ఒకటి గుర్తుందా..? చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్ దంపతులను కలిశాడు… జగన్ సాదరంగా ఆహ్వానించి, చిరంజీవి చెప్పిన టికెట్ రేట్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటాను అన్నాడు… తమ్ముడు పవన్ కల్యాణ్ మీద జగన్‌కు ఎంత కోపం ఉన్నా సరే, అన్న చిరంజీవి పట్ల సుహృద్భావంతోనే వ్యవహరించాడు… ఒక దశలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను చీల్చడానికి చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేస్తాడనీ ఊహాగానాలు వినవచ్చాయి…
తరువాత చిరంజీవి ఏం చేశాడు..? ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు, నాగార్జున తదితరులతో కలిసి వెళ్లాడు… అక్కడ చిరంజీవి దాదాపు సాగిలబడ్డట్టుగా మాట్లాడాడు… జగన్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు… ప్రభాస్, మహేష్ బాబు తదితరులు హుందాగానే కూర్చున్నారు… సో, ఈ ప్రాధేయపడే సీన్ చిరంజీవి ఫ్యాన్స్‌కే నచ్చలేదు… బాలయ్య, పవన్ కల్యాణ్ వంటి హీరోలు ఇండస్ట్రీని కాళ్లబేరానికి రప్పించుకోవాలనుకునే జగన్ వ్యూహానికి తలొగ్గలేదు… టికెట్ పైరవీలు కూడా చేయలేదు… కానీ చిరంజీవి ఎందుకంతగా వంగిపోయాడు..? ఈ విమర్శ బలంగానే వచ్చింది…
ఇక్కడ సీన్ కట్ చేస్తే… నా తమ్ముడు గొప్పోడు, ఎప్పటికైనా మంచి, ముఖ్య పొజిషన్‌లో చూస్తాను, జనసేనకు నా వంతు సలహాలిస్తాను అన్నట్టుగా ఏదేదో మాట్లాడాడు… అంటే అర్థమేమిటి..? తమ్ముడు తమ్ముడే… నెత్తుటి బంధం… రేప్పొద్దున జనసేనకు అవసరమైన సహకారం ఇవ్వడానికి రెడీ అంటున్నాడు… తను మాత్రం ఏవో సినిమాలు చేసుకుంటూ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చే సూచనలు లేనట్టుగా కనిపిస్తున్నాడు… కానీ ఇప్పుడు రీఎంట్రీకి టైమ్ వచ్చేసినట్టుంది…
Ads
మరోసారి సీన్ కట్ చేయండి… వాల్తేరు వీరయ్య ఎక్కడో 200 దినాలు ఆడిందట… ఆ ఫంక్షన్ ఒకటి జరిపారు… అంతకుముందు భోళాశంకర్ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో హైపర్ ఆదితో మాట్లాడింపచేశాడు… అందులో పవన్, చిరంజీవి వ్యతిరేకులందరినీ ఆది కడిగేశాడు… ఇక వీరయ్య ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ జగన్‌పై దాదాపు నేరుగానే విమర్శలకు దిగాడు…
పేరు పెట్టకపోయినా సరే… ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు.అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’’ అన్నాడు… డౌటేముంది..? అవన్నీ జగన్‌ను ఉద్దేశించే..! ఇందులో అర్థం కానిది ఏమిటంటే…? టికెట్ల యవ్వారం ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం కదా… మరి జగన్ తాజాగా ఇండస్ట్రీ మీద పడిందేముంది..? వేల కోట్ల cinema ఇండస్ట్రీ పిచ్చుక అట… అదొక మురికి కూపం…
పైగా తన సినిమాలకు ప్రత్యేక షోలు, టికెట్ రేట్ల పెంపు వంటివి చిరంజీవి సాధిస్తూనే ఉన్నాడు కదా… మరిక జగన్ తనకు చేయనిదేముంది..? అంటే జగన్ మీద రాజకీయ దాడి ప్రారంభించాడని అర్థం… రాబోయే రోజుల్లో జగన్ వ్యతిరేక శిబిరంలో చిరంజీవి యాక్టివ్ రోల్ ప్లే చేయబోతున్నాడు అని అర్థం… ఏదో పవన్ కల్యాణ్ తాజా సినిమాలో మంత్రి అంబటి రాంబాబును వెక్కిరిస్తూ పృథ్వితో ఒకటీరెండు సీన్లు చేయించారు… దానిపై రాంబాబు తీవ్రంగా ప్రతిస్పందించాడు… మీ remunarations కథ తేలుస్తా అంటున్నాడు… దీనితో వైసీపీ, జనసేన నడుమ నిప్పు మరింత మండింది…
ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యం ఉంది… ఇన్నేళ్లుగా రాజకీయాల ఊసెత్తలేదు… తనకు రాజకీయాలు పనికిరావనే భావనతో చిరంజీవి ఉన్నాడు… చిరంజీవి మా పార్టీలోనే ఉన్నాడు అని కాంగ్రెస్ పిచ్చి స్టేట్‌మెంట్లు ఇచ్చుకున్నా సరే చిరంజీవి మాత్రం మాట్లాడలేదు… ఉన్నాను అనలేదు, లేను అనలేదు… ఏవో నాలుగు స్టెప్పులు, నాలుగు ఫైట్ల జీవితంలోనే గడిపాడు… కానీ మునుపటి ఆదరణ తనకు లభించడం లేదు… అందుకే మళ్లీ రాజకీయాలపైకి మనసు మళ్లిందా..? తెలియదు…
డిమాండ్ ఉన్నవారికి రెమ్యునరేషన్ ఎక్కువే ఇస్తారని ప్రస్తావించడం అంటే… తన తమ్ముడి రెమ్యునరేషన్ మీద అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలకు కౌంటరా..? ఆమధ్య ఒకసారి నాదెండ్ల మనోహర్ ఎక్కడో మాట్లాడుతూ… ‘‘ఎన్నికల నాటికి చిరంజీవి జనసేనకు మద్దతుగా వస్తారు’’ అన్నాడు… ఆ టైమ్ వచ్చేసినట్టేనా..? చిరంజీవి ఇదైనా నేరుగా చెప్పడు… ఏదో లోతైన భావం ఉన్నట్టు నంగిగా సగం సగం మాట్లాడతాడు… పొలిటికల్ తెర మీదకు నేరుగా రాడు … పవన్ అనగానే పెళ్లిళ్ల విమర్శ చేస్తున్న జగన్ ఇప్పుడిక చిరంజీవి మీద ఎలాంటి విమర్శలు చేస్తాడో చూడాలి…
Share this Article