ఈ విశ్వంలో ఎన్ని లోకాలున్నయ్… మన పురాణాల మేరకు ఆలోచిస్తే పద్నాలుగు… ఊర్ద్వలోకాలు ఏడు, అధోలోకాలు ఏడు… అధోలోకాలు అంటే నీచమైనవి అని కాదు, దిగువన ఉండేవి అని..! ఊర్ధ్వంలో ఉండేవి
మరి అధోలోకంలో…
ఛట్, ఇవన్నీ పుక్కిటి పురాణాలు… ఊర్ధ్వంలో ఏముంది..? అంతరిక్షం, ఖగోళం… చిక్కటి చీకటి, శూన్యం… భూమికి దిగువన ఏముంది..? తవ్వేకొద్దీ నీరు, లావాను పోలిన వేడి ద్రవం, విపరీతమైన వేడి… ఇక లోకాలేమున్నయ్..? ఈ సౌర కుటుంబంలో భూమి ఒక్కటే… ఇంకేమీ లేదు అనేవాళ్లు బోలెడు మంది… కాదు, కాదు, మన వాళ్లు మనకు దిగువన ఉన్న అమెరికాను (భూగోళంలో మనం పైన ఉంటే అమెరికా కింద ఉంటుంది కదా…) పాతాళంలాగా భావించి పురాణాల్లో పొందుపరిచారు అనే సమర్థకులూ బోలెడు మంది… అయితే నిజంగానే భూమిలోపల మనకు తెలియని మరోలోకం ఉందీ అంటున్నాయి కొన్ని పరిశోధనలు…
Ads
Journal Physics of the Earth and Planetary Interiors అనే ఓ పత్రిక ఉందిలెండి… అందులో ఓ థియరీ పబ్లిష్ చేశారు రీసెంటుగా… Hawaii Institute of Geophysics and Planetology లో geophysicist Rhett Butler మరియు అతని టీం భూమికి సంబంధించిన అయిదు విభిన్న లొకేషన్లలో కొన్ని ప్రయోగాలు చేశారు… పెద్ద పెద్ద భూకంపాల్ని విశ్లేషించారు… ఓ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు, వాటి మీద The University of Bristol కు చెందిన సిస్మాలజిస్ట్ Jessica Irving కొన్ని ఫైండింగ్స్ జతచేశారు… ఇన్నాళ్లూ మనం అనుకునేదేమిటి..? భూమి లోపల ఉన్నదంతా ఓ ఘనపదార్థం… కానీ పలు భూకంపాలను పరిశీలించినప్పుడు… ఫలితాలు భిన్నంగా కనిపించాయట… భూమి లోపల ప్లేట్స్ కదలికల వల్ల ఏర్పడే ప్రకంపనలు కొన్నిసార్లు కొన్ని ఏరియాల్లోకి వెళ్లేసరికి భిన్నంగా కనిపిస్తున్నయ్… అంటే సాలిడ్ స్టేట్ గాకుండా డొల్ల ప్రదేశాలు ఏవో ఉన్నట్టు తెలుస్తోంది అంటున్నయ్ ఆ పరిశోధనలు… మరి ఆ ప్రదేశాల్లో ఏముంది..? ఆ వేడిలో అసలు జీవం బతికే అవకాశమే లేదు కదా..? అసలు జీవం ఉనికికే చాన్స్ లేదు కదా అంటారా..? అక్కడ కూడా వాతావరణం ఉందనేది ఈ రీసెర్చర్ల డౌటనుమానం… ఏమో… ఏమైనా ఉందేమో… అణుయుద్ధం ప్రబలితే ఆ లోపలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి ఉంటుందా..? అది కూడా రీసెర్చ్ చేసి పెట్టేయడం బెటరేమో…!!
Share this Article