.
గుళ్లలోకి దేవుడి దగ్గరకు అసలు రానివ్వని దుర్మార్గపు వివక్ష రోజుల నుంచి… దేవుడే ఆ వాడల్లోకి వస్తున్న, గుళ్లు కూడా కట్టుకుంటున్న రోజులు ఇవి… దళిత గోవిందం కావచ్చు, ఇప్పుడు టీటీడీ 5 వేల గుళ్ల నిర్మాణ నిర్ణయం కావచ్చు…
తిరుమల హుండీలో వేసే ప్రతి రూపాయి వెనుక ఆ దాత అంతరార్థం… వెంకన్న ఖ్యాతి విస్తరణ, హిందూ ధర్మ రక్షణ, ప్రచారం… టీటీడీ అదే పని చేస్తుంటే వైఎస్ షర్మిలకు ఎందుకు అభ్యంతరం..? ఎందుకంటే..? ఆమె కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలికన్నా ఈరోజుకూ ఓ మతప్రచారకురాలిగానే మాట్లాడుతోంది…
Ads
బీజేపీ మాధవ్, యామిని వంటి ఒకరిద్దరు మినహా… నూతన వీర సనాతన ధర్మపరిరక్షకుడి నోటి వెంట ఒక్క మాట లేదు… సరే, చంద్రబాబు రకరకాల కారణాల రీత్యా స్పందించడు… మరి టీటీడీ పెద్దల నుంచి స్పందన సరిగ్గా ఉందా..? ఎందుకు లేదు..? బీజేపీ మినహా కూటమిలోని జనసేన, టీడీపీ ఆమె విమర్శను యాక్సెప్ట్ చేస్తున్నట్టా..?
నిజానికి షర్మిలను ఎందుకు ఏపీసీసీ అధ్యక్షురాలిని చేసినట్టు..? వీసమెత్తు ఫాయిదా ఉందా..? ఆమెకు కిరీటం పెట్టగానే పోలోమంటూ జగన్ బ్యాచ్ అంతా వాపస్ వస్తారనే పిచ్చి భ్రమా..? రాష్ట్ర విభజన దగ్గర నుంచి మొత్తం ఇలాంటి పిచ్చి వ్యూహాలే కాంగ్రెస్‌వి… జగన్‌ను తొక్కేసి, కాంగ్రెస్‌ను ఉద్దరిస్తాడని కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంను చేసినట్టే ఇదీనూ…
గుళ్లు కాదు, బళ్లు కట్టండి అని ఉరుముతుంది షర్మిల… అవీ కడతారు, ఇవీ కడతారు, నీకేం అభ్యంతరం..? కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనే సోయి కూడా లేకపోతే ఎలా..? సెక్యులర్ అంటే హిందూ వ్యతిరేకత కాదు తల్లీ..! అసలే ముక్కీ మూలుగుతూ ఇక చస్తే లేవదు అనే స్థితిలో ఉన్న ఏపీ కాంగ్రెస్‌కు ఆ వెంటిలేటర్‌నూ తొలగించే ప్రయత్నమా ఇది…
షర్మిల విమర్శలపై దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ పట్ల నెగెటివిటీని పెంచుతోంది… సీబీఐ మాజీ డైరెక్టర్, తెలంగాణకు చెందిన రిటైర్డ్ ఐపీష్ నాగేశ్వరరావు ఓ ట్వీట్‌లో ఏమంటాడంటే..?
‘‘కాంగ్రెస్ పార్టీ పేరును (Indian National Congress) ను INDIAN NATIONAL CHURCH అని మారుస్తారా..? ‘by Christians, of Christians, and for Christians’ అనే హిందూ వ్యతిరేక విధానమేనా మీది..? సోనియా, వాద్రా కుటుంబం మొత్తం క్రిస్టియన్లే కాబట్టి షర్మిల టీటీడీ గుళ్ల వ్యాఖ్యలపై సమీక్ష లేదా..?’’
కొడుకు పెళ్లిని కూడా హిందూ తంతులాగే జరిపించి… తీరా తూచ్, అదేమీ లేదు, అది క్రైస్తవ వివాహమే అని తల్లీకూతుళ్లు ఇద్దరూ వివరణలు ఇచ్చుకున్నారు అప్పట్లో… మరెందుకు హిందూ తంతుగా జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం..? ఆమె మొదటి నుంచీ అంతే…
నీ మతం నీ అభిమతం… ఎవరికీ ఉండదు అభ్యంతరం… కానీ ఈ దేశ ప్రధాన మతంపై ద్వేషం దేనికి..? విషం దేనికి..? ఇదీ ఆమె టీటీడీ గుళ్లపై చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియా స్పందనల సారాంశం… మిస్టర్ రాహుల్ గాంధీ..? వాట్ డు యు సే…!?
Share this Article