Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ కాల్పుల కలకలం…! ఇరాన్‌కు ట్రంప్ భౌతిక లక్ష్యమా..?

May 24, 2026 by M S R

.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, వందల సీసీ కెమెరాల నిఘా, ఎప్పటికప్పుడు అందే సీక్రెట్ ఇన్‌ఫర్మేషన్ వ్యవస్థ… ప్రపంచ అగ్రదేశ అధ్యక్షుడి నివాసం వైట్‌హౌజ్ దగ్గరుండే సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్ద ఎవరో ఓ దుండగుడు 30 రౌండ్ల కాల్పులు జరపడం, ఆ సమయంలో ట్రంప్ వైట్ హౌజ్‌లోనే ఉండటం అంటే, అది అమెరికా ఇంటలిజెన్స్, భద్రత వ్యవస్థలకు అవమానకరమే…

ట్రంప్ మీద హత్యాప్రయత్నాలు కొత్తేమీ కాదు… గతంలోనూ ఉన్నాయి, అంతెందుకు గత ఎన్నికలకు ముందు తనపై కాల్పులు జరిగితే తృటిలో తప్పించుకున్నాడు, చెవికి గాయంతో బయటపడ్డాడు… మొన్నామధ్య వైట్ హౌజ్ జర్నలిస్టులకు విందు ఇచ్చే సందర్భంలోనూ కాల్పులు జరిగాయి… అప్పటికప్పుడు ఉపాధ్యక్షుడిని, అధ్యక్షుడిని సీక్రెట్ ప్లేసుల్లోకి తరలించారు…

Ads

ఆమధ్య ఓ ఇరాకీ సైన్యానికి చెందిన వ్యక్తి దగ్గర ట్రంపు కూతురు ఇవాంకా ఇంటి మ్యాప్ దొరికింది… అంతకుముందు ట్రంపు మీద హత్యాప్రయత్నాలకు వేర్వేరు కారణాలు ఉండవచ్చునేమో గానీ, రీసెంట్ సంఘటనలన్నీ ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించాక జరుగుతున్నవే… అంటే, ఇరాన్ ట్రంపు కుటుంబాన్ని టార్గెట్ చేసిందా..?

ఈ కోణంలో అమెరికన్ ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేస్తోందంటున్నారు… కానీ ఆమేరకు భద్రత మరింత కట్టుదిట్టం ఎందుకు కాలేదనేది ప్రశ్నే… ట్రంపు రెండో టరమ్‌లో కొందరు కీలక భద్రత ముఖ్యులను తప్పించడం వెనుక కారణాలేమిటనేదీ ప్రశ్నే…

మే 4న కూడా వైట్ హౌజ్ సమీపంలో ఆయుధంతో తిరిగిన వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ కాల్పులు జరిపింది… అంతకుముందే ఉపాధ్యక్షుడు JD Vance మోటర్‌కేడ్ ఆ ప్రాంతం గుండా వెళ్లింది… ట్రంప్‌పై గతంలో కూడా పలు హత్యాయత్నాలు లేదా కుట్రలు వెలుగులోకి వచ్చాయి…

2024 ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం కాగా, మరోసారి గోల్ఫ్ కోర్స్ సమీపంలో అనుమానాస్పద వ్యక్తిని అరెస్ట్ చేశారు…. అమెరికా న్యాయశాఖ గతంలో ఇరాన్‌కు అనుబంధంగా భావించిన వ్యక్తులపై “ట్రంప్‌ను హత్య చేయడానికి కుట్ర” ఆరోపణలు మోపింది…

అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు, ముఖ్యంగా Islamic Revolutionary Guard Corps కి చెందిన నెట్‌వర్క్‌లు ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించే అవకాశం ఉందని చాలా కాలంగా హెచ్చరిస్తున్నాయి… కారణం — ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ జనరల్ Qasem Soleimani హత్యకు ఆదేశాలు ఇవ్వడం, ప్రస్తుత యుద్దం… అప్పటి నుంచి ఇరాన్ హార్డ్‌లైన్ వర్గాల నుంచి బహిరంగ ప్రతీకార హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి…

అయితే ఇప్పటి తాజా కాల్పుల ఘటనలన్నీ ఒకే కుట్రలో భాగమా? లేక విడివిడిగా జరిగిన భద్రతా ఘటనలా? అన్నది ఇంకా స్పష్టంగా లేదు… FBI, Secret Service దర్యాప్తు కొనసాగిస్తున్నాయి… కారణాలు బయటపడాల్సి ఉన్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ కాల్పుల కలకలం…! ఇరాన్‌కు ట్రంప్ భౌతిక లక్ష్యమా..?
  • ఏపీ పెట్టుబడుల కథల్లో… లెక్కలకంటే ‘సంపాదన’ ప్రశ్నలే ఎక్కువ..!
  • ప్రేమ గుడ్డిదే కాదు, కుంటిది కూడా… రమణీ కల్యాణం మీద ఒట్టు…
  • ఐపీఎల్ చివరి దశలోనూ బుడ్డోడే మళ్లీ కీలకం… అదెలాగంటే…
  • కుర్చీ మడతపెట్టిన తాతకు ఎందరు ఫాలోయర్లు ఉన్నారో తెలుసా..?!
  • మిస్టర్ కూల్…! నిశ్శబ్దంగా ముగిసిన ఒక శకం… నిరాసక్తంగా…!!
  • భానుమతికి ఇలాంటి పాత్రలు పడాలి… ‘పెద్దరికం’తో రెచ్చిపోదా మరి…
  • పాపం కేటీయార్..! వారసపోరులో దూసుకుపోతున్న హరీష్ రావు..!!
  • Don … అనేక అరిష్టాలను దాటుకుని… ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్…
  • పత్రికా స్వేచ్ఛలో No-1 అట… మీడియా విలువల్లో మాత్రం జీరో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions