ముందుగా ఒక వార్త చదవండి… సంక్షిప్తంగానే… పొద్దుటరు, గీతాశ్రమం వీథికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంత్ రెడ్డి, అలియాస్ టోని… బీటెక్ ఫస్టియరే డ్రాపవుట్… చిన్న వయస్సు నుంచే చైన్ చోరీలు మరిగాడు… ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలు చేసేవాడు… పొద్దుటూరు టూటౌన్, త్రిటౌన్, చాపాడు ఠాణాల పరిధుల్లో పలు కేసులు… జైలుకు కూడా వెళ్లొచ్చాడు… రౌడీ షీట్ కూడా ఓ ఠాణాలో నమోదై ఉంది… 23 ఏళ్లు కూడా నిండలేదు ఇంకా… ఫేస్‌బుక్, ఇన్‌స్టా, షేర్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు విరివిగా యూజ్ చేస్తాడు… అమ్మాయిల్ని, ఆంటీల్ని మాయమాటలతో, చాట్లతో బురిడీ కొట్టిస్తాడు, వాళ్లు నగ్నచిత్రాలను తెప్పించుకుంటాడు… ఇక బ్లాక్ మెయిల్ చేసేవాడు, డబ్బు గుంజేవాడు, కొందరిని అనుభవించాడు, నగలు తెప్పించుకునేవాడు… గూగుల్, ఫోన్‌పే ద్వారా వాళ్లు అతనికి డబ్బు పంపించేవాళ్లు… ఆల్‌రెడీ తన బాధితుడిగా మారి, ఎంతకీ డబ్బు పంపించని ఒకరి ఇంటికి రాత్రిపూట చోరీకి వెళ్లాడు… అనుకోకుండా పోలీసులకు చిక్కాడు… కోటింగ్ ఇవ్వడంతో ఇదుగో 200 నుంచి 250 మంది యువతులు, ఆంటీల నంబర్లు కథాకమామిషు బయటపడ్డాయి… పోలీసుల కళ్లు తిరిగిపోయాయి… ఇంతా చేస్తే వాడి దగ్గర 1.26 లక్షల నగదు, 3 తులాల బంగారం మాత్రమే పోలీసులు రికవరీ చూపించారు.. (?)… ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు… ఇదీ ప్రసన్న కథ…
ఇప్పుడు అసలు విషయంలోకి, నిజాల్లోకి వెళ్దాం…
Ads
- ఇది కేవలం ఒక ప్రసన్న స్టోరీ… ఇలాంటివాళ్లు బోలెడు మంది ఉన్నారు… కొన్ని వేల మంది మహిళలు ఆ వలల్లో పడుతూనే ఉన్నారు…
- ఇలాంటి ప్రసన్నలు సమాజంలో బోలెడు మంది… అతను మొదటి వాడూ కాదు… చివరి వాడూ కాదు… కానీ అసలు తప్పు ఎవరిది..? ఎవడు పడితే వాడు ఏదో ఫేక్ ఖాతాతో ఫేస్‌బుక్ చాటింగులోకి రాగానే ఏకంగా అసభ్య ఫోటోల్ని షేర్ చేసుకోవడమేనా..? ఎంత సిగ్గుచేటు..? బెదిరించగానే, చెప్పిన చోటకు వెళ్లి ఒళ్లప్పగించడమేనా..? నగలు, డబ్బు ఇవ్వడమేనా..?
- నిజంగా ఆ మహిళలు బాధితులా..? దోషులా..? నిజాయితీగా ఆత్మచింతన చేసుకుంటే తేలేది ఏమిటి..,? ప్రసన్నలు ఉంటారు… దొంగలు, మోసగాళ్లు లేని సమాజం ఎక్కడుంది..? కానీ ఈ కథలో ఎవరు నిజంగా తలదించుకోవాల్సింది..?
- ఫేస్‌బుక్ వంటి సామాజిక వేదికలు నిజంగా ఎవరికి ఉపయోగపడుతున్నయ్..? ఇవి డేటింగ్ యాప్స్‌కన్నా దరిద్రంగా మారిపోతున్నయ్… ఒక రౌడీ షీటర్, ఓ నేరగాడు ఫేక్ ఖాతాలతో కథలు నడిపిస్తూ ఉంటే ఫేస్‌బుక్ ఏం చేస్తుంది..? ఖచ్చితంగా ఆధార్ లేదా ఇతర ఐడెంటీటీలు లేకుండా ఖాతా ఎందుకు ఇవ్వాలి..? అసలు ఒక రౌడీషీటర్ కదలికలపై పోలీసులపై నిఘా ఏమైంది..?
- దిక్కుమాలిన చెత్తా వార్తలతో రోజంతా ఊదరగొట్టే మీడియా… ఇదుగో, ఇలాంటి వార్తలపై సొసైటీని అలర్ట్ చేసే డిబేట్లకు ఎందుకు పూనుకోదు..? అసలు ఈ వార్తను రాసినవాడెవ్వడు..? సరిగ్గా ప్రజెంట్ చేసినవాడెవ్వడు..? ప్రయారిటీ ఇచ్చినవాడెవ్వడు..? ఒక్క తెలుగు పత్రికయినా…!!!
- ప్రత్యేకించి ఫేస్‌బుక్ ఖాతాల్లో 60, 70 శాతం ఫేక్… ఫేక్ వార్తల వ్యాప్తికి, వ్యక్తిపూజకు, పార్టీల ప్రచారాలకు, విద్వేషభావనలకు… వాటితోపాటు ఇదుగో, ఇలాంటి పైత్యాలకు ఆలవాలం అయిపోయింది… ఎందరు హెచ్చరించినా వలల్లో పడేవారు పడుతూనే ఉన్నారు… మరీ ఆన్‌లైన్ చదువులతో మరీ పిల్లల చేతులకు స్మార్ట్ ఫోన్లు వచ్చి, చీపుగా జియో సిమ్ కార్డులు వచ్చి… తెలిసీతెలియని చిన్న వయస్సుల్లో ఆకర్షణలకు లోనై ఇలా చిక్కిపోతున్నారు… మరీ ఏడెనిమిది తరగతుల పిల్లలకు లోకం ఏం తెలుసు..? దీనికి ఏమిటి పరిష్కారం…? సమాజాన్ని ప్రసన్న అడుగుతున్న ప్రశ్న అదే… వీడు మన సొసైటీకి ఒక డయాగ్నోసిస్… నో డౌట్, తనపై కేసేమీ రుజువు కాదు, బయటికొస్తాడు, మరో పేరు, చాటింగులు, అమ్మాయిలు, ఆంటీలు… ఈ కథ అనంతం…!!
Share this Article