ఉన్నది లేనట్టుగా…. లేనిది ఉన్నట్టుగా… ప్రచారంతో గాయిగత్తర లేపడం కేసీయార్ క్యాంపుకి ఆది నుంచీ అలవాటే… ఈ ధోరణికి మంచి తెలుగు పేరు లేనట్టుంది… ఈ ప్రచార ధోరణి కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయి జనం ఎన్నికల్లో ఛీత్కరించినా సరే ఆ అలవాటు నుంచి ఆ క్యాంప్ బయటపడలేకపోతున్నది… ఫాఫం, కాంగ్రెస్‌కు కౌంటర్ ఎటాక్ చేతకావడం లేదు, ఎప్పటిలాగే..!
నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో ఒకటే ఊదర… నిండుకుండలా మేడిగడ్డ అని ఫోటోలు… కాళేశ్వరం ఓ మహాద్భుతం అన్నట్టుగా పోస్టులు… అసలు మేడిగడ్డ కుంగిపోవడం నిజం కాదనీ, అది మేటిగడ్డ అన్నట్టుగా కీర్తనలు… ఓ మహానృతం… అంటే అతి పెద్ద అబద్ధం ఇది…
సంకల్పం, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, కమీషన్లు వంటి అనేక విషయాల్ని తెలంగాణ చాన్నాళ్లుగా గమనిస్తున్నదే… జనం కళ్లకు గంతలు కట్టలేరు… ఐనా కట్టే ప్రయత్నం ఆపదు కేసీయార్ శిబిరం… చివరకు కేటీయార్ ట్వీట్ సారాంశం కూడా మేడిగడ్డకు ఏమీ కాలేదు అన్నట్టుగానే… సందర్శిస్తాడట… కుంగిపోయిన తీరు ఆల్రెడీ చూసివచ్చారు కదా, ఇప్పుడేం చూస్తారు..?
Ads
అసలు మేడిగడ్డకు ఏమీ కాకపోతే… మరి నిల్వ ఎందుకు చేయలేకపోతున్నాం… గేట్లు తీసేసేకొద్దీ పాతాళానికి తీసుకుపోయే సొరంగాలు ఎలా బయటపడ్డాయి..? ఇప్పటికీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ప్రమాదకరమే అని కేంద్ర నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు… విచారణ సాగుతోంది కదా, ఆ నివేదికలు పూర్తయితే కదా… అది మేటిగడ్డో, మేడిపండుగడ్డో తేలేది… అప్పుడే ఈ ఉల్టా ప్రచారాలు దేనికి..?
వాటిల్లో నీరు నిల్వ చేయవద్దని కేంద్ర జలసంస్థలు హెచ్చరిస్తున్నాయి, వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నాం… దిగువన అడ్డుకునే ప్రాజెక్టు ఏమీ లేదు… మరి లక్షకు మించి కోట్ల వ్యయానికి సార్థకత ఏమున్నట్టు..? నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీ ఏవో రిపేర్లు చేసినట్టు వార్తలు కనిపించాయి… నిజంగా శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందా..? మేడిగడ్డకు ఇక ప్రమాదం ఏమీ లేనట్టేనా..? లేనప్పుడు నిల్వ లేదెందుకు..?
ఇవన్నీ నిజాలు… కానీ అసలు అక్కడ ఏమీ జరగనట్టు… ఓ ఎనిమిదో వింత దృఢంగా నిలబడినట్టు ఈ ప్రచారం జనాన్ని మభ్యపెట్టడం, మోసగించడం కాదా..? కేసీయారే కదా ఆమధ్య ఎక్కడో చెప్పింది… ఎన్నిచోట్ల వంతెనలు కూలిపోవడం లేదు, జరుగుతూనే ఉంటాయి అని… మరిప్పుడు అక్కడేమీ జరగలేదనీ, ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర అన్నట్టుగా ప్రచారం దేనికి..?
15 జులై 41200 క్యూసెక్కులు
16 జులై 41200 క్యూసెక్కులు
17 జులై 49500 క్యూసెక్కులు
18 జులై 53400 క్యూసెక్కులు
19 జులై 341000 క్యూసెక్కులు
20 జులై 280000 క్యూసెక్కులు
మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయ వద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అందుకే మొత్తం 85 గేట్లు ఎత్తి ఉంచారు… ప్రస్తుతానికి ఇక్కడ ఒక్క బొట్టు నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితులు లేవు… మేడిగడ్డకు ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీ వద్ద కూడా ప్రవాహం పెరిగింది… 12,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంటే… అక్కడ కూడా నీటిని నిల్వ చేయవద్దని ఎన్ డీఎస్ఏ హెచ్చరించింది… ఇదీ రియల్ పిక్చర్..!!
Share this Article