….. ఆంధ్రజ్యోతి కలానికి కాస్త తీట ఎక్కువ… ఉండాల్సిందే… పచ్చిసిరా నింపుకున్నప్పుడు ఆ విధేయత చూపకపోతే ఎలా..? అందుకే ఓ చిల్లర పంచాయితీ లేనిది ఉన్నట్టుగా ఓ కథ రాసింది లెండి… ఏమిటయ్యా అంటే… పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, పైసలు కేంద్రమే ఇస్తున్నది కాబట్టి, దానికి వాజపేయి పేరు పెట్టాలని భావిస్తోంది అని ఓ వార్తను కుమ్మేశారు… పూర్తిగా పచ్చజెండాను ఆవాహన చేసుకోవడం అంటే అదీ… నిజానికి ఈ రాతల నిబద్ధత చంద్రబాబును మించి చంద్రభక్తి…
నో, నో, జగన్ తన తండ్రి పేరు పెట్టాలని అనుకుంటున్నాడు, ప్రాజెక్టు ఎత్తు తగ్గించినా సరే, ఆ ఎత్తుకు మించి ఓ విగ్రహం పెట్టాలని అనుకుంటున్నాడు జగన్ అంటూ ఈ కథనం చెబుతోంది… తప్పేమీ లేదు, కొత్తదనం ఏమీ లేదు… అసలు ఇప్పుడు నవ్యాంధ్ర వైఎస్ ఆంధ్ర అని పేరు పెడితే ఎలా ఉంటుంది అని జగన్ ఆలోచిస్తున్నట్టుగా ఈ కథనం కొత్త కథ ఏదో చెబుతోంది….!
నిజానికి ఓ రెండుమూడొందల పథకాలకు వైఎస్ పేరు పెట్టేశాడు కదా జగన్… పోలవరానికి వైఎస్ పేరు పెట్టకపోతేనే హాశ్చర్యం… అదేమిటి..? దానికి ఇందిరసాగర్ అని గతంలో పేరు పెట్టారు కదా అంటారా..? ఎహె ఊరుకొండి… రాజధానులే మారిపోతున్నయ్… ఆఫ్టరాల్ ప్రాజెక్టుల పేర్లకేం వచ్చింది..? అవశేషాంధ్ర కలల ప్రాజెక్టు, వరప్రదాయిని అయిన పోలవరానికి వైఎస్ పేరు పెట్టకపోతే ఎలా..?
Ads
అదే ఎలా పెడతారు..? తనేమీ రూపాయి ఇవ్వడం లేదు కదా, మోడీ కదా డబ్బులిచ్చేది, వాళ్లిష్టం కదా, సావర్కర్ పేరు లేదా సర్దార్ పటేల్ పేరు… మరీ కాదంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరు పెడతారు, అంతేతప్ప ఈ జగన్ చెప్పగానే వైఎస్ పేరు పెడతారా..? అసలే వైఎస్ సోనియా వీరభక్తుడు అంటారా..?
ఇక్కడే బీజేపీకి తల్కాయ పనిచేయనిది… ఏ రాముడిదో, ఏ భగీరథుడిదో పేరు పెడితే సరిపోయేదిగా… అప్పుడు జగన్ వ్యతిరేకిస్తే, హిందూ వ్యతిరేకిగా ముద్రేయవచ్చు… అరె, పైసలు ఎవడిస్తేనేం..? కట్టేది నేను, మా జాన్‌జిగ్రీ మెఘా కృష్ణారెడ్డి కదా అనుకుంటే… వోకే… మేఘ కృష్ణా ప్రాజెక్టు అని పెడితే సరిపాయె… అందులో బీజేపీకి నచ్చిన కృష్ణుడున్నాడు, జగన్‌కూ ఖుషీ… డబ్బుల యవ్వారాలకు సరైన జస్టిఫికేషన్…
కాదూ అంటే… వైఎస్ రామసావర్కర్ అని పేరు పెట్టండి… రామ అని తన బాధితుడు ఎన్టీయార్ పేరు కూడా కలిసొస్తుంది కాబట్టి చంద్రబాబు కూడా కిక్కుమనడు… బీజేపీవాళ్లకూ ఖుష్… వైఎస్ పేరు సరేసరి… మరీ జనసేననూ శాటిస్పై చేయాలనుకుంటే… వైఎస్ వెంకటరామసావర్కర్ ప్రాజెక్టు అని పెట్టండి… తన తండ్రి పేరు కలిసొస్తున్నది కాబట్టి పవనుడూ, చిరంజీవి కూడా కిమ్మనరు… థూమీ రాజకీయాలు చెడ…
పోలవరం అంటే పోలవరం… అంతే… పోనీ, ఆ ప్రాజెక్టుతో భద్రాద్రి రాముడిని ముంచేస్తారట కదా… భద్రరామ ప్రాజెక్టు అని పేరు పెట్టండి… కేసీయార్ కూడా టిక్ పెడతాడు… అప్పుడు అందరూ హేపీ… ఎవడి భూములు మునిగితేనేం… ఎవడి కొంపాగోడూ కొట్టుకుపోతేనేం… మనకు మన నేతల పేర్లు, ఫాల్స్ ఇమేజీలు ముఖ్యం కదా… థూమీబచె… ఏ ఏకలవ్యుడిదో, ఏ గుహుడిదో, ఏ వాల్మీకి పేరో పెట్టండి, ఎవడు కాదంటాడో చూద్దాం… అబ్బే, అది మాత్రం మనకు చేతకాదు…!!
Share this Article