Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీజీ… ఈ మాత్ర సేఫేనా..? ఈమాత్రం ఆలోచించలేదా..? ఏం జరుగుతోంది..?!

January 6, 2022 by M S R

ఈ కోవిడ్ సంక్షోభంలో అత్యంత జాగ్రత్తగా, జనప్రయోజనకరంగా ఉండేలా వ్యవహరించాల్సిన మోడీ ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… అంతా గుడ్డెద్దు చేలో పడ్డట్టే…. వేక్సిన్ ధరల దగ్గర్నుంచి మొదలుపెట్టి, చికిత్స ప్రోటోకాల్, డ్రగ్స్‌కు అనుమతి, అడ్డగోలుగా ధరల పెంపు, బ్లాక్ మార్కెట్, వేక్సిన్ల షెల్ఫ్ లైఫ్ పెంపు, సైడ్ ఎఫెక్ట్స్‌పై నిర్లక్ష్యం, జనాన్ని ఆదుకునే చర్యల వరకు బోలెడు అంశాల్లో బొచ్చెడు లోపాలు… అసలు ప్రభుత్వం ఉందా అనిపించేలా…!! నో, నో, మా మోడీ జగదానందకారకుడు అనుకునే వాళ్ల కోసం ఈ తాజా వార్త…

covid

ఐసీఎంఆర్… భారత వైద్య పరిశోధన మండలి చీఫ్ బలరామ్ భార్గవ ఏమంటున్నాడు..? మోల్నుపిరవిర్ అనే మాత్రలు వేసుకుంటే అది జెనెసిటీ… అంటే జన్యువుల్లో మార్పులు, ఎముకలు-కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది బహుపరాక్ అంటున్నాడు… ఆయన సైంటిస్టు… ఈ మాత్రల్ని అందుకనే టాస్క్‌ఫోర్స్ చికిత్స ప్రోటోకాల్‌లో చేర్చలేదని కూడా వివరణ ఇచ్చాడు… ప్రత్యేకించి ఈ మాత్రలు వాడే మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా హెచ్చరికలు చెబుతున్నాడు… కానీ మోడీ ప్రభుత్వం ఏం చేసింది..?

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆ మాత్రలకు వోకే చెప్పేశాడు… అసలు ఈ డ్రగ్ కంట్రోలర్ వ్యవస్థ వ్యవహరించినంత దుర్మార్గంగా బహుశా ఏ వ్యవస్థా పనిచేయలేదేమో రెండుమూడేళ్లుగా… మోడీ ప్రభుత్వంలో ఎవరికీ సబ్జెక్టు నాలెడ్జి లేదు, సమీక్ష లేదు, సంతకాలు పెడుతూ పోయారు… ఇది తాజాది… ఇక మీడియా అయితే ఒమిక్రాన్‌కు అద్భుత చికిత్స వచ్చేసింది అని డప్పు కొట్టడం స్టార్ట్ చేసేసింది… ఈ మాత్రకు ఇండియా ఎందుకు అర్జెంటుగా వోకే చెప్పినట్టు..? ప్రజలకు జవాబు తెలుసుకునే హక్కు కూడా లేదా యువరానర్..?

molnu

ప్రతిపక్షాల్లో ఎవడికీ వీసమెత్తు సబ్జెక్ట్ నాలెడ్జి లేదు, ఎంతసేపూ ధాన్యం కొనుగోళ్లు, కృష్ణుడు కలలో కనిపించడం, శత్రుదేశమైన పాక్ సరిహద్దుల్లో ప్రధాని మోడీని ఫ్లై ఓవర్ మీద నిలిపేయడం… ఇవి తప్ప వాళ్లకు దేశం, ప్రజలు వంటివేమీ పట్టవు… కాదంటే నడ్డా, అడ్డా, ఎర్రగడ్డ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ అని వెక్కిరించడం తప్ప జాతీయ సమస్యల మీద ఓ అవగాహన ఏది..? ఓ అధ్యయనం ఏది..? అవును సార్, ఆమధ్య డీఆర్డీవో ఏదో సూపర్ డ్రగ్ తయారు చేసింది అన్నారు… సతీష్‌రెడ్డి జయహో అని డప్పు కొట్టారు… 2డీజీ… అదేమైంది సార్..?

డెల్టా విరుచుకుపడిన రెండో వేవ్‌లో దేశమంతా స్టెరాయిడ్లు ఎడాపెడా వాడేసి వేల మందిని పొట్టనపెట్టుకున్నారు… బ్లాక్ ఫంగస్ దాకా తీసుకుపోయారు… యాదికి ఉందా సార్..? మీ చెత్తా ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్స్ సంగతి ఇకనైనా అర్థమైందా..? ఇప్పుడిక మోల్నుపిరవిర్ మాత్రల్ని ఎడాపెడా వాడేస్తారట… ధర కూడా తక్కువట… జస్ట్, ఒక గోళీ 35 రూపాయలేనట… కానీ అవి ఎన్ని వాడాలో, ఎన్ని రోజులు వాడాలో మాత్రం చెప్పరు… దాని డేంజర్స్ ఏమిటో చెప్పరు… మన మీడియాకు సిగ్గూశరం ఎలాగూ లేదు… మరిక జనానికి ఏది దిక్కు..? వాడెవడో 73 ఏళ్ల వయస్సులో రకరకాల పాత ఆరోగ్య సమస్యలతో ఠపీమంటే ఒమిక్రాన్ తొలిమరణం అని రాసిపారేసింది మీడియా… థూమీబచె…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మా ముసలాయన చెప్పినట్టు వినడం లేదు… కాస్త గట్టిగా బెదిరించండి ఆయన్ని…’’
  • ఈ ఐదు తాజా పాజిటివ్ ట్రెండ్స్… ఓ కొత్త భారతాన్ని చూపిస్తున్నయ్…
  • ఛిఛీ… ఓ సమాజ ఉద్దారకుడిని లోకం అర్థం చేసుకునే తీరు ఇదేనా..?!
  • విధేయత..! రాజకీయాల్లో ఏమాత్రం అర్థం లేని ఓ డొల్లపదం అది..!!
  • హమ్మయ్య… RRR చూశాక ఆ చింత కూడా తీరిపోయింది… చదవాల్సిన రివ్యూ…
  • ఖర్మ కాలడం అంటే ఇదే… జైలులో సిద్ధూ సెల్‌మేట్ ఎవరో తెలుసా..?!
  • దీన్నే ‘డర్టీ జర్నలిజం’ అంటారా..? ఆంధ్రజ్యోతి ‘పె-ద్ద-లు’ చెప్పాలి…!!
  • కామెడీ షోయా..? డాన్స్ షోయా..? మ్యూజిక్ షోయా..? ఎవడుర భయ్ ప్లానర్..!!
  • సెట్లు లేవ్… మేకప్పుల్లేవ్… విగ్గుల్లేవ్… పాటల్లేవ్… బీజీఎంలో మూడే వాయిద్యాలు…
  • ఓహో… బీసీ కృష్ణయ్య ఎంపిక వెనుక అంత రహస్య ప్రణాళిక ఉందా..?!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions