ఏ సినిమా ఫంక్షన్లు జరిగినా సరే… హీరోలు కనిపించగానే అభిమానులు కేకలు వేయడం పరిపాటే… ఆ నినాదాల హోరులో కొంతసేపు హీరోలకు మాట్లాడటానికి కూడా గ్యాప్ దొరకదు… సరే, మన అభిమానుల సంగతి తెలిసిందే కాబట్టి దాన్ని పెద్ద విశేషంగా చెప్పుకోలేం… కానీ ఆడవాళ్లంటేనే అంగడి సరుకుగా చూసే ఇండస్ట్రీలో అలాంటి స్టార్‌డం ఓ హీరోయిన్ పొందడం కచ్చితంగా విశేషమే… ఆ స్టార్‌డం అనుభవిస్తోంది సాయిపల్లవి… గతంలో ఈ రేంజ్ పాపులారిటీ, ప్రేక్షకుల అభిమానాన్ని బహుశా ఏ హీరోయిన్ పొంది ఉండదు…
మొన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ జరిగింది… శర్వానంద్ హీరో, పుష్పతో బిగ్ హిట్ కొట్టిన రష్మిక ప్రధాన తారాగణం… అక్కడికి కీర్తిసురేష్, సుకుమార్ కూడా వచ్చారు… ఖుష్బూ, రాధిక, ఊర్వశి తదితర వెటరన్ స్టార్స్ కూడా ఉన్నారు ఆ సినిమాలో… సాయిపల్లవి కూడా వచ్చింది గెస్టుగా… ఫంక్షన్‌లో యాంకర్ సుమ సాయిపల్లవి మాట్లాడుతుందని చెప్పగానే ప్రేక్షకుల నుంచి కేకలు, అరుపులు… హోరెత్తింది…
Ads
ఒక్క నిమిషం ప్లీజ్ అని సాయిపల్లవి బతిమిలాడుకోవాల్సి వచ్చింది… కీర్తిసురేష్, రష్మిక ఆ ఫాలోయింగ్ గమనించి విస్తుపోయారు… సుకుమార్ అయితే విస్తుపోయి, తనను ఏకంగా ‘‘లేడీ పవన్ కల్యాణ్’’ అని మెచ్చుకున్నాడు… నిజానికి ఇది తొలిసారేమీ కాదు… శ్యాంసింగరాజ్ ప్రిరిలీజ్ సమయంలో కూడా ఇంతే… సేమ్ సీన్స్… రెండు నిమిషాలు మాట్లాడతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది… ఎందుకిలా..?
పెద్ద అందగత్తె ఏమీ కాదు… చూడగానే కళ్లు తిప్పుకోలేనంత ఆకర్షణ ఏమీ ఉండదు… ఓ సాదాసీదా యువతి… కానీ ఇంత కీర్తి, ఇంత అభిమానం ఎలా సాధ్యమయ్యాయి..? సింపుల్… ఒకటి) ఆమె డాన్స్… తిరుగులేదు, వర్తమానంలో ఆమె రేంజులో స్టెప్పులు వేయగల హీరోయిన్ ఎవరూ లేరు… రెండు) ఆమె వ్యక్తిగత ప్రవర్తన… డబ్బు కోసం ఏదంటే అది చేసే తార కాదు ఆమె… కమర్షియల్స్, ఓపెనింగ్స్ గట్రా ఏమీ ఒప్పుకోదు…
మూడు) ఎడ్యుకేటెడ్… డాక్టరీ చదివింది… కొన్నాళ్లయ్యాక తమ ఊళ్లో ప్రాక్టీస్ పెట్టుకుంటానని చెబుతోంది… నాలుగు) పాత్రల ఎంపిక… చిల్లర, వెగటు పాత్రల్ని చేయదు… ఫిదాతో తెలుగువాళ్లకు దగ్గరైన ఆమె లవ్ స్టోరీ, శ్యామ్‌సింగరాయ్ సినిమాలతో మరింతగా పాపులరైపోయింది… రాబోయే విరాటపర్వంలో కూడా ఓ డిఫరెంట్ పాత్రే… అయిదు) ఎక్స్‌పోజింగ్ చేయదు… ఇంతా చేస్తే ఆమె నటించింది కేవలం 12 సినిమాలే… మూడు భాషల్లోనూ కలిపి..! రేపు ఏమిటో గానీ… వర్తమానంలో మాత్రం ఆమె లేడీ సూపర్ స్టార్…
Share this Article