.
కర్నూలుకు చెందిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాస్పిటల్స్, నివాసం హైదరాబాదులో ఉంటాయి, తెలంగాణ కోటాలో పద్మవిభూషణ్… పర్లేదు…
బాలకృష్ణ ఉండేది, వ్యాపారాల నిర్వహణ అంతా హైదరాబాదే… కానీ ఏపీ కోటాలో పద్మభూషణ్… పర్లేదు… ఇక్కడే ఉండే నాగఫణి శర్మకు కూడా ఏపీ కోటాలో పద్మశ్రీ… పర్లేదు… పంచముఖి రాఘవాచార్య ఎక్కడ ఉంటాడో, ఎందులో ప్రసిద్ధుడో తెలియదు… తెలిసినవారు చెప్పాలి… తనకూ ఏపీ కోటా నుంచే పద్మశ్రీ…
Ads
ఏ తెలుగువారికి ఏ రాష్ట్రం కోటాలో ఇచ్చారో, ప్రాతిపదికలు ఏమిటో ఏలినవారికే తెలియాలి… సరే, దాన్నలా వదిలేస్తే..? నాగఫణి శర్మకు పద్మశ్రీ ఇవ్వడం పట్ల సోషల్ మీడియా బాగా విరుచుకుపడుతున్న తీరు తన మీద తెలుగు సమాజంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది…
అసలు ఈసారి పద్మ పురస్కారాలకు ఓ లెక్కాపత్రం లేక రాజకీయ వాసనలు కొడుతున్నాయనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది… అసలు నాగఫణి శర్మకు ఎవరు సిఫారసు చేశారనేది పెద్ద ప్రశ్న… చంద్రబాబు ప్రభుత్వమేనా..?
గద్దర్, గోరెటి వంటి పేర్లను మేం ప్రతిపాదించామని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు… మా సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ విమర్శిస్తున్నాడు… అసలు ఈ పురస్కారాలకు పాటించే పద్దతి ఏమిటనేదే పెద్ద క్వశ్చన్ మార్క్… ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్లడం లేదు గానీ… నాగఫణిశర్మ గురించి…
సహస్రావధాని, ప్రవచనకర్త… వోకే, ఆయన సహస్రావధాన విద్వత్తు గురించి, ప్రవచన సామర్థ్యం గురించి విశ్లేషించడం ఇక్కడ కుదరదు, అది కష్టం కూడా…! కానీ ప్రవచనాల్లో పదే పదే నీతులు వల్లించే వ్యక్తి… మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి ప్రవచించే వ్యక్తి… అప్పట్లో అమెరికాలో ఆతిథ్యం ఇచ్చి, అన్నం పెట్టిన తల్లి వంటి ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసు కూడా నమోదైనట్టు వార్తలు వచ్చాయి…
తరువాత తన ప్రవచనాలకు, తన అవధానాలకు విలువ లేకుండా పోయింది… చాన్నాళ్లు తను తెరపైకి రాలేదు… పాత నాగఫణిశర్మ పెద్దగా కనిపించలేదు… ఆయన సరస్వతీ పీఠానికి కూడా అప్పటి ప్రభుత్వం అత్యంత విలువైన భూమి కూడా ఇచ్చినట్టు వార్తలొచ్చాయి… ఆ తరువాత అప్పుడప్పుడూ ఏవో యూట్యూబ్ వీడియోలకు ఏమైనా ఇంటర్వ్యూలు ఇచ్చాడేమో గానీ యాక్టివ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో లేడు… తనకు ఎన్టీయారే కావచ్చు సహస్రఫణి అనే బిరుదు ఇచ్చింది… కానీ ఆ అమెరికా కేసుతో తను పూర్తిగా ఇజ్జత్ పోగొట్టుకున్నాడు…
ఆ కేసు ఏమైందో తెలియదు గానీ… ఎలా సెటిలైందో తెలియదు గానీ… హఠాత్తుగా ఆయన పాదపద్మాలకు పద్మశ్రీ పురస్కారాన్ని సమర్పించి మొక్కాలనే కోరిక మోడీకి ఎందుకు కలిగిందో తెలియదు… తెలుగు సమాజం ఏవగించుకునే వ్యక్తి అంత పునీతుడైపోయాడా అకస్మాత్తుగా… చాలా పద్మ పురస్కారాలు ఈసారి మోడీ ఎంపికల మీద (ఎవరు చేసినా అంతిమంగా జవాబుదారీ మోడీయే అవుతాడు..!!) బోలెడు విమర్శలు, అందులో ప్రబలమైంది ఆ నాగ పద్మశ్రీ..!
Share this Article