బార్క్ రేటింగ్స్ తిరగేస్తుంటే ఓచోట మౌజ్ ఆగిపోయింది… అది ఈటీవీ వాళ్ల ఢీ షో రేటింగ్… జస్ట్, నాలుగు మాత్రమే… (హైదరాబాద్)… నవ్వొచ్చింది… ఎంచక్కా చక్కగా నడిచే షోను ఆగమాగం చేసుకున్నారు కదా అనిపించింది… ప్రేక్షకులకు కూడా రష్మి, సుధీర్ కామెడీ స్కిట్స్, కెమిస్ట్రీ ఫీట్స్ హాయిగా ఉండేవి… ఆది, దీపిక పిల్లి తదితరులు తరువాత వచ్చి చేరినవాళ్లు కదా… రష్మి, సుధీర్ మాత్రం చాలా సీజన్లుగా చేస్తున్నారు… జనానికి అలవాటయ్యారు… ఏమైందో ఏమో, ఆ మల్లెమాల టీంలో వర్గవిభేదాలో లేక నిజంగానే సుధీర్ ‘గాలోడు’ సినిమా బిజీలో దీన్ని వదిలేశాడో తెలియదు గానీ ప్రస్తుత సీజన్ ఒక్కసారిగా డల్ అయిపోయింది… రష్మి కూడా అదేదో సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోంది తప్ప వేరే బిజీ ఏమీ లేదు కదా, మరి ఆమె ఎందుకు మానేసింది..? సో, ఏదో జరిగిపోతోంది ఆ టీంలో…
జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఢీ… అన్నీ ఒడిదొడుకులకు గురవుతున్నయ్… ఢీ షోకే వద్దాం… చాలామంది డాన్స్ పేరిట వేయించబడే పిచ్చి గెంతులు, ఆ సర్కస్ ఫీట్లను చూడరు… వాటి నడుమ తళుక్కుమనే కామెడీ బిట్స్ చూస్తారు… నిజానికి షో చూసేవాళ్లకన్నా ఈ బిట్స్‌ను యూట్యూబులో చూసే ప్రేక్షకులు ఎక్కువేమో… గతంలో మంచి పంచ్ ఉండేది… మిగతా ఈటీవీ షోల్లాగే ఇదీ డిగ్రేడ్ అయిపోయింది… గతంలో కేవలం ప్రదీప్, రష్మి, సుధీర్ మాత్రమే ఉన్నప్పుడు కూడా కామెడీ బిట్స్ భలే పేలేవి… తరువాత వాళ్లకు తోడుగా మరో ఫిమేల్, మేల్ పార్టనర్స్ వచ్చినా, అదే ప్రదీప్ ఉన్నా సరే… కామెడీలో పంచ్ లేకుండా పోయింది…
Ads
జడ్జిగా ఉన్న శేఖర్ మాస్టర్ కూడా ఈ కామెడీ ఎపిసోడ్లలో భలే ఇన్వాల్వ్ అయ్యేవాడు… ప్రియమణి, పూర్ణ కూడా అలవాటయ్యారు… కానీ ఏమైందో శేఖర్ మాస్టర్‌ను తరిమేశారు… మొన్నటి సీజన్‌తో పూర్ణను వెళ్లగొట్టేశారు… పూర్ణ ప్లేసులో నందితా శ్వేతను పట్టుకొచ్చారని మనం చెప్పుకున్నాం కదా… పెద్ద ఇంప్రెసివ్ ఏమీ కాదు… అలాగే సుధీర్ ప్లేసులో బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్‌ను తెచ్చారు… ప్చ్… అసలు సుధీర్‌ను రీప్లేస్ చేయడం అంత వీజీ కాదు… రీసెంటుగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్, టీవీ నటుడు రవిని తీసుకొచ్చారు… మరి ఓ ఫిమేల్ కమెడియనో, యాంకరో, మెంటారో, టీం లీడరో కావాలి కదా… ఆ రష్మి ప్లేసు ఖాళీ ఉందిగా… తాజాగా సుస్మిత అనాలా… ఈమెను తీసుకొచ్చారు… టిక్‌టాక్ స్టార్… ఆమె గురించి పూర్తిగా తెలియదు గానీ… ఒకటి నిజం… సుధీర్ ప్లేసులో అఖిల్, రష్మి ప్లేసులో సుస్మిత… కష్టం… ఆ కష్టంతో వచ్చే నష్టమెంతో రాబోయే వారాల్లోని రేటింగ్స్ చెబుతయ్… ఇప్పటికే కనిపిస్తున్నయ్… పర్లేదు లెండి… ఎవరో ఒకరు, ప్రయోగం చేద్దాం, తీసుకొద్దాం, క్లిక్ కాకపోతే వెళ్లగొట్టేద్దాం, మనకేం కొత్త కాదుగా అన్నట్టుంది ఢీ టీం ఆలోచన, ఆచరణ… భలే దొరికారు బాబూ…
Share this Article