.
అవును, మన దేశం అంటే అంతే… ప్రతి దానికీ రాజకీయాలు… చివరకు సొంత మతాన్ని ఆచరించాలన్నా, అనుసరించాలన్నా ఎక్కడ మైనారిటీలకు కోపం వస్తుందోననే భయం… సందేహం… పవిత్రమైన సెక్యులరిజం అంటే స్వధర్మాన్ని పాతరేసి, పరధర్మాల్ని నెత్తికెత్తుకోవడం…. — ఓ మిత్రుడి చేసిన ఈ వ్యాఖ్య తరువాతే కాస్త కుంభమేళా స్నానాల వార్తల్ని మరో కోణంలో తవ్వా… కొన్ని చెప్పుకోవాలి…
అచ్చంగా అయోధ్యలాగే కుంభమేళాను కూడా అదేదో బీజేపీ కార్యక్రమం అన్నట్లుగా తీసిపడేశాయ్ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు… తద్వారా ఆ పార్టీలే వాటంతటవే హిందువుల్ని బీజేపీ వైపు నెట్టేస్తున్నాయ్ ఎప్పటిలాగే… దిక్కుమాలిన ఆలోచనవిధానం… అయోధ్యకు కనీసం బీజేపీ క్యాంపు సాగించిన రామజన్మభూమి ఉద్యమం ముద్ర ఉంది… మరి మహాకుంభమేళాకు ఏముంది..?
Ads
144 ఏళ్లకు ఓసారి వచ్చే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనసందోహం… 20 కోట్లా, 30 కోట్లా, 40 కోట్లా వదిలేయండి… మహాకుంభమేళాకు హిందూమతానికి సంబంధించిన ఓ విశ్వాసం… వ్యయం, ప్రయాసలకు ఓర్చి తప్పకుండా పుణ్యస్నానం చేయాలనే తపనతో దేశం నలుమూలల నుంచీ వెళ్తున్నారు… ఇక చివరికొచ్చింది…
సరే, మొదట తెలుగు రాష్ట్రాలకు వద్దాం… ఒకప్పుడు బాప్టిజం తీసుకున్నాడా, నాస్తికుడా అనేది వదిలేస్తే ఇప్పుడు పవన్ కల్యాణ్ వీర సనాతన ధర్మ పరిరక్షకుడు కదా… కుంభమేళాకు వెళ్లాడు, తన క్రిస్టియన్ భార్యతోసహా… స్నానం చేశాడు… గతంలో ఏమో గానీ ఇప్పుడు టీడీపీ బీజేపీ కూటమి సభ్యురాలు కదా… లోకేష్ వెళ్లాడు… చంద్రబాబు తన లౌకిక పాతివ్రత్యానికి భంగం వాటిల్లకూడదని వెళ్లలేదు… జగన్ గురించి వదిలేయండి… తన గురించిన ప్రస్తావనే ఓ వేస్ట్ స్పేస్…
తెలంగాణలో రేవంత్ రెడ్డి వెళ్లడు, ఏ కాంగ్రెస్ నాయకుడూ వెళ్లడు… ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచనధోరణి… తనకు ఎన్నికలప్పుడు గుళ్లు, జంధ్యాలు, గోత్రాలు గుర్తొస్తాయి.., ప్రియాంకకు గంగాస్నానాలు గుర్తొస్తాయి… హిందూ వోటర్లను మభ్యపెట్టేందుకు… కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు కదా, కుంభమేళా అంటే తనకూ అదొక బీజేపీ ప్రోగ్రాం… సో, తెలంగాణ కాంగ్రెస్ దూరం… కర్నాటక సహా అన్ని రాష్ట్రాల కాంగ్రెసులూ దూరం దూరం… మొత్తంగా అది హిందువులకే దూరం…
బొందుగాళ్లు, శూర్ఫణఖ జన్మభూమి, రావణ జన్మభూమి అంటూ అయోధ్య చందాల మీదే రచ్చ చేసిన కేసీయార్ కూడా కుంభమేళాకు దూరం… హైదరాబాద్ ఎన్నికలొస్తే మాత్రం మజ్లిస్ మా దోస్త్ పార్టీ కాదు, కేసీయార్ అరివీర భయంకర, ప్రపంచంలోకెల్లా పెద్ద హిందువు అని ప్రచారాలు… కేటీయార్ నాస్తికుడు కావచ్చు గాక… అందుకే సైలెంటుగా హరీష్ ఒక్కడే వెళ్లి వచ్చాడు…
సరే, స్టాలిన్ నాస్తిక చక్రవర్తి, తన పార్టీ సిద్ధాంతమే నాస్తికత్వం… ఇళ్లల్లో మహిళలు మాత్రం ఆస్తికులు, అది వేరే సంగతి… పినరై విజయన్ యాంటీ హిందూయే కదా… అవసరమైతే శబరిమలలో రుతుమహిళల్ని ప్రవేశపెట్టి కోట్ల అయ్యప్ప భక్తులను అవమానించిన చరిత్ర… ఆ పార్టీ నాస్తికత్వం ఓ పెద్ద డొల్ల… ఈమధ్యే హిందూ ఉత్సవాలకు వెళ్లాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందట… మరి కుంభమేళాలో ఒక్కడూ కనిపించలేదేం..?
చివరకు వీరహిందూ అనిపించుకున్న ఉద్దవ్ ఠాక్రే శివసేన కూడా మహాకుంభమేళాను బీజేపీ కార్యక్రమం అనుకుంది… వదిలేసింది… సరే, శరద్ పవార్‌ను లెక్కలోకి తీసుకునే పనిలేదు… ఇలాగే చూడండి… బీజేడీ కూడా ఆ భ్రమల్లోకి జారిపోయింది… ఆర్జీడీ, ఎస్పీ నేతలు సరేసరి… వాళ్లెప్పుడూ యాంటీ హిందూయే కదా… మమత గురించి తెలిసిందే కదా… మృత్యు కుంభ్ అనేసింది రోహింగ్యా దీదీ… అనకపోతేనే ఆశ్చర్యం…
లాలూ కుంభమేళా ఓ పిచ్చి కార్యక్రమం, నాన్సెన్స్ అన్నాడు… ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా… ప్రతి యాంటీ బీజేపీ పార్టీ మహాకుంభమేళాను బీజేపీ కార్యక్రమంగా భావించి… తమ యాంటీ హిందూ పోకడల్ని ప్రదర్శించుకున్నాయి… హిందూ సంఘటన వైపు, హిందువుల్ని బీజేపీ వైపు నెట్టేసేది ఈ పార్టీలే… బీజేపీ బలం కూడా ఇదే… అది అర్థం కావడం లేదు ఈ పవిత్రమైన డొల్ల లౌకిక తత్వాలకు…!!
బీజేపీకి ఈ ధోరణి తెలుసు కదా… మరింతగా హిందుత్వ ఫోకస్‌కు ప్రయత్నించింది… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యలు స్నానాలకు వరుసలు కట్టారు… ఇక యోగీ అయితే పూర్తిగా దీని మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాడు..!!
Share this Article