.
నాయకుడికి విశాల హృదయం ఉండాలి, మంచిదే… కానీ అది మరీ ఎన్‌లార్జ్ కాకూడదు… హార్ట్ ఎన్‌లార్జ్ అయితే కష్టం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరీ ఉదారంగా, అందరూ మనవాళ్లే అనుకుంటూ… హృదయాన్ని మరీ మరీ ‘విస్తరిం’చాలని అనుకుంటున్నాడేమో… ప్చ్… నాయకా…
ఆమధ్య ఓ పదిమంది గాయకులు, కవులు, రచయితలు, కళాకారులు అని కొందరిని ప్రకటించాడు కదా… అందులో బీఆర్ఎస్ హార్డ్ కోర్ కేరక్టర్లు… కోటి రూపాయలు ప్లస్ ఇంటి స్థలం ఉదారంగా ప్రకటించాడు… తీరా చూస్తే నందిని సిధారెడ్డి రెఫ్యూజ్ చేశాడు.,.
Ads
వై..? తన దగ్గరే జవాబు లేదు… తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు అంటే తెలంగాణ సమాజం గుర్తింపు కాదా..? సరే, ఆయనది అదోరకం భావజాలం… గత ప్రభుత్వపు ఆనవాలు… మరో ఒకరిద్దరు పక్కా బీఆర్ఎస్ క్యాంపు… ఐనా సరే, మనవాళ్లే అని రేవంత్ రెడ్డి ఆదరించి, ఉదారంగా వ్యవహరించాడు… దీన్ని అపాత్రదానం కాదు, అపాత్ర గుర్తింపు అనాలేమో…
ఇప్పుడు మరో ఉదాహరణ… కంచె ఐలయ్య… తను తెలంగాణవాది కాదు, సొసైటీలో ద్వేషాలు రగిలించే కేరక్టర్… యాంటీ హిందూ… యాంటీ వైశ్య… అని తెలంగాణ సొసైటీలో అత్యధికులు భావిస్తారు… మొన్న రాజ్యసభ అధ్యక్ష అభ్యర్థిగా ఓసీ రెడ్డి దేనికి..? నీకు బీసీలే దొరకలేదా..? కంచె ఐలయ్య లేడా అంటూ కేటీయార్ సదరు ఐలయ్య మీద అవ్యాజమైన అనురాగాన్ని కురిపించాడు…
దీని మీద కూడా విమర్శలు వచ్చాయి… ఐలయ్య మాటలను, చేతలను నువ్వు సమర్థిస్తున్నావా కేటీయార్ అని అడిగారు… తెలంగాణ సమాజానికి ఐలయ్య కంట్రిబ్యూషన్ ఏమిటి అని కూడా..?! కేటీయార్ అమితంగా ప్రేమించిన సదరు ఐలయ్యను ఇప్పుడు రేవంత్ రెడ్డి మరోరకంగా గౌరవించి, ఆదరంతో అలుముకున్నాడు అనురాగంతో… సర్‌ప్రయిజ్…
అసలు మార్వాడీ గోబ్యాక్ వెనుక ఆయన కూడా ఉన్నాడనేది బీజేపీ సందేహం… అలాంటిది హఠాత్తుగా ఎఐసీసీ ఓబీసీ డిపార్ట్‌మెంట్ ఓబీసీ ఐడియాలజికల్ అడ్వయిజరీ కమిటీలోకి 23 మంది సభ్యులను ప్రకటించింది… అందులో రెండో పేరే కంచె ఐలయ్య పేరు…
కేటీయార్ అనురాగించే ఆ పేరు హఠాత్తుగా కాంగ్రెస్ కాగితం మీద కనిపించడం ఏమిటి..? అదీ హాశ్చర్యం… అబ్బే, ఇది సీఎం చాయిస్ కాదు అనే సమర్థన కూడా పనిచేయదు… రాజ్యసభ అధ్యక్ష అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తినే ఇండి కూటమి ఫైనల్ చేసింది…
అలాంటిది కంచె ఐలయ్య పేరును తను ప్రపోజ్ చేయకుండా ఏకపక్షంగా ఎఐసీసీ హైకమాండ్ ఖరారు చేసిందా అంటారు జనం… హయ్యో…! అవునూ… కంచె ఐలయ్య తను కాంగ్రెస్ మనిషినే అని అంగీకరించాడా..? ఈ ఎంపికను ఆమోదించాడా.,.?
Share this Article