కొన్ని వార్తలు చూడగానే నవ్వు పుట్టిస్తయ్… నిజానికి సీరియస్ విషయాలే… కానీ ఓ ప్రిజుడిస్ మైండ్ సెట్‌తో, ఓ అకారణ ద్వేషంతో వార్త విలువను తీసేస్తారు… ఇదీ అలాంటిదే… మోడీ చేసే ప్రతి పనీ సరైనది కాకపోవచ్చు… అది నిజం… కానీ అలాగని మోడీ చేసే ప్రతి పనీ తప్పే అనే మైండ్ సెట్ ఏమాత్రం సరైనది కాదు… (తేడా అర్థమైంది కదా…) ఇదొక యాంటీ-మోడీ సిండ్రోమ్ అనాలా… మోడీ పేరు తలుచుకోగానే నెగెటివ్ వైబ్రేషన్స్ వచ్చేసి, ఆలోచనలు గతులు తప్పుతాయి దేనికి..? రాహుల్, మమతలు కాదు, ప్రధానంగా ఈ అనారోగ్యం లెఫ్ట్ పార్టీల్లో ఎక్కువ… అది వాటి మీడియా సంస్థల వార్తల్లోనూ కనిపిస్తూ ఉంటుంది… ఈ వార్త చూడండి… ప్రజాశక్తి నిన్నటి బ్యానర్ స్టోరీ… ఇది రైతులకు సంబంధించింది, కాదు, కాదు, మన విద్యుత్తు రంగానికి సంబంధించింది… కానేకాదు, మన పర్యావరణానికి సంబంధించింది… ఈ స్టోరీ ఏమంటున్నదంటే..?
పీఎం-కుసుం స్కీమ్ పేరిట మోడీ బాగా ఒత్తిడి తీసుకొస్తున్నాడు… సోలార్ పవర్‌ను ఇంకా ఇంకా డెవలప్ చేయాలట… ఈ ప్లాంట్ల ఏర్పాటులో 30 శాతం రాయితీ ఇస్తాడట, 30 శాతం రాష్ట్రాలు ఇవ్వాలట, 40 శాతం ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టాలట… రైతులు తమ భూముల్ని పాతికేళ్లపాటు అద్దెకు ఇవ్వాలట… రైతుల పచ్చని పంటపొలాలను కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సాగుతున్న కుట్ర ఇది… భూసేకరణ చట్టం స్పిరిట్‌కు పాతరేసి, అద్దె పేరిట నడుస్తున్న బాగోతం… భారీ లాభాలేమో కంపెనీలకు, శూన్యహస్తాలేమో రైతులకు…….. ఇలా సాగింది వార్త… నిజానికి దేశానికి చౌక, స్వచ్ఛమైన పవర్ కావాలి… (చీప్, క్లీన్)… అది సోలార్, విండ్ ఎనర్జీతో సాధ్యం… ప్రపంచమంతా ఈ పవర్ మీదే దృష్టి పెడుతోంది… ఈ పత్రిక ఆరాధించే చైనాతో సహా…! సోలార్ పవర్ కావాలంటే భూమి కావాలి, అంత భారీగా భూమి కొని పెట్టుబడి పెట్టాలంటే సాధ్యం కాదు, సో, రైతుల భూముల్ని అద్దెకు తీసుకుని, సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేయండి అంటోంది కేంద్రం… రాయితీ ఇస్తానంటోంది…
Ads
ఇదేమీ ప్రభుత్వం భూమిని సేకరించి ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్న ఎస్ఈజెడ్ బాపతు బాగోతం కాదు… మరి భూసేకరణ చట్టం ఎందుకు వర్తిస్తుంది..? 25 ఏళ్ల కాలపరిమితితో రైతులకూ, కంపెనీలకూ నడుమ ఒప్పందాలు కుదురుతాయి… ఎకరానికి ఏటా లక్ష రూపాయల అద్దె అంటే మామూలు విషయమేమీ కాదు కదా… సపోజ్, ఒక రైతు అయిదు ఎకరాలు ఇస్తే ఏటా అయిదు లక్షలు ఇస్తారు… ఇప్పుడున్న వ్యవసాయ స్థితిలో ఈ నికరాదాయం ఎక్కువే… కాలుష్యాన్ని నింపే బయోమాస్, థర్మల్ విద్యుత్తు తగ్గాలి, పర్యావరణం మెరుగుపడాలి, చీప్ పవర్ కావాలి… మరి ఈ సోలార్ ప్లాంట్లు కావాల్సిందే కదా… ఇలా ఉత్పత్తయ్యే విద్యుత్తును ఓపెన్ మార్కెట్‌కు వదిలేయకుండా, ప్రభుత్వరంగం నిర్ణీతశాతం కొనాల్సిందే అని కేంద్రం ఆంక్షలు పెడుతోంది… అదుగో అదీ వివాదాలకు దారితీస్తున్న అంశం… జగన్ వ్యతిరేకించింది కూడా ప్రధానంగా అదే… సో, ఏది అసలు సమస్యో దాన్ని వదిలేసి, మోడీ ద్రోహం చేసేస్తున్నాడహో అని గొంతెత్తితే ఫలితం ఏమిటి..? దానికి విలువ ఏమిటి..? పైన క్లిప్పింగు చదవండి, అది ఈనాడు వార్త… ఇంకా ఇంకా ఇలాంటి ప్లాంట్లు పెరిగితే మేం మునిగిపోతాం బాబోయ్ అని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి… వాటికి కారణాలూ రాసుకొచ్చింది ఈనాడు… యాంటీ-మోడీ సిండ్రోమ్‌కు వేక్సిన్లు, రెమ్‌డెసివర్లు ఉండవ్ సార్… కనిపించని ద్వేష మాస్కులు కూడా విప్పేసి, ప్రిజుడీస్ ఫీలింగ్స్ వదిలేయడమే నివారణ ప్లస్ చికిత్స్…!!
Share this Article