేసి.., గుంటూరు జైలో, రాజమండ్రి జైలో… లేకపోతే జగన్ ఇంతకుముందు కాలం గడిపిన చంచల్‌గూడ స్పెషల్ సెల్లోనే పడేయడం అంత వీజీ కాదు… ముందుగా టీడీపీ స్పందన చూద్దాం…
- మా బాబు మరీ సీఐడీ రేంజా..? అప్రతిష్ట కాదా..?
- ……….. అంటే పరోక్షంగా సీబీఐ దర్యాప్తు కోరుతున్నారా..? అసలే మోడీ కసికసిగా ఉన్నాడు, చేజేతులా అమిత్ షా చేతుల్లోకి వెళ్లాలనా..?
- ఇది కక్షసాధింపు రాజకీయం…
- …………. రాజకీయం అంటేనే కక్షసాధింపు, కుర్చీ మీద ఎవరున్నా చేసేది అదే… ఇంకో మాట చెప్పండి…
- ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టే చెప్పింది గతంలో….
- …………. ఈ కేసు ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కాదు.., అసైన్డ్ ల్యాండ్స్‌ను ఉద్దేశపూర్వకంగా, స్వలబ్ధి కోసం అమ్ముకోవడానికి వన్ టైమ్ పర్మిషన్ ఇవ్వడం మీద….
- ఒక రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ కేసు పెడతారా..?
- ………….. తను ఆ ఏరియా ఎమ్మెల్యే ఆర్కే.., లోకస్ స్టాండీ ఉంది… రెడ్లు ఫిర్యాదు చేయొద్దని ఏమీ లేదు…
- ఆల్రెడీ అమరావతి భూముల కేసులో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని కోర్టు చెప్పింది కదా, మళ్లీ ఇదేమిటి..?
- ……………. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు కాదు… దురుద్దేశంతో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూముల క్రయవిక్రయాలకు అనుమతినిచ్చిన కేసు…
- ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టే ఉంది… మళ్లీ నోటీసులు ఎలా ఇస్తారు..?
- ……………. ఆ కేసు వేరు, ఆ స్టే వెకేట్ కాలేదు కరెక్టే… కానీ ఇది కొత్త కేసు… అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో దురుద్దేశాలతో కూడిన ప్రభుత్వ నిర్ణయం…
- ఇలా అయితే ఇక ఏ ముఖ్యమంత్రీ ఏ నిర్ణయమూ తీసుకోలేడు, పాలన వ్యవహారాల్లో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయాధికారం…
- …………… కాదు, ఒక కొత్త రాష్ట్ర రాజధాని విషయాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు అనే తీవ్ర ఆరోపణకు సంబంధించిన ప్రకంపనలు ఇవి… ముఖ్యమంత్రి నిర్ణయాలు చట్టానికి అతీతం కాదు… పైగా ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్‌పై ముఖ్యమంత్రి విచక్షణాధికారం ఎంత..? నిజానికి రాష్ట్రపతి కదా సడలింపులు, మినహాయింపులు ఇవ్వాల్సింది… మరి చంద్రబాబు ఏకపక్షంగా అన్ని రకాల అభ్యంతరాలను తోసిపుచ్చి, సంతకాలు పెట్టేసింది… అదీ కేసు…
- 23 తరువాత ఏం జరగొచ్చు..? చంద్రబాబు రాకపోతే..?
- ………… 41 సీఆర్పీసీ బీ అప్లయ్ చేస్తారు… అరెస్టు చేస్తారు…
…………. ఇలా అనేక ప్రశ్నలు, అనేక జవాబులు…. ఇక్కడ ఇష్యూ ఏమిటంటే… రాజకీయం… చంద్రబాబును తొక్కేయాలి… తొక్కేస్తేనే వైసీపికి బేఫికర్, జగన్‌కు ఆత్మసంతృప్తి… బీజేపీకి కావల్సిన పొలిటికల్ వాక్యూమ్… ఎవరి ఆశలు వాళ్లవి… చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు, తను ఎప్పుడూ ప్రొసీజరల్ ల్యాప్సెస్లో ఇరకడు, దొరకడు అనేది ఒక నమ్మకం… తనకు లీగల్ సిస్టంలో అంతులేని సపోర్ట్ ఉంటుందనేది ఒక విశ్వాసం… కానీ గాషారం — మారేతో ఖుదా క్యా కరేగా… అనేది గుర్తుంచుకోవాలి… తనకు జనం సపోర్ట పోయిందని పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తేలిపోయింది… ఎక్కడో ఒకచోట చిన్న ల్యాప్స్ చాలు, బతుకు బస్టాండ్ చేయడానికి… ఈ కేసులో చంద్రబాబే కాదు, మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావులే కాదు, మొత్తం 18 మందిని చేరుస్తున్నట్టుంది… వెరీ హైప్రొఫైల్ కేసు… సీబీఐకి అప్పగించాలి అనే నిర్ణయమే జరిగిందీ అనుకుందాం… కేంద్రంలోనూ ఖిలాఫ్ సర్కారే కాదు ఉన్నది… మరెలా..? బీజేపీలో టీడీపీని విలీనం చేసేస్తే అయిపోయేది అంటారా..? దానికీ మోడీ, షా బేషరతుగా వోకే అనడం లేదు కదా మరి..? చంద్రబాబును నమ్మడం లేదు వాళ్లు…
Ads
అయితే… నిజంగానే ఈ కేసు విషయంలో ఏం జరగబోతోంది..? తను ముందుగా హైకోర్టును స్టే కోసం ఆశ్రయించడం… రిలీఫ్ దొరక్కపోతే సుప్రీంను ఆశ్రయించడం… అయితే ఆల్రెడీ అమరావతి హైకోర్టు రమణ ప్రభావంలో ఉందని జగన్ కంప్లయింట్ చేసి ఉన్నాడు… హైకోర్టు గనుక స్టే ఇస్తే వెంటనే కథ సుప్రీం తలుపు తడుతుంది… అప్పటికి కొత్తగా వచ్చే సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏం ఆలోచిస్తాడనేది కీలకం… ఎందుకంటే..? ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జి కూతుళ్లనూ, పాత అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటినీ చేరుస్తారు కావచ్చు… అప్పుడు సుప్రీంకూ ఇరకాటమే… అబ్బే, చంద్రబాబు ప్రొసీజర్ పరంగా ఎప్పుడూ తప్పు చేయడు, అందుకే జగన్ డాడీ వైఎస్ కూడా తనను ఏమీ చేయలేకపోయాడు అనేది ఒక వాదన… కరెక్టే… చంద్రబాబు కరెక్టు అనుకున్నది కోర్టు కరెక్టు అనుకోవాలని ఏమీ లేదు… పైగా జగన్ కొన్ని విషయాల్లో వైఎస్‌కు తాత… పైగా కసిగా ఉన్నాడు… అవునూ… ఏపీలో చంద్రబాబును నిర్బంధించాలనే పక్షంలో… కేసీయార్ మీద కూడా జగన్‌కు నమ్మకం లేని స్థితిలో…. కర్నాటకలో శశికళ ఖాళీ చేసిన పరప్పన అగ్రహారం జైలే దిక్కవుతుందా..?! ………………… చివరగా…. చంద్రబాబు ప్రాణాల మీద తమకు భయాందోళనలు ఉన్నాయని టీడీపీ బుద్ధా వెంకన్న ఉవాచ… అదెలా..?! జగన్ దానికీ ప్లాన్ చేస్తున్నాడా..? అంత వీజీయా..? అయితే ఎలా..?!
Share this Article