Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదెక్కడి చోద్యం రాజమౌళీ? డబ్బు కావాలి గానీ థాంక్స్ చెప్పవా..?!

September 17, 2026 by M S R

.

పాన్ -వరల్డ్ సినిమాగా ప్రచారం పొందుతున్న మహేశ్ బాబు సినిమా వారణాసిపై ఓ కొత్త సమాచారం, వార్త ఆసక్తికరం అనిపిస్తోంది… కొన్ని వెబ్‌సైట్లలో కనిపిస్తున్న వార్త ఏమిటంటే..? ఈ సినిమాకు దుబాయ్‌కు చెందిన ఓ పెద్ద ఫైనాన్షియర్ నిధులు సమకూరుస్తున్నాడు…

థాంక్స్ కార్డులో ఆయన ఫోటో, పేరు వేయడానికి సినిమా టీమ్ అంగీకరించిందట… తీరా ఇప్పుడు నో చెబుతోందట… అదేమిటయ్యా అనడిగితే ఓ వింత కారణం చెబుతున్నారట… అదేమిటంటే..? ‘ఈ సినిమాలో ఒక మతానికి సంబంధించిన కథ- కంటెంటు… ఫైనాన్షియర్ మతం వేరు… అందుకని ఈ రెండింటి నడుమ పొంతన, శృతి కుదరడం లేదు కాబట్టి సదరు ఫైనాన్షియర్‌కు క్రెడిట్ ఇవ్వడం బాగోదు…..

Ads

ఇదీ వినిపిస్తున్న వార్త, సమాచారం… వింతగా అనిపిస్తోంది నిజంగానే… వారణాసి హిందూ మతానికి సంబంధించిన మతవ్యాప్తి కథో, ధర్మప్రచారమో కాదు… పురాణం కూడా కాదు… పక్కా ఫిక్షన్… ఇప్పుడు ట్రెండ్ భక్తి, పురాణాల వైబ్స్ కాబట్టి, కథను అలా వండుకున్నారు… ఇదేమీ హనుమాన్ అంశ్ వంటి పక్కా డివోషనల్ వైబ్స్ సినిమా కూడా కాదు… పైగా ఈ దర్శకుడు నేను నాస్తికుడిని అని చెప్పుకుంటాడు…

అంతేకాదు, ఒక సినిమా టీమ్‌లో బోలెడు మంది పనిచేస్తుంటారు… పలు మతాలకు, పలు దేశాలకు చెందినవాళ్లు రకరకాల విభాగాల్లో… వాళ్ల పేర్లు ఇవ్వడం లేదా..? ఇక్కడ క్రెడిట్ ఇవ్వడానికి మతం ప్రస్తావన ఎందుకొస్తోంది..? అంతెందుకు? 4 వేల కోట్ల భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్టు రామాయణానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం… పైగా ఇది పక్కా పురాణకథ… ఐతేనేం, రెహమాన్ పేరును సినిమా టీమ్ ప్రముఖంగా చెబుతోంది, ఫోకస్ చేస్తోంది…

చెప్పనే లేదు కదూ… ఆ దుబాయ్ ఫైనాన్షియర్ పేరు Financier- Ahmad Golchin (UAE based Billionaire) … సినిమాలో కథ మతం వేరు- ఫైనాన్షియర్ మతం వేరు అనే సాకు మాత్రం ఖచ్చితంగా అబ్సర్డ్… ఫైనాన్షియర్‌ పేరు, ఫోటో థాంక్స్ కార్డులో ఉండటానికి ఖచ్చితంగా అర్హమే…

ముందు అంగీకరించి, ఇప్పుడు నో చెప్పడం కూడా అనైతికమే… ఇందులోకి మతాన్ని తీసుకురావడం రాజమౌళి ఆలోచనల్లోని బ్లండర్..!! మరి డబ్బు తీసుకోవడానికి మతం అడ్డురాలేదా రాజమౌళీ..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ బుల్‌డోజర్ దాడి! పెద్ద దొర గడీ ప్రహారీ గోడలకు బీటలు!!
  • ఇదెక్కడి చోద్యం రాజమౌళీ? డబ్బు కావాలి గానీ థాంక్స్ చెప్పవా..?!
  • 100 శాతం టారిఫ్ పిడుగు! ఇండియా- అమెరికా బంధాలకు విషమ పరీక్ష !!
  • సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్..! ఆశ తీరలేదు – కల నిజం కాలేదు !!
  • ‘చీట్ స్మాల్… చీట్ మెనీ…’ ఓ ఫేక్ మేట్రిమోనీ..! ఇదోరకం ఫ్రాడ్ మనీ !!
  • మళ్లీ ప్రభాస్ ఆదిపురుష్‌పై ట్రోలింగ్ ! గోకి తిట్లు తినడమంటే ఇదే !!
  • హైదరాబాద్ విముక్తి దినం ! తెలంగాణ పార్టీల ఆత్మాభిమాన దరిద్రం !!
  • సీమా పాహుజా ! క్లిష్టమైన ప్రతి సీబీఐ కేసూ ఈమె దర్యాప్తు చేయాల్సిందే !!
  • వింత సర్వేలు ! చిత్త భ్రమలు !! పింక్ క్యాంపు ‘పవర్ డ్రీమ్స్’ !!!
  • యూపీఏ బాదుడులో ఎవరికెంత ఆదాయ వాటా? ఇవీ అసలు లెక్కలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions