Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆదానీ, అంబానీ… అన్ని వ్యవస్థల్ని శాసిస్తారు, అడ్డగోలు సంపాదిస్తారు… కానీ..?

November 3, 2023 by M S R

దానకర్ణులు… దాతృత్వంలో పెద్దమనసులు… ఉదారశీలురు… ఇలా బోలెడు విశేషణాలతో మీడియా మొత్తం ఓ దిక్కుమాలిన సంస్థ చేసిన సర్వే, లేదా ఓ క్రోడీకరణను ప్రచురించింది,.. ఒక ప్రశ్న… ఈ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిదీ పెద్ద మనసేమీ కాదు… పిల్లికి బిచ్చం పెట్టరు, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు… మహా కక్కుర్తి, సంకుచిత తత్వాలు… మరి ఈ పొగడ్తలేమిటి..?

కార్పొరేట్ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబులిటీ కింద తమ వార్షికాదాయంలో కొంత శాతాన్ని సమాజం కోసం వెచ్చించాలి… అది రూల్… అందులో దానం, ధర్మం, ఔదార్యం ఏమీ లేవు… ఇవ్వాల్సిందే కాబట్టి ఇస్తున్నారు… అదేమీ విరాళం కాదు… ఏడుచుకుంటూనే ఇస్తారు… కొన్ని కంపెనీలైతే ఇచ్చినట్టు నటిస్తాయి, తప్పుడు రిపోర్టులు ఇస్తాయి, అక్కడా ఎగవేతలే… పన్నుల్లాగా… బ్యాంకు రుణాల్లాగా…

సరే, తాజా వార్తల్నే ఓసారి చూద్దాం… EdelGive Hurun India Philanthropy List 2023 ప్రకటించిన టాప్ 10 ధర్మాత్ముల పేర్ల జాబితా ఇది…

Ads

RANK NAME AMOUNT DONATED YOY CHANGE
1 Shiv Nadar & family ₹2,042 cr 76%
2 Azim Premji & family ₹1,774 cr 267%
3 Mukesh Ambani & family ₹376 cr -8%
4 Kumar Mangalam Birla & family ₹287 cr 18%
5 Gautam Adani & family ₹285 cr 50%
6 Bajaj family ₹264 cr 234%
7 Anil Agarwal & family ₹241 cr 46%
8 Nandan Nilekani ₹189 cr 19%
9 Cyrus S Poonawalla & Adar Poonawalla ₹179 cr 60%
10 Rohini Nilekani ₹170 cr 41%

వీళ్లలో నిజంగా మెచ్చుకోవాల్సింది శివ నాడార్ కుటుంబాన్ని… రోజుకు 5.6 కోట్ల మేరకు దాతృత్వం… గత ఏడాది కన్నా దాదాపు డబుల్… తమ ఆదాయంతో పోలిస్తే, సీఎస్ఆర్ కింద ఇవ్వాల్సిన దాంతో పోలిస్తే ఇది చాలా చాలా అధికం… అదీ వాళ్ల గుణం… తరువాత మెచ్చాల్సింది అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం… ఏనాటి నుంచో వాళ్ల పేర్లు మహాదాతల జాబితాలో ఉంటున్నాయి… విరాళం, దానం, దాతృత్వాన్ని తమ కుటుంబ లక్షణాలుగా పాటిస్తారు… ఇక అంబానీ, ఆదానీ సంగతి చూడండి…

దానకర్ణులు

పిల్లికి బిచ్చం పెట్టరు కానీ వ్యవస్థల్ని శాసిస్తారు, వనరుల్ని దోస్తారు… అంబానీ ఆదాయం ఎంత..? తను సొసైటీకి తిరిగి ఇచ్చేదెంత..? శివనాడార్ 2 వేల కోట్లు కాగా అంబానీ జస్ట్, 376 కోట్లు… తన ఆదాయంతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ… పైగా గత ఏడాదికన్నా ఈసారి 8 శాతం తక్కువట… నాలుగో పేరు బిర్లాను కాసేపు పక్కన పెడితే మరో రాజ్యాంగేతర శక్తి ఆదానీ… తన దాతృత్వం 285 కోట్లు… జాబితాలో మిగతా వాళ్ల వివరాల్లోకి వెళ్లడంకన్నా అసలు ఇందులో టాటాల పేర్లు ఎందుకు లేవనేదే పెద్ద ప్రశ్న… దాతృత్వంలో వాళ్లే కదా ఆద్యులు… శివనాడార్ రోజుకు 5.6 కోట్ల విరాళం ఇస్తున్నాడట… గ్రేట్…

shiva nadar

అవునూ, ఇందులో వారానికి 70 గంటలు పనిచేయాలోయ్ అని ఉద్బోధిస్తున్న నారాయణమూర్తి పేరు ఏది..? మన మేఘాలు, పిచ్చిరెడ్ల పేర్లు ఏవి..? ఎవడో రాసుకొచ్చాడు… ముగ్గురు తెలుగువాళ్ల పేర్లున్నాయ్ అని… వాళ్ల ఆదాయం ఎంత..? సీఎస్ఆర్ కింద ఎంత ఇవ్వాలి..? ఎంత ఇస్తున్నారు..? ఖచ్చితంగా మన తెలుగు వాళ్ల కంపెనీలకు ‘‘సొసైటీకి తిరిగి ఇచ్చే గుణం’’ లేదు… ఇక రాదు… ఏ పొలిటిషియన్‌కో, పార్టీకో ఇవ్వమంటే మాత్రం అడ్డగోలు కమీషన్లు, క్విడ్ ప్రోకోలు… తక్కువ కాలంలోనే వేల కోట్లకు పడగలెత్తిన సంపన్నులు తెలుగువాళ్లలో బోలెడు మంది… ఎవ్వడూ సొసైటీకి మాత్రం పైసా తిరిగి ఇవ్వడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions