……. కొందరు మిత్రుల్ని అడిగితే… హిందుత్వ వేరు, హిందూ వేరు అని స్పష్టంగానే చెబుతున్నారు… నిజానికి వాళ్లంతా కేసీయార్ పాలన విధానాలను, వ్యక్తిగత వ్యవహార పోకడలను ద్వేషించేవాళ్లే… లెఫ్ట్, న్యూట్రల్, సెక్యులర్ భావాలున్నవాళ్లే… అదేమిటీ అనడిగితే… బీజేపీ ప్రవచించే హిందూత్వ వేరు… కేసీయార్ చెప్పుకునే నంబర్ వన్ హిందువును అనే తత్వం వేరు అంటూ విభజన రేఖ గీచి చూపించారు… మత దురభిమానం వేరు, స్వీయ మత అనుసరణ- పరమతసహనం వేరు… బీజేపీది మత దురభిమానం, కేసీయార్ది మతసహనం అనేది వాళ్ల అభిప్రాయం…
తన మతాన్ని తను అనుసరిస్తూ, ఇతర మతాల్ని కూడా సహించడానికీ…. కేవలం తమ మతం పట్ల దురభిమానంతో ఉండటానికి తేడా ఉంది అంటారు వాళ్లు… కేసీయార్‌కు ఇది గ్రేటర్ ఎన్నికల్లో బాగానే ఉపయోగపడబోతోందా..? ఇదీ ఇప్పుడు ఓ కీలకమైన చర్చ… ఉపయోగపడితే ఎంతమేరకు..?
Ads
నిజానికి కేసీయార్ పాలన తీరుపై జనంలో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది… అది టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆఫ్‌ది రికార్డుగా అంగీకరిస్తున్నదే… దుబ్బాకలో దెబ్బ తీసిందీ అదే… ఈరోజుకూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ వంటి జనం వ్యతిరేకించే పథకాలపై కిమ్మనడం లేదు… విశ్వనగరం దిశలో ఏం చేశామో సరిగ్గా చెప్పుకునే పరిస్థితి లేదు… పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జనంలో తిరిగి నాలుగు వోట్లు అడిగే సీన్ లేదు… నాలుగు రోజుల క్రితం వరకూ బీజేపీ హైప్ నగరంలో విపరీతంగా కనిపించింది… కానీ..?
బీజేపీకి గనుక ఒకసారి చాన్సిస్తే నగరం మళ్లీ నాటి కర్ఫ్యూల రోజుల్లోకి పోవాల్సిందేనా..? భూముల ధరలు, వ్యాపారాలు, ఉపాధి, ప్రశాంతత పోయినట్టే అంటూ కేసీయార్, కేటీయార్ చేసే ప్రచారం కాస్త న్యూట్రల్ వోటరును ఆలోచనలో పడేసిందేమో అన్నట్టుగా ఉంది… నిజానికి బీజేపీ నగరంలో పట్టు సాధిస్తే మతకల్లోలాలు చెలరేగుతాయనేది అబద్ధం… ఇవి ఆ పాత రోజులు కావు… మజ్లిస్ చెప్పినట్టు కేసీయార్ ఆడుతున్నాడనే భావన ప్రజల్లో ఉందనేది కూడా నిజమే… కానీ..?
కేసీయార్ అధికారంలో ఉన్నాడు కాబట్టే ఈ ఆరేడేళ్లుగా నగరంలో ఏ అల్లరీ లేదు… మత సంబంధ ఉద్రిక్తత లేదు… పెట్టుబడులకు అనువైన వాతావరణం నెలకొంది… టీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీయే అంతిమ ప్రబలశత్రువు అని భావించే లెఫ్ట్, న్యూట్రల్, ఇంటలెక్చువల్స్… అనివార్యంగా, ఎవరూ అడగకుండానే తమంతటతాము టీఆర్ఎస్నే గెలిపించడం బెటర్ అనే భావనలోకి వస్తుండటం విశేషమే… అది కేసీయార్‌కు అనుకోని మద్దతు… అడగకుండానే లభిస్తున్న మద్దతు…
గ్రేటర్ ఎన్నికల రంగంలో లెఫ్ట్, కాంగ్రెస్ తదితర పార్టీలు ఉన్నా సరే… టీఆర్ఎస్ బలంగా ఉంటేనే బీజేపీకి కౌంటర్ అనే భావన పెరగడం కొంత గమనంలోకి వస్తోంది… మజ్లిస్ వద్దు, బీజేపీ వద్దు… ఉన్నంతలో కేసీయారే బెటర్ అనే భావన పోలింగు టైముకు ఇంకా బలపడితే అది కేసీయార్‌కు కొంత ఫ్లెచింగ్ అవుతుంది… అయితే ఆల్రెడీ వోటరు ఫిక్సయిపోయాడు, ఇక మారకపోవచ్చు అనే వాదనే నిజమైతే కేసీయార్‌కు కొంత నష్టం తప్పకపోవచ్చు… కానీ మరీ అది బీజేపీ కేసీయార్ మీద పైచేయి సాధించిందీ అనేంత అధికంగా ఉంటుందా..? తనను నేలమీదకు దింపుతుందా..? ఇదీ పెద్ద ప్రశ్న…!!
Share this Article