Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీనేజ్ లవ్… కాదు, టెర్రిఫిక్ లవ్… హారిఫిక్ లవ్… పరపరా కోసేసే లవ్…

March 10, 2023 by M S R

Gift De(a)ed:
స్టాచ్యుటరి వార్నింగ్:- గుండె బలహీనంగా ఉన్నవారు, అతి సున్నిత మనస్కులు దీన్ని చదవకండి.

అబ్బాయి:- వస్తావా? నిన్నేడిపించినవాడి గుండె కోసి కొమ్మకు వేలాడేశా. నీకు లవ్ లెటర్ రాసిన వాడి వేళ్లు కత్తిరించి వాడి జేబులోనే పెట్టా.

అమ్మాయి:- అబ్బ! ఎంత చల్లని వార్త చెప్పావ్! వస్తున్నా కానీ… అంతదాకా ఆగలేను వాడి గుండె, వేళ్ల ఫోటోలు అర్జంటుగా వాట్సాప్పులో పెట్టవా?

Ads

అబ్బాయి:- ఇదుగో… చూసుకో. ఇంకేం ఫికర్ కాకు.

అమ్మాయి:- ఓ మై గాడ్! ఇట్స్ రియల్ . యు ఆర్ గ్రేట్. ఇదో నీకు రిటర్న్ గిఫ్ట్ గా గూగుల్ పే లో పదిహేను వందల రూపాయలు పంపుతున్నా. పండగ చేసుకో.

అబ్బాయి:- అంత పెద్ద అమౌంటా? థాంక్ యు. థాంక్ యు. లొకేషన్ పెట్టాను. వచ్చి చచ్చినవాడిని చూసి వెళ్లు.

అమ్మాయి:- పది నిముషాల్లో వస్తున్నా. ఈలోపు ఒక శాండ్ విచ్, ఒక థమ్స్ అప్ తీసుకుని రా. ఆకలిగా ఉంది.

అబ్బాయి:- ఓకె…ఓకే.

అబ్బాయి స్వగతంలో:- హమ్మయ్య. ఈ హత్యతో నా ప్రేమను గెలిపించుకున్నాను. ఇక నా ప్రేయసికి ఏ అడ్డూ లేదు. ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది. నా ప్రేమ హత్యను ప్రోత్సహించింది. నేరం నాది కాదు- ప్రేమది. ప్రేమకు సంకెళ్లు వేస్తారా? ప్రేమను జైల్లో పెడతారా? ప్రేమను హత్య చేస్తారా?

అమ్మాయి స్వగతంలో:- నా లవర్ ఎంత గొప్పవాడో! నా గుండెకు అడ్డొచ్చిన గుండెను ఎన్ని గుండెలు నీకు? అని కోసి అవతల పారేశాడు. ఇక మా ప్రేమ రెక్కలు విప్పి స్వేచ్ఛగా వినువీధుల్లో విహంగమై తిరుగుతూ ఉంటుంది.

పోలీసులు స్వగతంలో:- లవర్ హత్య చేస్తే అభినందనపూర్వక గిఫ్ట్ గా 1,500/- ఆన్ లైన్లో పంపే రోజులు వచ్చాయా? అంటే వెయ్యికి, పదిహేను వందలకు ఒక హత్యా? ఈ లెక్కన ప్రేమకు అడ్డొచ్చే గుండెలన్నీ ఇలాగే కోతకు గురవుతాయా? హతవిధీ!

ప్రపంచం స్వగతంలో:- ఏమిటిది? ఎక్కడున్నాం మనం? ప్రేమిస్తే చావు. ప్రేమించకపోతే చావు. ఎలాగయినా చావేనా? చచ్చే చావొచ్చిందే!

ప్రేమ స్వగతంలో:- ప్రేమను అంగీకరించడానికి, నిరాకరించడానికి ఏ మనసుకయినా హక్కు ఉంటుంది కదా? అవునంటే అవును. కాదంటే కాదని వదిలేయాలి. చంపేది ప్రేమ ఎలా అవుతుంది? చస్తే ప్రేమ ఏమి మిగులుతుంది?

ఇవేమి చదువులు?
ఇవేమి సంస్కారాలు?

దీన్ని ప్రేమంటారా?

గమనిక:-
ఇందులో పాత్రలు, సంభాషణలు కేవలం గిల్పితం!
“Any resemblance to real persons, living or dead, is purely coincidental”

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions