ఈమధ్య మీడియాలో ఎన్నికల వ్యూహకర్తల వార్తలు కనిపిస్తున్నయ్… ప్రశాంత్ కిషోర్ (పీకే) కూడా గతంలో ఈ ఎన్నికల పనుల్ని తెరవెనుకే పనిచేసేవాడు… పెద్దగా మీడియా తెర మీద కనిపించేవాడు కాదు… కానీ తనను జగన్ ఏదో సందర్భంలో బహిరంగవేదిక మీదే అందరికీ పరిచయం చేశాడు… తరువాత పీకే చంద్రబాబు మీద కూడా ఏవో కామెంట్స్ చేసినట్టున్నాడు… ఆ తరువాత వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు… ఈమధ్య తను ఎటు అడుగువేసినా వార్త అయిపోతోంది… చంద్రబాబుకు పనిచేసే రాబిన్ శర్మ వంటి వివిధ పార్టీలకు పనిచేసే వ్యూహకర్తల వివరాలు కూడా వార్తలు అవుతున్నయ్… పీకే సన్నిహిత శిష్యురాలు, తమిళనాడుకు చెందిన ప్రియా రాజేంద్రన్ ఈమధ్య వైఎస్ షర్మిల కొత్త పార్టీ వైఎస్సార్టీపీకి వ్యూహకర్తగా పనిచేస్తోందనే వార్తలు కూడా వచ్చినయ్… అసలు ఎవరీ ప్రియా రాజేంద్రన్ అని అక్కడిక్కడా సెర్చుతుంటే, అకస్మాత్తుగా కొన్ని ఇంట్రస్టింగు వాక్యాలు కనిపించినయ్… అవేమిటీ అంటే..? ఆ ప్రియా రాజేంద్రన్ మన సినీనటుడు మోహన్‌బాబు బంధువు అని…!
అరె, ఈ తెలుగు మోహన్‌బాబుకూ ఆ తమిళ ప్రియా రాజేంద్రన్‌కు బంధుత్వం ఏమిటబ్బా అని ఇక ఎంత తవ్వినా ఏ పురావస్తు ఆధారాలు దొరకలేదు… తెలిసినవాళ్లు చెప్పాల్సిందే… కానీ మోహన్‌బాబు షర్మిలకు మాత్రం చుట్టమే… మోహన్‌బాబు కొడుకు విష్ణు పెళ్లి చేసుకున్న వెరోనికారెడ్డి షర్మిల బాబాయ్ కూతురే… ఇంతకీ ఎవరు ఈ ప్రియా రాజేంద్రన్..? ఈమె పుట్టింది చెన్నైలో… అసలు పేరు ప్రియదర్శినీ రాజేంద్రన్… ఈ వి.జి.రాజేంద్రన్ తిరువళ్లూరు ఎమ్మెల్యే… డీఎంకేలో సీనియర్… ప్రియా తల్లి ఇందిర… తమిళనాడులోని ఇందిర విద్యాసంస్థలకు బాస్… ప్రియ నిజానికి డాక్టర్… ఎంజీఆర్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ చదువుకున్న ఆమె ఆ తరువాత అమెరికాలో కాస్మిటిక్స్ రంగంలో ట్రెయినింగ్ తీసుకుంది… పెళ్లయింది… భర్త వరుణ్ కల్యాణ సుందరం… ఆయనెవరంటే..? పాపులర్ తమిళ మీడియా పాలిమర్ మీడియా సంస్థ యజమాని కల్యాణ సుందరం కొడుకు, ఆ సంస్థలో డైరెక్టర్…
Ads
ప్రియ కూడా కాస్మెటిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది, చెన్నైతోపాటు ఇంకొన్ని ప్రాంతాల్లో బొటిక్స్ తెరిచింది… తరువాత యాడ్స్, మార్కెటింగ్ ఫీల్డ్‌లోకి ప్రవేశించింది… సహజంగానే ఇందిర విద్యాసంస్థల గ్రూపులో డైరెక్టర్… పాలిమర్ చానెల్‌లో డైరెక్టర్… ఎటొచ్చీ పెద్ద డౌట్ ఏమిటంటే..? ఇంత బిజీ కదా… ఆమెకు సొంతంగానే బోలెడంత పని ఉంది కదా… మరి ఆమె అనామకంగా పీకే టీంలో ఓ సభ్యురాలిగా ఎప్పుడు పనిచేసింది..? ఎందుకు చేసింది..? ప్రత్యేకించి పీకే సౌత్ ఇండియా టీంలో ఈమె చురుకుగా వ్యవహరించేది అంటారు… పీకేకూ స్టాలిన్‌కూ నడుమ ఒప్పందం కుదరడానికి ప్రియ డీఎంకే నేపథ్యం కూడా పనిచేసింది… స్టాలిన్ విజయం ఆమెకు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది… జగన్‌కు ఇప్పటికీ వ్యూహకర్తగానే ఉన్న పీకే షర్మిల పార్టీకి ప్రత్యక్షంగా పనిచేయలేడు… అందుకని ఈ ప్రియను రంగంలోకి దింపినట్టు ఓ ప్రచారం… అయితే… నిజంగా ఎన్నికల వ్యూహకర్తలు పార్టీలను గెలిపించగలరా..? పరిస్థితులు గెలిపిస్తే వీళ్లు ఆ గెలుపును ఓన్ చేసుకుంటున్నారా..? సమాధానం కష్టం..!! 2018లో ఇందిర ఎడ్యుకేషన్ గ్రూప్ బాస్ ఇందిర ట్వీటిన ఫోటో ఇది… మై బ్రదర్ మోహన్‌బాబు అని…!!
Share this Article