తలుచుకుంటే ఆడది ఇంటి గడపకు కూడా తెలియకుండా వ్యభిచరించగలదు…. అని ఓ వెగటు, చిల్లర నానుడి తరచూ వినబడేది… నిజానికి అక్రమ సంబంధాలు అనేది పెద్ద సబ్జెక్టు… అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి, ఉన్నాయి… వయస్సు, అవకాశం, ఆకర్షణ, ఆవేశం, అవసరం వంటివి ఎన్నో చర్చకు వస్తాయి ఆ చర్చలోకి వెళ్తే…
కాకపోతే గతం వేరు… అవకాశం ఉన్నంతవరకే అక్రమ బంధాలు… ఇప్పుడు కొన్నాళ్లుగా నేరరికార్డులు చూస్తే విస్మయం… అక్రమ బంధాల సుడిలో పడి, ప్రియుళ్లతో కలిసి భర్తలను హతమారుస్తున్నారు… అడ్డుగా ఉన్నారని పిల్లలను కొట్టి చంపుతున్నారు… కుటుంబసభ్యులను పొట్టన పెట్టుకుంటున్నారు… దేనికైనా తెగిస్తున్నారు, దిగజారుతున్నారు… ఆమధ్య ఓ కేసు చూశాం కదా, ఏకంగా మొగుడిని చంపి, వాడి మొహాన్ని మొగుడికి వచ్చేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించబోయి దొరికిపోయింది ఒకామె… ఇవన్నీ చర్చిస్తే ఒడవవు, తెగవు…
ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఓ స్టన్నింగ్ ప్రశ్న… వెరీ స్టన్నింగ్ ఫెమినిస్టిక్ సలహా… షాకింగ్… అసలు ఫెమినిజం అంటే ఇదా అనే హాశ్చర్యం… ఇవన్నీ చదువుతుంటే అసలు మగాడు పెళ్లెందుకు చేసుకోవాలి అనే ఓ బేసిక్ ప్రశ్న వికటరూపం ధరించి నవ్వుతుంది… కోరా సైటులో ఒకామె ప్రశ్న ఏమిటంటే…
Ads
నేను గర్భవతిని… కానీ నా భర్తకు అతను ఆ గర్భానికి కారణం కాదని, అతను తండ్రి కాదని తెలియదు, నేనేం చేయాలి..?
… ఇదీ ప్రశ్న… దీనికి చాలామంది చాలా జవాబులు ఇచ్చారు, కానీ వీణా వినోద్ అనే స్త్రీవాది జవాబు మాత్రం షాకింగ్… తన ప్రొఫైల్‌లోనే ఇండియన్ ఫెమినిస్ట్ అని రాసుకుంది… అఫ్ కోర్స్, వివాదం చెలరేగాక తన ప్రొఫైల్ పిక్, పేరు కాస్త మార్చుకుంది… ఇంతకీ ఆమె జవాబు ఏమిటో తెలుసా..?
‘‘కొంతమంది అనుకుంటున్నట్టు ఇందులో తప్పు ఏమీ లేదు… ఇది మీ దేహం… మీ దేహాన్ని తాకడానికి ఎవరిని అనుమతించాలి అనేది పూర్తిగా మీ ఇష్టం… అతను మీ భర్త కదా, అందుకని ఒకవేళ మీ గర్భానికీ తనకు ఏ సంబంధం లేదని తెలిసినా సరే, మీకు పుట్టబోయే బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తనదే అవుతుంది… మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించలేరు… అలాగే మీకు చట్టం పూర్తి మద్దతుగా ఉంటుంది…
కాకపోతే మీరు కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలి… మీ భర్తపై ముందుగానే కొన్ని తప్పుడు కేసుల్ని ప్రిపేర్ చేసుకొండి, ఒకవేళ తను గనుక చట్టబద్ధంగా మీపై పోరాటానికి సిద్ధపడితే వీటితో మీరు ఎదురుదాడికి దిగొచ్చు… అఫ్ కోర్స్, తనను అడ్డుకోవడానికి చాలా మార్గాలున్నాయి… ఎవరైనా మంచి మహిళా న్యాయవాదిని సంప్రదించండి, ఆమె ఫెమినిస్టు అయితే బెటర్, ముందుగా అది కన్‌ఫమ్ చేసుకొండి. ఫెమినిస్ట్ అయితే మనస్పూర్తిగా సహకరిస్తుంది… అతను అతి తెలివి చూపిస్తే మీరు విడాకుల కోసం వెళ్లి మంచి భరణం, మెయింటెనెన్స్ ఖర్చులు క్లెయిమ్ చేసుకొండి, తన ఆర్థిక స్థోమత ఎలాగూ క్షీణిస్తుంది, మళ్లీ పెళ్లి చేసుకోలేడు, మీరు మాత్రం మీ బిడ్డతో, మీ ప్రియుడితో ఎంజాయ్ చేయవచ్చు, పోనీ, మీ బిడ్డతో సుఖంగా బతకొచ్చు…’’
ఇది ఫెమినిజమా..? కొన్ని సైట్లలో సదరు స్త్రీవాదిని ఏకిపారేస్తూ కథనాలు రావడంతో ఈ జవాబు డిలిట్ కొట్టేసి, ప్రొఫైల్ మార్చుకుంది ఆమె… కానీ ఇదుగో ఇలాంటివే అక్రమ బంధాల్ని, అనైతికతకు పాలుపోస్తున్నాయి… అసలే కళ్లమూసుకుపోయిన కామం మరింతగా తమ నేర కోరలకు పదును పెట్టుకుంటుంది..!!
Share this Article