.
నిజమే… నాగ చైతన్యకు ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఓ భారీ విజయం తండేల్ రూపంలో దక్కింది… అది సక్సెస్… కానీ అదే సినిమాకు సంబంధించి ఓ ఫెయిల్యూర్… అదేమిటంటే..?
83 కోట్ల దగ్గరే ఆగి కొట్టుకుంటోంది, ఇక మీటర్ తిరగడం లేదు వేగంగా… నిజానికి అది కూడా కాదు… ఆ 83 కోట్ల గ్రాస్‌లో దాదాపు మొత్తం తెలుగు వసూళ్లే… ఎస్… ఈరోజుకు తమిళంలో 52 లక్షలు, హిందీలో 54 లక్షలు మాత్రమే… పాన్ ఇండియా కోణంలో చూస్తే అట్టర్ ఫ్లాప్…
Ads
నిన్న ఈ రెండు భాషల్లో వసూళ్లు ఎంతో తెలుసా..? జస్ట్, లక్ష రూపాయల చొప్పున..! దేశానికి సుదీర్ఘ తీరప్రాంతం ఉంది, కోట్ల మంది మత్స్యకారులు ఉన్నారు… ఎప్పుడూ శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నేవీలకు దొరుకుతూనే ఉంటారు… జైలుపాలు అవుతూనే ఉంటారు… మరి ఈ తండేల్ ఎందుకు ఇతర భాషల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు..?
పైగా ప్రజెంట్ ట్రెండ్ దేశభక్తి కదా ఇండియన్ సినిమాలో… ఇందులో అదీ ఉంది… ఐనా ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కనెక్టయ్యారు… సాయిపల్లవి ఉందా, చైతూ బాగా నటించాడా వంటివేమీ అక్కర్లేదు… తెలుగేతర ప్రేక్షకులు దాన్ని అడ్డంగా తిరస్కరించారనేది వాస్తవం…
ఇదే కాదు… ఆహా ఓహో అని పాజిటివ్ రివ్యూలు వచ్చిన సినిమాలు కూడా తన్నేశాయి… ఉదాహరణకు బ్రహ్మానందం… ఇప్పటికి జస్ట్ 2 కోట్లు… లైలా డిజాస్టర్ తెలిసిందే… విష్వక్సేనుడే ఇకపై నా సినిమాల్లో బూతు ఉండదని ప్రకటించుకోవల్సి వచ్చింది… లెంపలేసుకున్నట్టుగా..!!
జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా వసూళ్లు మరీ కోటిన్నర మాత్రమే… అంతెందుకు, రోజూ యూట్యూబర్లు, సైట్లు తెగరాసేస్తున్నాయి కదా, డ్రాగన్ ఇరగదీస్తున్నదని… హహ… అదంతా తమిళ హవా… 50 కోట్ల టోటల్ కలెక్షన్లలో తెలుగు వాటా అయిదున్నర కోట్లు…
అజిత్ నటించిన విడాముయార్చి (తెలుగులో పట్టుదల) ఫ్లాప్… ఐనా 135 కోట్ల స్థూల వసూళ్లు… తమిళంలోనే దాని ఆ కాసింత హవా… తెలుగులో జస్ట్ రెండు కోట్లు… గేమ్ ఛేంజర్ కథ తెలిసిందే… సంక్రాంతికి వస్తున్నాం మాత్రం బ్లాక్ బస్టర్… 250 కోట్లతో రియల్ సక్సెస్… హిందీలో ఛావా 500 కోట్లు, బంపర్ హిట్… స్కై ఫోర్స్ కూడా… డాకూ మహరాజ్ హిట్…
అంతే ఇక… ఆశలు పెట్టుకున్న బోలెడు సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి… థియేటర్లకు జనాన్ని రప్పించలేకపోతున్నాయి… ఉల్టా పబ్లిసిటీ ఖర్చులు దండుగ… ఎస్, థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం పాజిటివ్ రివ్యూలు రాయించుకున్నంత వీజీ కాదు… ఈ మొత్తం కథనంలోని ఉదాహరణలు చెబుతున్నది అదే…
పైగా ఒక భాషలో ప్రేక్షకులకు నచ్చింది ఇతర భాషల్లో ప్రేక్షకులకు నచ్చాలని కూడా ఏమీ లేదు… ఉదాహరణకు స్మగ్లర్ గుట్కా పుష్పరాజ్ హిందీ జనానికి కనెక్టయ్యాడు… తెలుగు వదిలేస్తే ఇక వేరే ఏ భాషలోనూ సక్సెస్ కాదు, బయ్యర్ల నెత్తిన ఎర్ర తువ్వాళ్లు… అదీ సంగతి…
Share this Article