.
రాఘవేంద్ర స్వామి సమాధి… ఓ యోగి, తపోసంపన్నుడు… జీవితమంతా ఆధ్యాత్మిక, ధర్మ వ్యాప్తికే ప్రయత్నించాడు… మంత్రాలయం పేరిట ఇప్పుడా స్థలం ఓ పుణ్యక్షేత్రం…
దత్తాత్రేయ మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి కురువాపురం, దానికీ ఓ ప్రాశస్త్యం… రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామి తపోభూమి గానుగాపురం… ఒక పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, ఒక షిర్డి సాయిబాబా కావచ్చు…
Ads
వాళ్ల స్పిరిట్యుయల్ వైబ్స్ వేరు… నమ్మేవాళ్లకు వాళ్లే దేవుళ్లు… సరే, అలాంటోళ్ల సమాధులకు సహజంగానే సంక్రమించే విశిష్టత వేరు… వాటిని పక్కన పెడితే… కొన్నిచోట్ల అభిమాన తారలకు, అభిమాన నాయకులకూ గుళ్లు కడతారు… అవి మూఢత్వంగా కనిపిస్తాయి…
స్వార్థం, హిపోక్రసీ తప్ప మరేమీ ఉండని సినిమా సెలబ్రిటీల పట్ల ఫ్యానిజం అసలే ప్రమాదకరంగా మారుతోంది… అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట తాజా ఉదంతమే కదా… ఈ స్థితిలో నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి వ్యాఖ్యలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి… తను ఏకంగా ఎన్టీయార్ సమాధిని కూడా ఓ పవిత్ర, పుణ్యక్షేత్రం అంటున్నాడు…
ఇదుగో ఇలాంటివే… తన అభిమానం, ఎన్టీయార్ అంటే తనకున్న పిచ్చి వ్యక్తిగతం, అందులో తప్పులేదు… కానీ ఎన్టీయార్ సమాధిని దివ్యక్షేత్రం వైపు చిత్రీకరించే ప్రయత్నాల్ని ఎలా అర్థం చేసుకోవాలి…
నందమూరి వంశంలో నాలుగో తరం హీరోగా మరో వెరీ జూనియర్ ఎన్టీయార్ రంగప్రవేశం చేస్తున్నాడు తెలుసు కదా… ఇదే వైవీఎస్ చౌదరి తీస్తున్నాడు సినిమా… హరికృష్ణ కొడుకు జానకీరాం కొడుకట… తన పేరూ తారకరామారావే… ఆల్రెడీ జూనియర్ ఎన్టీయార్ ఉన్నాడు కదా, ఇతన్నేమని పిలవాలో…
సరే, నిన్నటి నుంచీ తనే ఎన్టీయార్ ఘాట్ మీద పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం వ్యాఖ్యలు చేశాడన్నట్టుగా మీమ్స్, వార్తలు కనిపిస్తుంటే చెక్ చేయాల్సి వచ్చింది… తన మాటల్లో ఎన్టీయార్ కుటుంబసభ్యుల ప్రస్తావన, నందమూరి నటులకు అలవాటైన రీతిలోనే వంశకీర్తన ఉన్నాయి గానీ పుణ్యక్షేత్రం ప్రస్తావన లేదు…
ఆ మాటలు అన్నది వైవీఎస్ చౌదరి… ఇదీ ఇన్‌స్టా లింక్…
ఈ సబ్ జూనియర్ ఎన్టీయార్ (?) బాగానే మాట్లాడాడు… సరే, నాలుగు తరాలూ వాళ్లేనా అనే విమర్శలు ఎలా ఉన్నా… అనర్హత మాత్రం కాదు కదా, మెరిట్ ఉంటే నిలబడతాడు, లేకపోతే తెరమరుగు అవుతాడు, వారసత్వం ఎంట్రీ వరకే తప్ప నిలబెట్టాల్సింది శ్రమ, సాధన, సహజసిద్ధమైన ప్రతిభ మాత్రమే…
వైవీఎస్ చౌదరి ఏమంటాడంటే… ‘‘ఎన్టీయార్ దైవం, పవర్ ఫుల్ మూడక్షరాలు, ఈ ప్రదేశం (ఎన్టీయార్ ఘాట్) పుణ్యక్షేత్రం, దివ్యమైన స్థలం, శక్తినిచ్చే స్థలం, నందమూరి ప్రపంచ అభిమానులందరికీ అంతే… ఇక్కడికొచ్చి కష్టాలు చెప్పుకుంటాం, బాధలు చెప్పుకుంటాం, ఆనందాన్ని చెప్పుకుంటాం… ఇదొక మెడిటేషన్ వంటిది… సమస్యలకు సొల్యూషన్ చెప్పే ప్రదేశం…’’ దేవుడా… దేవుడా…!!
అయ్యా, చౌదరి గారూ, అంటే అన్నామంటారు గానీ… ఇదే కుటుంబం కదా తనకు వెన్నుపోటు పొడిచి, మనశ్శాంతి లేకుండా చేసి, అదే మనోవ్యధతో కన్నుమూసేట్టు చేశారు కదా… అంతమంది సంతానం ఉన్నా ఎందుకు ఒంటరివాడయ్యాడు తను..? మళ్లీ అదే ఎన్టీయార్ ఇప్పుడు దేవుడు, ఆయన సమాధి ఓ పుణ్యక్షేత్రం… పార్టీకి, ఆ కుటుంబానికి… ఇది కదా అసలైన విరోధాబాస అంటే..!! అనగా ఇంగ్లిషులో పారడాక్స్..!!
Share this Article