పార్థసారథి పొట్లూరి :: కొన్ని ప్రశ్నలు : హిండెన్బర్గ్ ఆరోపిస్తున్నట్లు బాంకులు ఉదారంగా అప్పులు ఇచ్చేసాయా ఆదానీ కి ? సామాన్య ప్రజలకి తెలియని విషయం ఏమిటంటే ఆదాని గ్రూప్ లాంటి పెద్ద గ్రూపులని ఎలా నడుపుతారో అని. ఆదానీ గ్రూపు లాంటి వాటి మీద ఉన్న అపోహ ఏమిటంటే బాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఆదానీ అడిగిన వెంటనే రుణాలు ఇచ్చేస్తాయని. కానీ వాస్తవంగా అలా జరిగే అవకాశం లేదు ఒక్క అధికార దుర్వినియాగం చేస్తే తప్ప.
CLSA [Credit Lyonnais Securities Asia] అనే సంస్థ ఆదానీ గ్రూపు అప్పులని, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆదానీ ఎంటర్ప్రైజెస్ [Adani Enterprises], ఆదానీ పోర్ట్స్ [Adani Ports ], ఆదాని పవర్[Adani Power ], ఆదానీ గ్రీన్ అండ్ ట్రాన్స్ మిషన్ [Adani Green & Transmission ] ల మొత్తం అప్పులో అంటే 2 లక్షల కోట్ల అప్పులో 70,000 నుండి 80,000 వేల కోట్లు బాంకులు ఇవ్వవచ్చు అని చెప్పింది. సరిగ్గా గౌతమ్ ఆదానీ భారత్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ బాంకుల నుండి తీసుకున్న అప్పు కూడా 70 వేల నుండి 80 వేల కోట్ల రూపాయలుగా ఉంది. మిగతా లక్షా 30 వేల కోట్ల రూపాయలు విదేశీ బాంకుల నుండి అప్పు తీసుకున్నాడు. దీన్ని బట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే భారత్ లోని బాంకుల దగ్గర ఆదానీ తీసుకున్న అప్పు 30% శాతం మాత్రమే మొత్తం అప్పులో.
(****************************
Ads
లక్షా 30 వేల కోట్ల రూపాయల అప్పుని ఇచ్చాయి… సింగపూర్, మలేషియా, సౌత్ కొరియా, వియత్నాం దేశాల బాంకులు… ఈ దేశాల బాంకులకి మోడీ ఫోన్ చేసి చెప్పారా ఆదానీకి అప్పు ఇవ్వమని ? మన దేశంలోని బాంకులు అయినా విదేశాలలోని బాంకులు అయినా PE రేషియో , ఆస్తులు, అప్పులు., బాలన్స్ షీట్ లు, ప్రమోటర్స్ ఎవరు ? వాళ్ళ బాక్ గ్రౌండ్ ఏమిటి ? పరపతి ఉందా లేదా లాంటి విషయాలని మదింపు చేసి అంతా సంతృప్తి కరంగా ఉంటేనే అప్పులు ఇస్తాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయా దేశాల బాంకులు ఆదానిని ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా అడిగి తీసుకొని, వాల్యుయేట్ చేసుకొని నిపుణుల సలహా తీసుకొని మరీ అప్పులు ఇస్తాయి.
అప్పు ఇవ్వాలా వద్దా అనే సలహా ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలకి డబ్బులు ఇచ్చి మరీ సలహా తీసుకొంటాయి ! ఇలాంటి సలహాలు ఇవ్వడానికి ప్రతి దేశంలోనూ కొన్ని సంస్థలు ఉంటాయి అవి ఒక్కో సలహాకి వేల డాలర్లు వసూలు చేస్తాయి. ఈ సంస్థలలో నిపుణులు అయిన చార్టెడ్ అకౌంటెంట్లు ఉంటారు. ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు హిండెన్బర్గ్ లాంటి బహు వీర్య పుత్రులు చెప్పే అబద్ధాలని నమ్మేస్తున్నారు !
గత వారం రోజులుగా వివిధ అంతర్జాతీయ బ్లాగులలో కొందరు మేధావులు చేస్తున్న వాదన ఏమిటంటే ఆదానీ గ్రూపుల మీద ‘మైక్రో ఆడిటింగ్ ‘ [Micro Auditing ] చేయాలని…. బహుశా ఇవాళో రేపో మన దేశంలోని యాంటీ బీజేపీ సెక్షన్లు మైక్రో ఆడిటింగ్ చేయాలనే డిమాండ్ చేస్తారూ, చూస్తూ ఉండండి.
మైక్రో ఆడిటింగ్ అంటే ప్రతి డాక్యుమెంట్ ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆదానీ గ్రూపు లాంటి సంస్థలని మైక్రో ఆడిటింగ్ చేయాలి అంటే వేల సంఖ్యలో చార్టెడ్ అకౌంటెంట్లు కావాలి. కనీసం 2 వేల మందిని నియోగించి ప్రతీ డాక్యుమెంట్ ని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలంటే రెండేళ్ళు పడుతుంది ! ఆదానీ గ్రూపు కి సంబంధించి కనీసం 2 లక్షల డాక్యుమెంట్స్ ఉండవచ్చు. రెండు వేల చార్టెడ్ అకౌంటెంట్ లని నియోగించాలి అంటే ? ‘’పాండవుల సంపాదన కౌరవుల తద్దినాలకే సరిపోయింది ‘’ అన్న సామెత లాగా అవుతుంది !
ఉపసంహరణ : ఆదానీ సంగతి పక్కన పెట్టండి కాసేపు ! మన దేశంలో బాంకులు ఇచ్చిన అప్పులని వాటిని తీసుకున్న సంస్థలని మైక్రో ఆడిటింగ్ చేస్తే ఒక్క బాంకు కూడా నిబంధనల ప్రకారం అప్పు ఇచ్చినట్లు ఉండదు. ఎక్కడో అక్కడ బాంక్ మేనేజర్లు కాంప్రమైజ్ అయిపోయి అప్పులు ఇస్తుంటారు ! మైక్రో ఆడిటింగ్ లో ఇవన్నీ బయటపడితే ఒక్క బాంక్ మానేజర్ కూడా ఉద్యోగంలో ఉండడు !
మీకేంటి సార్ ! మీరు బాంక్ మానేజర్ ! ఇలా అంటూ ఉంటాము బాంక్ మానేజర్లని పట్టుకొని. కానీ బాంక్ మేనేజర్ల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా ? వారానికి ఒకసారి ఆయా బాంక్ యొక్క ఏరియా మేనేజర్ కానీ డివిజనల్ మేనేజర్ కానీ మీటింగ్ పెట్టి తన కింద ఉన్న బ్రాంచ్ మేనేజర్లని తలంటుతాడు ! అప్పులు [అడ్వాన్స్ ] లు ఇవ్వని మేనేజర్లని ఎందుకు అప్పులు ఇవ్వలేకపోతున్నావు ? అంటూ కుళ్ల బొడుస్తాడు ! తన పరిధిలో ఉన్న మొత్తాన్ని అప్పులు ఇచ్చిన మేనేజర్ల ని ఎందుకు వసూలు చేయలేకపోతున్నావు అంటూ తలంటుతాడు ! ఇక అందరినీ కలిపి ఎందుకు రిసీప్ట్ లు [డిపాజిట్స్] తగ్గాయి అని ఇంకో రి తలంటుతాడు ! ఇలా ప్రతి వారం లేదా రెండు వారాలకి ఒక సారి తల వాచిపోయేలా చీవాట్లు తింటూ ఉంటారు బ్రాంచ్ మేనేజర్లు !
ఇలాంటి ఒత్తిడిని భరించలేక మేనేజర్లు చిన్న చిన్న లోపాలని పక్కనపెట్టి అప్పులు ఇస్తూ ఉంటారు ! మైక్రో ఆడిటింగ్ లో ఇవన్నీ బయటపడతాయి కాబట్టి నిబంధనలని అతిక్రమించినట్లే అన్ని బాంకులు కూడా ! ప్రజల దగ్గర నుండి డిపాజిట్లు వసూలు చేసి వాళ్ళకి నెల నెలా వడ్డీలు ఇవ్వాలంటే డిపాజిట్ చేసిన డబ్బుని ఎవరికో ఒకరికి అప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి వడ్డీలు రాబట్టాలి బాంకులు… కనుక కొన్ని విషయాలని చూసి చూడనట్లు వదిలేసి అప్పులు ఇచ్చేస్తూ ఉంటాయి బాంకులు !
పార్ధసారధి అనే పేరు శ్రీ కృష్ణుడికి ఉన్న ఇంకో పేరు. అర్జునుడి రధ సారధి కదా ! రధ సారధ్యం అంటే? యుద్ధ రంగంలో కృష్ణుడు రధం నడపాలి అంటే రధికుడు అయిన అర్జునుడి సూచనలని అనుసరించాలి ! ఎలా ఉంటాయి సూచనలు ? రధాన్ని కుడి వైపు తిప్పు కృష్ణా అని నోటితో ఆడగడు అర్జునుడు- కుడి వైపుకి తిప్పాలి అంటే అర్జునుడు కాలితో కుడి వైపు కృష్ణుడి డొక్కలో నొక్కుతాడు అప్పుడు కృష్ణుడు రధాన్ని కుడివైపుకి తిప్పుతాడు. నేరుగా వెళ్ళాలి అని చెప్పడానికి వీపు మీద కాలితో నొక్కుతాడు. కృష్ణ కృష్ణా ! ఇదీ రధ సారధ్యం అంటే ! పైగా పార్ధసారధి అనే బిరుదు ! అర్ధమయిన వారికి అర్ధమయినంత !
ఉపసంహారం :: ఈ ఆరోపణలతో విసిగిపోయిన ఆదానీ 20 వేల కోట్ల పబ్లిక్ ఆఫర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు తాజాగా… అందరి డబ్బులూ వాపస్ ఇవ్వనున్నట్టు చెప్పాడు… భారతీ ఎయిర్‌టెల్ ఓనర్ సునీల్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ బాస్ సజ్జన్ జిందాల్ ఆదానీకి మద్దతుగా నిలబడి, పబ్లిక్ ఆఫర్‌లో షేర్లు తీసుకున్నట్టు సమాచారం… అబుదాబీ రాజకుటుంబానికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ కూడా సపోర్టు చేసింది… కానీ రిటెయిల్ ఇన్వెస్టర్లు, కంపెనీ స్టాఫ్ మాత్రం పెద్దగా షేర్లు కొనడానికి ముందుకు రాలేదు..!! ఈ కథ ఇక్కడ ముగిసిపోయినట్టేనా..? ఏమో, కాకపోవచ్చు… గెలకడానికి ప్రతిపక్షాలు, అంతర్జాతీయ భారత వ్యతిరేక శక్తులు మరింతగా దాడిని ఉధృతం చేస్తాయి… ఆల్‌రెడీ విజయం సాధించాయి కదా… మోడీ మీదకు ఆదానీ భుజాల మీదుగా అస్త్రాలు దూసుకురాబోతున్నాయి..!! (ఉపసంహారం ముచ్చట యాడ్ చేసిన పేరా…)
Share this Article