అసలు పార్లమెంటులో చర్చలు జరుగుతున్నాయా..? మొన్నీమధ్య సుప్రీం చీఫ్ బాధిపడిపోయాడు… తప్పులేదు, కానీ అది పార్లమెంటు, నిజానికి అదే సుప్రీం… ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల వేదిక… ఈ దేశానికి అల్టిమేట్ అధికార కేంద్రం… సరే, దాన్నలా వదిలేద్దాం… కానీ సీజే అర్జెంటుగా దృష్టి సారించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్… అసలు అదే తన ప్రధాన బాధ్యత ఇప్పుడు… లక్షల కేసుల పరిష్కారం, వరుస వాయిదాలు, జాప్యంతో పాటు అసలు బెయిళ్లు అనే అంశం మీద తను దృష్టి సారించాలి, అప్పుడే తనకు పేరు, ప్రతిష్ట… ఒక ఆంధ్రుడు ఈ దేశ న్యాయవ్యవస్థ చరిత్ర మీద తనదైన ముద్ర వేయాలంటే… చిన్నాచితకా అంశాలు కాదు, ఇదుగో ఓ అపెక్స్ బాడీగా… దిగువ కోర్టులకు సరైన దిశలో డైరెక్షన్స్ ఇవ్వడం… ప్రత్యేకించి బెయిళ్లు, చట్టాల స్పిరిట్ విషయంలో… ఇదెందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే… ఈమధ్య రకరకాల కేసుల్లో వింత బాష్యాలు చూస్తున్నాం కాబట్టి…
అసలు అమ్మాయి అంగాలకు చేతిలో స్పర్శ లేనిదే లైంగికదాడి అని ఎలా చెప్పగలం అని ఆమధ్య ఓ మహిళా జడ్జి కొత్త బాష్యం చెప్పింది… ఇప్పుడు సుప్రీంలో ఆ కేసు విచారణలో ఉంది… బెయిళ్లకు సంబంధించి ఇలాంటి బోలెడు ఉదాహరణలు రీసెంటుగానే బోలెడు… నిజానికి ఇప్పుడు సుప్రీం సీరియస్‌గా లుక్కేయాల్సింది ఇవే… 1) చిన్నాచితకా కేసులకు సంబంధించి జైళ్లలో లక్షల మంది నిర్బంధించబడే ఉండాలా..? 2) చిన్న చిన్న కేసుల్లో ఫలానా గడువులోపు విచారణ పూర్తికాకపోతే డిఫాల్టుగా బెయిల్ ఇవ్వాలని ఎందుకు నిర్దేశించకూడదు..? 3) అసలు రెండేళ్లు, మూడేళ్ల జైలుశిక్షకు పరిమితమైన కేసులకు సంబంధించి విచారణకు గడువు ఎందుకు ఖరారు చేయకూడదు..? అసలు శిక్షే పడే స్థితి లేకపోతే, ముద్దాయి జైలులో గడిపిన కాలానికి, సామాజికంగా కోల్పోయిన గౌరవప్రదమైన జీవితానికి పరిహారం ఏమిటి..? 4) తప్పుడు కేసులతో జైళ్లపాలు చేసే ప్రాసిక్యూషన్ అధికారులకు శిక్షల మాటేమిటి..? ఇవి కదా సీరియస్ ఇష్యూస్… ఇవే కాదు.., ఓ ఉదాహరణ చూడండి…
Ads
గౌహతిలో ఓ కోర్టు ఒక విద్యార్థికి బెయిల్ ఇచ్చేసింది… తోటి విద్యార్థినిపై లైంగిక వేధింపులు అనేది కేసు…. ఇక్కడ కేసు మెరిట్, డీమెరిట్స్ కాదు ఇష్యూ… బాధితురాలు, నిందితుడు టాలెంటెడ్, మనకు అసెట్స్ అని ఓ కారణం చెప్పింది… అసలు నిందితుడి మెరిట్, నిందితుడి చదువు బెయిల్ విషయంలో ఎలా ప్రాతిపదికలు అవుతాయి..? తన నేరం, దాని తీవ్రతే కదా పరిగణనలోకి తీసుకోవాల్సింది… రేప్పొద్దున అదే నిందితుడు బయటికొస్తే, మరో నేరం జరిగితే బాధ్యులు ఎవరు..? చదువు వేరు, క్రిమినల్ నేచర్ వేరు… ఈమాత్రం ఆ కోర్టు ఆలోచించలేకపోయిందా..? మన దురదృష్టం ఏమిటంటే..? మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈ డిబేట్ పట్టదు, అసలు వార్త కూడా పట్టదు… అసలు వార్త ప్రాధాన్యం అర్థం కాని అజ్ఞానం ఒక అంశమైతే… అది సబ్ జ్యుడిస్ అవుతుందేమో అనే భయం మరో అంశం… ఈ వృత్తిలో ఉన్నవాళ్లు కూడా పట్టించుకోరు… డిబేట్‌కు పెట్టరు… ఒక్కోసారి అనిపిస్తుంది, ముందుగా ఈ దేశానికి అవసరమైంది చట్ట, న్యాయసంస్కరణలు… అదొక అసాధ్య సాకారమైన స్వప్నం అంటారా..? అవున్నిజమే…!! అవునూ, రేప్పొద్దున ఎవడో ఎవరినో రేప్ చేస్తాడు, వాడు టాలెంటెడ్, వాడు మెరిటోరియస్, వాడు జాతికి అసెట్… క్షమించేద్దామా..?! బెయిల్ మీద మళ్లీ సమాజంలోకి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేద్దామా…!!
Share this Article