Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…

May 16, 2025 by M S R

.

తెర మీద వేరు… తెర వెనుక వేరు… మొన్న మనం చెప్పుకున్నాం కదా… మన ప్రధాన శత్రువులు పాకిస్థాన్, చైనా మాత్రమే కాదు, మాల్దీవులు, టర్కీ, అజర్‌బైజాన్ ఎట్సెట్రా… మరి మన మిత్రులు, కాలపరీక్షకు నిలిచింది రష్యా, ఇజ్రాయిల్… అంతే… మరి అమెరికా..?

అదే చెప్పాలని అనుకుంటున్నది… ముందుగా ఓ వార్త చదువుదాం,.. మెయిన్ స్ట్రీమ్ మీడియా పబ్లిష్ చేసిందే… ఏమిటంటే..? కాస్త సీరియస్‌గా చదవండి, సీరియస్‌గానే చెబుతున్నాను… సరళంగా చెబుతాను, వాణిజ్య, యుద్ధ పరిభాషలో కాకుండా….

Ads

‘‘ట్రంపు కుటుంబానికి ఓ కంపెనీ ఉంది, అది భవిష్యత్ క్రిప్టో కరెన్సీకి సంబంధించింది… పేరు ఫిన్‌టెక్ కంపెనీ… ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో పాటు ఆయన అల్లుడు జెరెడ్ కుష్నర్‌లకు మొత్తం 60 శాతం వాటా అందులో…

దక్షిణాసియాలోనే పాకిస్థాన్‌ను క్రిప్టో కేపిటల్ చేయాలని ప్లాన్… దానికి ట్రంపు కుటుంబ కంపెనీ ప్లస్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే కంపెనీతో పొత్తు… దానికి క్రిప్టో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోను తమ సలహాదారుగా నియమించారు… మరి క్రెడిబులిటీ కావాలి కదా…

మరి పాకిస్థాన్..? ఇటీవలే ఏర్పాటు చేసింది పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్… దీంతో సదరు ట్రంపు ఫ్యామిలీకి చెందిన క్రిప్టో కంపెనీతో ఒక ఒప్పందం జరిగింది… అందులో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ రాజకీయ, వ్యాపార ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నట్టు సమాచారం…

అంటే అంతిమంగా అర్థమైంది ఏమిటి..? ట్రంపుకూ, క్రిప్టో కరెన్సీకి, పాకిస్థాన్ ముఖ్యులకూ నడుమ ఆర్థిక, హార్దిక సంబంధాలు… పాకిస్థాన్ వైపు లీడర్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్… ఆర్మీ చెప్పినట్టే కదా పాకిస్థాన్ వినేది… ఓసారి ట్రంపు టీమ్ పాకిస్థాన్ వస్తే ఏకంగా మునీర్ స్వాగతం పలకడమే కాదు, ప్రధానితో భేటీ కూడా…

ఈ బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి జెకరీ విట్‌కాఫ్ ట్రంప్‌కి వ్యాపార భాగస్వామిగా పనిచేసిన స్టీవ్ విట్‌కాఫ్ కుమారుడు… స్టీవ్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ప్రత్యేక రాయబారిగా ఉన్నారు… (టైమ్స్ పబ్లిష్ చేసిన స్టోరీయే ఇది…)

అర్థమైంది కదా… పాకిస్థాన్‌కూ ట్రంపుకీ నడుమ ఎలాంటి బంధాలున్నాయో… ఇక చదవండి, ఒక్కో వార్తనూ విడిగా కాదు, క్రోడీకరించుకుంటూ…. కలిసి చదువుకుంటూ…

… ట్రంపు రాగానే ఇండియన్ ఉద్యోగులు, వలసదారులు, విద్యార్థులపై పిడుగులు కురిపిస్తున్నాడు…

… వాడు మనపై టారిఫ్ వేస్తాడట గానీ ఇండియా జీరో టారిఫ్ అమలు చేయాలట…

…. వాణిజ్యం పేరు చెప్పి నేను పాక్, ఇండియా నడుమ కాల్పుల విరమణకు ఒప్పించాను అంటున్నాడు…

…. యాపిల్ వంటి సంస్థలు ఇండియాలో ఉత్పత్తిని పెంచకూడదట…

అంతెందుకు… పాకిస్థాన్‌కు మత దోస్తు తుర్కియేకు ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు అమ్మాలని అమెరికా నిర్ణయించింది… విలువ 2000 కోట్లు… ఇది తాజా నిర్ణయం…

కొలువులు, వీసాలు, చదువులు, గ్రీన్ కార్డులు, బై బర్త్ సిటిజెన్ షిప్ అన్నింట్లోనూ ట్రంపు ధోరణి ఇండియన్లకే అధిక నష్టం… చివరకు మనవాళ్లు మనకు డబ్బు పంపితే 5 శాతం కట్ చేస్తాడట… ట్రంపు గురించి చెబుతూ పోతే ఎన్నెన్నో ఇలా…

…….. ఎస్, ట్రంపుడు పక్కా భారత వ్యతిరేకి… ఎందుకు..? అమెరికా మొదటి నుంచీ అంతే… జస్ట్, మధ్యలో చైనాకు అనుకూలంగా కాస్త రష్యా తోక జాడించింది గానీ అది ఇప్పటికీ మన నిజమైన మిత్ర దేశం… దాన్ని మించిన మిత్రుడు ఇజ్రాయిల్… అంతే…

మరి అమెరికా..? దానికి ఇండియా పెద్ద వినిమయ మార్కెట్ కావాలి, ఆయుధాలు అమ్ముకోవాలి… చైనాతో వైరానికి ఓ అడ్డా కావాలి… ఇలా… అమెరికా ఆలోచనలు, అడుగులు ఎప్పుడూ ఇండియాకు వ్యతిరేకమే… ఈ పహల్‌గామ్స్, ఈ ఆపరేషన్ సిందూర్స్… అది ఏవో బెదిరింపులతో కట్టడి చేస్తుంది.,. వాడూ వాడి బొంద ఉగ్రవాదంపై పోరాటం… జంట టవర్లు కూలినా సిగ్గులేని దేశం…

ఎప్పుడైతే పాక్ అణ్వస్త్రాలకు ముప్పు అని తెలిసిందో అందరికన్నా ముందే వణికిపోయి, కాల్పుల విరమణకు ఒత్తిడి చేసింది ట్రంపు… వాడికి పాకిస్థాన్ సుభిక్షంగా ఉండాలి…

విచిత్రం ఏమిటంటే… పాకిస్థాన్ చైనా తొత్తు… ఆ చైనాకూ అమెరికాకూ పడదు… ఓ సంక్లిష్ట అంతర్జాతీయ రాజకీయ సమీకరణం… మరి మోడీకి, తన టీమ్‌కు ఇవన్నీ తెలియవా..? అన్నీ తెలుసు… దేఖ్‌తే రహో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions