Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డాక్టర్ సాయిపల్లవి..! తను ప్రాక్టీస్ చేయవచ్చా… చదవాల్సిన స్టోరీ..!!

July 8, 2024 by M S R

ఈ చెత్త ఇండస్ట్రీలో కూడా కొన్ని విలువలు పాటించే సాయిపల్లవి అంటే అందరికీ అభిమానమే… పైగా ఇప్పుడు సీత కేరక్టర్ చేస్తుండటం ఆమెకు ఓ వరం… సరే, దాన్నలా వదిలేస్తే… ఈరోజు బాగా ఫోటోలు, వార్తలు కనిపిస్తున్నాయి… ఏమిటీ అంటే… ఆమె డాక్టర్ పట్టా అందుకుంది, ఇంకేం ఆమెను డాక్టర్ సాయిపల్లవి అని పిలవాలి… ఆమె ప్రాక్టీస్ చేయడానికి అంతా రెడీ అని…! తప్పు..!!

ఎందుకో తెలియాలీ అంటే కాస్త మెడికల్ ఫీల్డ్ గురించి తెలియాలి… అదేనండీ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి… నిజానికి ఇప్పటికిప్పుడు సాయిపల్లవి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయొచ్చా అనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి… ఆమె వ్యక్తిగత విషయంపై స్టోరీ కాదు, ఇది విదేశాల్లో మెడిసన్ చేస్తున్న లక్షలాది మంది మెడికల్ స్టూడెంట్స్‌కు లింకై ఉన్న స్టోరీ…

ఎస్, ఆమె ఫ్యామిలీ కేరళలో స్థిరపడినా సరే, ఆమె రూట్స్ నీలగిరి, తమిళనాడు… బాడగ కమ్యూనిటీ… వాళ్ల మాతృభాష కూడా అదే… సాయిపల్లవి సెంతామరై కన్నన్ అలియాస్ సాయిపల్లవి ఇక్కడ ప్లస్ టూ అయిపోగానే జార్జియా వెళ్లింది… మెడిసిన్ చేసింది… అందరికీ ఇక్కడి వరకే తెలుసు…

Ads

జార్జియా అనేది పాత సోవియట్ యూనియన్ ప్రాంతం… తరువాత విడిపోయింది… పాత రష్యా మాత్రమే కాదు, చైనా, ఇతర తూర్పు దేశాల మెడికల్ యూనివర్శిటీలు విదేశీ విద్యార్థులకు మెడిసిన్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి… అదొక వ్యాపారం… ఇండియాలో మెడిసిన్ కోర్స్ మరీ కాస్ట్‌లీ ఎఫయిర్… దాన్ని చక్కదిద్దే తెలివి ఏ ప్రభుత్వానికీ లేదు… కానీ ఇక్కడ ఓ మెలిక ఉంది… ఎవరైనా సరే, ఆయా దేశాలకు వెళ్లి మెడిసిన్ పూర్తి చేయగానే, వచ్చేసి ఇండియాలో పీజీ కోర్సులో, ప్రాక్టీసో చేయడానికి వీల్లేదు…

fmge

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఒక పరీక్ష పెడుతుంది… ఎవ్వరు విదేశాల్లో మెడిసిన్ చదువుకుని వచ్చినా సరే ఈ ఎగ్జామ్ పాస్ కావల్సిందే… పాసయితేనే ఇక్కడ పీజీ, డిప్లొమా, ప్రాక్టీస్ చేయడానికి అర్హులు అవుతారు… అది రూల్… చాలా దేశాలు ఇలాంటి ఎగ్జామ్స్ పెడుతున్నాయి… అమెరికాలో ఎగ్జామ్ మరీ కఠినం… మనవాళ్లు ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఉంటారు…

సరే, సాయిపల్లవి డాక్టరీ విషయంలో కొన్ని సందేహాలున్నాయి… అవి…

  • ఆమె 2016లో జార్జియాలోని TBLC State Medical University లో మెడిసిన్ చదివింది… అప్పట్లో ఒక వార్త చదివినట్టు గుర్తు… ఎవరో విలేఖరి ఫోన్ చేస్తే… నేను కాన్వొకేషన్‌లో ఉన్నాను, చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది ఆమె… మరి ఇప్పుడు ఆమె జార్జియాకు వెళ్లి తీసుకున్న డిగ్రీ ఏమిటి..?

saipallavi

ఇవీ ఆమె డాక్టర్ పట్టా అందుకున్న ఫోటోలు అంటూ బాగా వైరల్ అవుతున్న తాజా ఫోటోలు… మరి 2017లో జరిగిన కాన్వొకేషన్ మాటేమిటి సాయిపల్లవీ..? సరే, అదయిపోయింది… మరి FMGE ఎగ్జామ్ పాస్ కావాలి కదా… ఎస్, 2020 లో తిరుచ్చిలో ఆ ఎగ్జామ్‌కు హాజరైంది ఆమె… ఆ పరీక్ష ఏమిటో తెలియకుండానే మీడియా ఏదేదో రాసేసింది… ఇదుగో ఆనాటి ఫోటో… అది కరోనా కాలం…

saipallavi

ఆమె పరీక్షకు హాజరైంది సరే, కానీ పాసయిందా..? తెలియదు…! పాసైతే వోకే, లేకపోతే మళ్లీ మళ్లీ ఎగ్జామ్ రాసిందా..? తెలియదు..! ఆమధ్య ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది, సొంత హాస్పిటల్ కట్టుకుంటోందనీ, ప్రాక్టీస్ చేయబోతోందనీ వార్తలొచ్చాయి… ప్రాక్టీస్ చేయాలంటే ఆ పరీక్ష పాసవ్వాలి కదా…

సాయిపల్లవి మెంటాలిటీని బట్టి ప్రభుత్వాన్ని చీట్ చేయదు, అనధికారికంగా ప్రాక్టీస్ పెట్టదు… కానీ ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిందో లేదో తనెక్కడా ఎప్పుడూ వెల్లడించలేదు… వెబ్ సమాచారం మాత్రం ఆమె ఆ పరీక్ష క్లియర్ చేసినట్టు చెబుతుంటుంది… నిజానికి ఆ ఎగ్జామ్ ఎంత కఠినమంటే… ఒకసారి ఆ పరీక్ష రిజల్ట్స్ చూడండి…


Year Pass Percentage

2019 20.7%

2020 9.94%

2021 23.91%

2022 10.61%

2023 June 10.20%

2023 December 20.57%


పెద్ద పెద్ద మెరిటోరియస్ అనుకున్న విద్యార్థులే ఢంకీలు కొడుతుంటారు… చాలా టఫ్… గతంలో ఏటా నిర్వహించేవారు, ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి పరీక్ష పెడుతున్నారు… నిజంగానే సాయిపల్లవి ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటే గుడ్, గ్రేట్… కానీ నో కన్‌ఫర్మేషన్… అది లేనిదే ఆమె ప్రాక్టీస్ లేదు… అఫ్‌కోర్స్, ఇప్పుడు ఆమెకున్న డిమాండ్‌ను బట్టి ఇప్పుడప్పుడే ఆమె మెడికల్ ప్రాక్టీస్ పెడుతుందని అనుకోలేం… కానీ డిఫరెంట్ కేరక్టర్ కదా… అందుకే ఇన్ని సందేహాలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions