కాంతార సినిమా ఎంత హిట్టో తెలుసు కదా… అందులో చివరలో వచ్చే వరాహరూపం ఆ సినిమాకు ప్రాణం… ఇప్పుడు ఆ పాట వివాదంలో చిక్కుకుంది… కేరళలో చాలా పాపులర్ ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ మాతృభూమి కప్పా టీవీ 2017లో రిలీజ్ చేసిన నవరసం పాటకు వరాహరూపం కాపీ అనేది తాజా వివాదం… దీనిపై సదరు కంపెనీ కాంతార నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్‌పై, దర్శకుడిపై కేసులు వేయాలని భావిస్తోంది…
2 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లున్న ఈ యూట్యూబ్ మ్యూజిక్ చానెల్‌కు ఫాలోయింగ్ ఎక్కువే… రకరకాల కాన్సెప్టులు తీసుకుని సాంగ్స్ చేస్తుంటారు… ప్రత్యేకించి ఈ నవరసం పాటకు యూట్యూబులో 42 లక్షల వ్యూస్ ఉన్నాయి… నిజానికి తన సబ్‌స్క్రయిబర్ బేస్‌కు, అయిదేళ్ల పీరియడ్‌లో ఆ వ్యూస్ సంఖ్య తక్కువే… కానీ ‘థాయిక్కుడమ్ బ్రిడ్జి’ పేరిట రూపొందించిన ఈ సాంగ్‌ను కాంతార నిర్మాతలు కాపీ చేశారనేది వాళ్ల అభియోగం…
నిజానికి రెండు పాటలూ నిశితంగా గమనిస్తే… స్థూలంగా ట్యూన్ అక్కడక్కడా పోలి ఉన్నట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది… కానీ రెండూ వేర్వేరు… కాకపోతే మోడరన్ మ్యూజిక్‌కు కర్నాటక మ్యూజిక్‌తో ఫ్యూజన్ రెండు పాటల్లోనూ పోలిక… అది కాపీ ఎలా అవుతుంది..? పైగా కంటెంట్ వేరు… అన్నింటికీ మించి రెండు వీడియోల్లోనూ కనిపించే ఆదివాసీ అర్చనరీతులు పూర్తిగా వేరు…
Ads
నిజానికి మంగుళూరు ప్రాంతంలోని భూత్ కోళకు ఉత్తర కేరళ ప్రాంత థెయ్యిం అర్చన రీతులు, ఆ కళారూపాలు, ఆహార్యం, అలవాట్లు, నమ్మకాలు కూడా దాదాపు సేమ్… కానీ ఈ ప్రైవేటు వీడియోలో చూపించిన ఆహార్యం కథాకళి డాన్స్ ఫామ్‌కు సంబంధించింది… నిజానికి ఒక ప్రాంతంలో దాదాపు ఒకేరీతిలో విశ్వాసాలు, జానపద కళారూపాలు, వాయిద్యాలు ఉన్నప్పుడు కొంత పోలిక తప్పకుండా ఉంటుంది… దానికి కాపీ అని ముద్ర వేయాల్సిన అవసరం లేదు…
మా వీడియో ఓసారి చూడండి అంటూ సదరు ప్రైవేటు మ్యూజిక్ కంపెనీ సోషల్ మీడియా ప్రచారానికి దిగడంతో ఆ వీడియో కామెంట్లలో, కాంతార పాట కాపీ అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది… నిజానికి కాంతార మొదట్లో పాన్ ఇండియా సినిమాగా తీయాలని అనుకోలేదు… దర్శకుడు తన టేస్టుకు, తన చిన్నప్పటి అనుభవాలకు సరిపడా ఓ కథను రాసుకుని, దాన్నే ఓ చిన్న సినిమాగా తీశాడు… ఇందులో కథ వేరు, ట్రీట్‌మెంట్ వేరు… క్లైమాక్స్ గురించి చెప్పనక్కర్లేదు… అది భూత్ కోళ కాదు, న భూతో కళ…
అలాంటప్పుడు ఇంకేదో ప్రైవేటు సాంగ్‌ను కాపీ కొట్టే అగత్యం మాత్రం కనిపించడం లేదు… పైగా ఇప్పటికే 200 కోట్లు దాటిపోయాయి దాని వసూళ్లు… ఐనాసరే, మేధోచౌర్యం మీద చర్చ, విచారణ జరగాల్సిందే అంటారా..? ఏమో… కోర్టులకు అంతటి రాగపరిజ్ఞానం ఎలా..?! సున్నితమైన తేడాలపై సునిశిత పరిశీలన ఎలా..? పోనీలెండి… ఆ రెండు వీడియోలను ఓసారి చూసేయండి ఇక్కడ…
Share this Article