ఫైటర్ అనే మూవీ వచ్చింది కదా ఈమధ్య… దీపిక పడుకోన్, హృతిక్ రోషన్ తదితరులున్నారు… ఆ సినిమా బాధ్యులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లీగల్ నోటీసు పంపించింది… ఎందుకయ్యా అంటే..? అందులో ఇద్దరు తమ యూనిఫామ్‌లో ఉండి ముద్దుపెట్టుకుంటున్న సీన్ ఉంది, అది తమ సంస్థకు అమర్యాదకరం అని…!
ఈ నోటీసు పంపించింది అస్సాంకు చెందిన ఐఏఎఫ్ అధికారి సౌమ్యాదీప్ దాస్… ఆ లిప్ లాక్ తమ యూనిఫామ్ గౌరవాన్ని తగ్గించే చర్య అని అతని అభిప్రాయం… మొన్నటి జనవరి 25న ఈ సినిమా విడుదలైంది… సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకుడు… 300 కోట్ల దాకా వసూళ్లున్నాయి… పర్లేదు, హిట్ కిందే లెక్క…
త్యాగం, క్రమశిక్షణ, దేశాన్ని రక్షించే అచంచలమైన అంకితభావం, అత్యున్నత ఆదర్శాలు కలిగిన యూనిఫామ్‌ను రొమాంటిక్ మసాలా కోసం అగౌరవపరచడం తప్పు… దేశసేవలో లెక్కలేనంతమంది అధికారులు చేసిన త్యాగాల విలువను ఇది తగ్గిస్తున్నది… యూనిఫామ్‌లో అనుచిత ప్రదర్శన సరైన చర్య కాదు… రన్‌వేపై ఆ హీరో హీరోయిన్ జంట రొమాన్స్ అనుచితంగా, అనైతికంగా ఉంది… అని ఆ నోటీసు సారాంశం…
Ads
సరే, కొంత ఓవర్ అనిపిస్తోంది కదా… యూనిఫామ్‌లో ఉండి ముద్దు పెట్టుకుంటే అది ఆ దుస్తులు, ఆ సంస్థ గౌరవాన్ని తగ్గించడం ఎలా అవుతుంది..? ఆ జంట పరస్పరం ప్రేమాభిమానాల్ని వ్యక్తపరుచుకునే చర్యే తప్ప అశ్లీలత, అసభ్యత అందులో ఏమీ లేవు… అదేమీ యూనిఫామ్ గౌరవాన్ని తగ్గించేది కాదు… వోకే, ఐఏఎఫ్ అధికారులు అలా ఫీలయ్యారంటే తప్పుపట్టాల్సిన పనీ లేదు… కానీ విరక్తితో మరో విషయం గుర్తొస్తుంది…
ఎన్ని సినిమాల్లో ఆర్మీ జవాన్లు, పోలీసులు, ఇతర కీలక వృత్తుల్లో ఉన్న వాళ్లను అవమానించేలా చిత్రీకరించలేదు… అఫ్‌కోర్స్, యూనిఫామ్ వేసుకోగానే, ఆ వృత్తుల్లో చేరగానే వ్యక్తిత్వాలు మారతాయా..? ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్లకు విలనీని ఆపాదించడం వరకూ వోకే… కానీ మరీ మొన్నామధ్య ఒక తెలుగు సినిమా (ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్..?)లో ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే మహిళా కానిస్టేబుళ్లతో ఐటమ్ సాంగ్ చేయించారు కదా… మరి దాన్ని ఎలా స్వీకరించాలి పోలీస్ శాఖ..?
అదసలే ఓ చెత్తా సినిమా… ప్రేక్షకులు కూడా ఛీత్కరించారు, అడ్డగోలు ఫ్లాప్… నితిన్ మొహం మాడిపోయింది… ఈ పాత్రకు శ్రీలీల ఎందుకు అంగీకరించిందో ఆమెకే తెలియాలి… అయితే..? అందులో ఓ పాట ఉంది… నా పెట్టే తాళం అని… పచ్చి వెగటు… కంపు… బూతు… దానికి ఓ పోలీస్ స్టేషన్‌లో నితిన్‌తోపాటు తారలు సత్యశ్రీ, సోనియా సింగ్ చిల్లర గెంతులు.., అనగా కొన్ని జాతర్లలో రికార్డింగ్ డాన్సుల్లో వేస్తుంటారు కదా, అలాంటి అసభ్య భంగిమలు… ఒకరిద్దరు జబర్దస్త్ యాక్టర్లు కూడా ఆ సీన్‌లో ఉంటారు…
ట్రోలింగ్ కూడా భారీగా సాగింది… తెలుగు నెటిజనం పెద్ద ఎత్తున తిట్టిపోశారు… సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యుల విచక్షణకు ఓ వందనం… కానీ పబ్లిక్ సెన్సార్… గుడ్… నిజానికి ఆ సోనియా సింగ్‌ను కాసేపు పక్కన పెట్టేయండి, తాను ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు… తింగరి… కానీ సత్యశ్రీ వేరు… బూతులు జబర్దస్త్ షోలో చేసినా, అదీ చమ్మక్ చంద్ర టీంలో చేసినా ఎప్పుడూ ఓ మర్యాదరేఖను, అనగా లక్ష్మణరేఖను దాటలేదు… అలాంటిది ఒకేసారి ఇంతటి వెకిలి, వెగటు డాన్స్ ఎలా చేసిందని అందరూ విరుచుకుపడ్డారు…
ఎలాగూ హీరోకు, దర్శకనిర్మాతలది వెగటు టేస్ట్… ఏదో సమర్థించుకోవడానికి సాకులు చెప్పాల్సిన పని కూడా లేదు, అయితే సజ్జనార్ సహా ఇంకెవరైనా ఉన్నత పోలీస్ అధికారులు స్పందిస్తారేమో అనుకున్నాను గానీ అందరూ లైట్ తీసుకున్నట్టున్నారు… లేడీ కానిస్టేబుళ్లను మరీ చిల్లరగా చూపించారు కదా… దీనితో పోలిస్తే ఆఫ్టరాల్ ఫైటర్ సినిమాలో ఓ జంట యూనిఫామ్‌లో లిప్ లాక్ ముద్దు పెట్టుకోవడాన్ని ఓ తప్పుగా పరిగణించగలమా అసలు..?
Share this Article