.
ఓహ్… విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉందా..? అరె, ఆమె ఇంకా రాజకీయాల్లో కొనసాగుతోందా..? అబ్బో, ఈమె కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందట..? అవునూ, ఈమెకు ఎమ్మెల్సీ ఇస్తే కాంగ్రెస్‌కు పైసా ఫాయిదా ఉంటుందా..? అసలు ఆమె పేరు వినిపించక ఎన్నేళ్లయింది,..? ఫాఫం, ఆమె పేరు ఎంపిక వార్త తెలిసి కాంగ్రెస్ శ్రేణులే షాక్‌లో మునిగిపోయాయి… సీఎం, పీసీసీ అధ్యక్షుడు సహా పార్టీ ముఖ్యులందరూ ఇంకా తేరుకోలేదు……
…… కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మండలికి పంపిస్తున్నదనే వార్త తెలిశాక సోషల్ మీడియా స్పందన ఇది… అన్నీ నిజాలే… అసలు కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటో, ఆశించిన ప్రయోజనం ఏమిటో, ఆ ఎంపికలో వ్యూహం ఏమిటో అర్థం గాక రాజకీయ విశ్లేషకులు కూడా తలపట్టుకున్నారు…
Ads
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చింది… ఇక చూసుకొండి, కాంగ్రెస్ కథే మారిపోతుంది అని కొన్నాళ్లుగా ఊదరగొడుతున్నారుగా… కథ మారిపోతుంది ఇలాగేనా అనే కొత్త విమర్శలు స్టార్టయ్యాయి…
అన్నీ వాస్తవాలే… ఎన్నేళ్లయింది విజయశాంతి జనజీవనంలో లేకుండా పోయి..? వీసమెత్తు ఫాయిదా ఉందా కాంగ్రెస్ పార్టీకి ఆమెతో..? యాక్టివ్ పాలిటిక్సులో ఉన్నవాళ్లకు, ఏ కారణాలు చెప్పినా సరే, అవకాశాలు ఇస్తే పార్టీ శ్రేణులు అర్థం చేసుకోగలవు… కానీ ఆమె అసలు రాజకీయ తెర మీదే లేదు కదా…
ఎవరో రాసుకొచ్చారు..? కవిత బీసీ నినాదంతో యాక్టివ్ అయిపోయింది, ఆమెకు చెక్ పెట్టడానికి విజయశాంతిని మండలికి పంపిస్తున్నారు అని… నవ్వొచ్చింది… కవిత ఎక్కడ.,.? విజయశాంతి ఎక్కడ..? కవితకు గ్రాస్పింగ్ ఉంది, సబ్జెక్టు స్టడీ చేయగలదు, ఏది ఎంత వరకు మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు ఏ నినాదం ఎత్తుకోవాలో తెలుసు, ఆమె రియల్ పొలిటిషియన్…
కవిత జనంలో తిరగగలదు, సభల్లో మాట్లాడుతుంది, సభల్ని ఆర్గనైజ్ చేస్తుంది… కానీ విజయశాంతి…? ఆమె మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు… వర్తమాన రాజకీయాలపై గానీ, అవసరమైన సబ్జెక్టులపై గానీ ఆమెకు ఏమీ తెలియదు… అసలు ఇదేం పోలిక…? పైన చెప్పిన కారణమే నిజమైతే కాంగ్రెస్ ఫాఫం అని జాలిపడాల్సిందే…
అద్దంకి దయాకర్‌కు చాన్నాళ్లుగా అన్యాయం జరుగుతోంది పార్టీపరంగా… ఇప్పుడు తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం సరైన చర్యే… దాన్ని అర్థం చేసుకోవచ్చు… శంకర్ నాయక్ ఎంపిక కూడా వోకే… బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్ ఎంపిక కూడా సరైనదే… కేసీయార్ నిర్ణయం కరెక్టు…
గతంలో దాసోజును ఎమ్మెల్సీగా చేసినా సరే, అనేక కారణాల రీత్యా అది అమల్లోకి రాకుండా పోయింది… సో, ఇప్పుడు న్యాయం జరుగుతోంది… రోజూ బలంగా పార్టీ వాయిస్ వినిపించేవాళ్లలో ప్రథముడు తాను… మండలిలో పార్టీ వాయిస్ వినిపించగలడు… అన్నట్టు… సీపీఐలో ఎప్పుడూ ఏ అవకాశం దక్కినా రెడ్లే తన్నుకుపోతారనే విమర్శ ఉంది కదా…
ఈసారి ఒక బీసీకి చాన్స్ ఇస్తున్నారు… పార్టీలో తీవ్ర మథనం కూడా జరిగినట్టుంది… చివరకు నెల్లికంటి సత్యం పేరుకు టిక్ పెట్టినట్టున్నారు… గుడ్… మంచి మార్పే…!!
Share this Article